Homeఎంటర్టైన్మెంట్Vijay Sethupathi Kaattaan web series review: విజయ్ సేతుపతి 'కాటన్' వెబ్ సిరీస్ రివ్యూ.....

Vijay Sethupathi Kaattaan web series review: విజయ్ సేతుపతి ‘కాటన్’ వెబ్ సిరీస్ రివ్యూ.. ఇదేమి స్టోరీ బాబోయ్..

Vijay Sethupathi Kaattaan web series review: హీరో గా క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో విభిన్నమైన పాత్రలు పోషిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని ఏర్పాటు చేసుకున్న విజయ్ సేతుపతి(Vijay Sethupathi), తన సొంత బ్యానర్ లో హీరో గా నటించిన ‘కాటన్ ‘(Kaattan) అనే వెబ్ సిరీస్ రీసెంట్ గానే జియో హాట్ స్టార్ యాప్ లో స్ట్రీమింగ్ మొదలు పెట్టుకుంది. మన అందరికీ తెలిసిందే, విజయ్ సేతుపతి అంత తేలికగా ఒక సినిమాని […]

Vijay Sethupathi Kaattaan web series review: హీరో గా క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో విభిన్నమైన పాత్రలు పోషిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని ఏర్పాటు చేసుకున్న విజయ్ సేతుపతి(Vijay Sethupathi), తన సొంత బ్యానర్ లో హీరో గా నటించిన ‘కాటన్ ‘(Kaattan) అనే వెబ్ సిరీస్ రీసెంట్ గానే జియో హాట్ స్టార్ యాప్ లో స్ట్రీమింగ్ మొదలు పెట్టుకుంది. మన అందరికీ తెలిసిందే, విజయ్ సేతుపతి అంత తేలికగా ఒక సినిమాని కానీ, వెబ్ సిరీస్ ని కానీ ఒప్పుకోడు , తన పాత్ర చాలా బలంగా ఉండాలి, అదే విధంగా కథ కూడా చాలా కొత్తగా, వైవిధ్యంగా ఉండాలి. అప్పుడే ఆయన ప్రాజెక్ట్ చెయ్యడానికి అంగీకరిస్తాడు. ఈ ‘కాటన్ ‘ వెబ్ సిరీస్ ని కూడా ఆయన అందుకే ఒప్పుకున్నాడు. ఈ వెబ్ సిరీస్ కి నేషనల్ అవార్డు విన్నర్ మణికందన్ దర్శకత్వం వహించడంతో అంచనాలు భారీగా ఉండేవి.

అలా భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ వెబ్ సిరీస్ , ఆ అంచనాలను అందుకోవడం లో సక్సెస్ అయ్యిందా లేదా అనేది ఇప్పుడు ఈ రివ్యూ లో చూద్దాం. ఈ వెబ్ సిరీస్ లో మొత్తం 10 ఎపిసోడ్స్ ఉంటాయి. స్టోరీ లైన్ విషయానికి వస్తే, పోలీసులకు ఒక చోట ఒక వ్యక్తి తల కనిపిస్తుంది. ఆ తల ఎవరిదో కాదు, విజయ్ సేతుపతి దే. అయితే ఆయన ఎవరు , ఎందుకు ఇలా హత్య కి గురి కాబడ్డాడు అనే అంశం చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది. ఈ క్రమం లో విజయ్ సేతుపతి ఫ్లాష్ బ్యాక్ తెలుస్తుంది. మొదటి ఎపిసోడ్ ఆరంభం లో కాస్త స్లో స్క్రీన్ ప్లే తోనే ఈ వెబ్ సిరీస్ మొదలు అవుతుంది. కానీ ఆ తర్వాత ఎపిసోడ్ ఆసక్తికరమైన ప్లాట్ తో ముందుకు వెళ్తూ ఉంటుంది.

కానీ రెండవ ఎపిసోడ్ నుండే ఈ వెబ్ సిరీస్ మన సహనానికి పరీక్ష పెడుతుంది. ఇది క్రైమ్ థ్రిల్లర్ జానర్ సినిమానా ?, లేదంటే ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ జానర్ సినిమానా ?, హారర్ థ్రిల్లర్ జానర్ సినిమానా ? అనేది అసలు అర్థం అవ్వదు. క జానర్ లో కూడా ఈ సినిమా ప్రేక్షకులను అలరించదు . కేవలం 8, 9 ఎపిసోడ్స్ మాత్రమే బాగుంటాయి. ఎందుకంటే కథలోని అసలు ప్లాట్ ఆ రెండు ఎపిసోడ్స్ లోనే రివీల్ అవుతుంది కాబట్టి. విజయ్ సేతుపతి వీరాభిమానులు ఎవరైనా ఉంటే ఈ వెబ్ సిరీస్ ని ట్రై చేయొచ్చు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper