Vikram: కంబ్యాక్ కోసం విశ్వ ప్రయత్నం చేస్తున్న తమిళ్ స్టార్ హీరో…

విక్రమ్ హీరోగా ఒక సినిమా వస్తుందంటే అందులో ఖచ్చితం గా ఏదో ఒక కొత్తదనం అయితే ఉంటుంది. ఇక ప్రేక్షకులు కూడా ఆయన సినిమాలను చూడటానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు...

Written By: Gopi, Updated On : July 25, 2024 5:27 pm

Vikram

Follow us on

Vikram: తమిళ్ సినిమా ఇండస్ట్రీ లో ఉన్న హీరోలు కథల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. వాళ్లు కమర్షియల్ సినిమాలను చేయడం కంటే వైవిధ్యభరితమైన సినిమాలను చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు. అందులోనూ వాళ్ళ క్యారెక్టర్ కి పేరు తెచ్చే పాత్రలు మాత్రమే ఎంచుకొని నటిస్తూ ముందుకు సాగుతూ ఉంటారు. ఇక ఇలాంటి క్రమంలోనే సినిమా తమిళ్ ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ హీరోగా పేరు సంపాదించుకున్న నటుడు కమల్ హాసన్…ఇక ఆయన తర్వాత ఆ రేంజ్ లో నట విశ్వరూపాన్ని చూపించ గలిగే సత్తా ఉన్న నటుడు విక్రమ్… ప్రస్తుతం విక్రమ్ తంగలన్ అనే సినిమాతో బిజీగా ఉన్నాడు. అయితే ఈ సినిమా ఆగస్టు 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక 2005వ సంవత్సరంలో వచ్చిన ‘అపరిచితుడు ‘ సినిమా తర్వాత విక్రమ్ కి మరొక హిట్ సినిమా అయితే పడలేదు. అప్పటినుంచి ఇప్పటివరకు ఆవరేజ్ సినిమాలు, లేదా బిలో ఆవరేజ్ సినిమాలు చేస్తూ వస్తున్నాడు. ఇక అందుకే ఇప్పుడు తంగలాన్ తో భారీ కంబ్యాక్ ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది.

Also Read: వెయ్యి కోట్ల హీరోను డామినేట్ చేస్తున్న ఆడవాళ్లు… ఇది మామూలు ట్విస్ట్ కాదు!

ఇక మొత్తానికైతే ఈ సినిమాతో తనని తాను స్టార్ హీరోగా నిలుపుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ఈ సినిమా పాన్ ఇండియాలో కూడా తనకు భారీ సక్సెస్ ని తీసుకొచ్చి పెడుతుందని భావిస్తున్నాడు. అలాగే ఈ సినిమాతో అతనికి ఆస్కార్ అవార్డు కూడా వస్తుందంటూ మురిసిపోతున్నాడు. మరి మొత్తానికైతే ఈ సినిమా రిలీజ్ అయితే గాని అది ఎలాంటి ఇంపాక్ట్ ను క్రియేట్ చేస్తుంది అనేది తెలియదు. ఇక ప్రేక్షకులు కూడా ఆ సినిమాను ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది కూడా తెలియాల్సి ఉంది.

కాబట్టి ఈ సినిమా రిలీజ్ అయ్యేంతవరకు దాని రిజల్ట్ గురించి మనం మాట్లాడుకోవాల్సిన పని అయితే లేదు. ఇక పా రంజిత్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ ను రీసెంట్ గా రిలీజ్ చేశారు. అయితే ఈ ట్రైలర్ కూడా చాలా ఎంగేజింగ్ గా ఉండడంతో ఈ సినిమా మీద మంచి ఆసక్తి అయితే పెరిగిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ సినిమాను చూడడానికి చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాతో కనక విక్రమ్ మంచి హిట్టు సాధిస్తే మాత్రం మరోసారి ఆయన మార్కెట్ విపరీతంగా పెరుగుతుంది. ఇక ఆయన సినిమాలు చాలా సంవత్సరాల నుంచి తెలుగు లో డబ్ అవుతున్న కూడా ఆయనకి పెద్దగా సక్సెస్ లైతే రావడం లేదు.

ఇక కెరియర్ స్టార్టింగ్ లోనే ‘శివ పుత్రుడు’, ‘అపరిచితుడు’ లాంటి భారీ సక్సెస్ లను అందుకున్న విక్రమ్ ఎందుకు ఇప్పుడు ఆయాన్స్ చేసే సినిమాలను సక్సెస్ ఫుల్ సినిమాలుగా మలచలేకపోతున్నాడు అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వైవిధ్యమైన కథంశాలతో సినిమాలను చేయడానికి ఎప్పుడూ ముందుకు వరుసలో ఉండే విక్రమ్ సక్సెస్ ల పరంగా మాత్రం చాలా వెనుకబడి ఉన్నాడు. కాబట్టి తంగలన్ సక్సెస్ అనేది అటు పా రంజిత్ కి, ఇటు విక్రమ్ కి ఇద్దరికీ కూడా చాలా కీలకం గా మారబోతుంది. మరి మొత్తానికైతే ఈ సినిమాతో భారీ సక్సెస్ సాధించి తనను తాను మరోసారి స్టార్ హీరోగా గుర్తింపు సంపాదించుకుంటాడా లేదా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉన్నాయి…

 

Also Read: సందీప్ కిషన్ కి ఉన్న అనారోగ్య సమస్య ఏంటో తెలుసా..? రాయన్ షూట్ లో ఏం జరిగిందంటే..?