Lenin 4 Days Collection: ‘ అక్కినేని అఖిల్ లేటెస్ట్ చిత్రం ‘లెనిన్’ రీసెంట్ గానే భారీ అంచనాల నడుమ విడుదలై మొదటి ఆట నుండే మంచి పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకొని , బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతూ ముందుకు దూసుకెళ్తోంది. మొదటి వీకెండ్ లో ఈ చిత్రానికి వచ్చినటువంటి వసూళ్లతో బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకుంది. నిన్నటితో లాభాల్లోకి అడుగుపెట్టిన ఈ సినిమాకు , ప్రాంతాల వారీగా ఎంత వసూళ్లను రాబట్టింది అనేది ఇప్పుడు చూద్దాం. నిన్న ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల నుండి 2 కోట్ల 25 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. అంటే ముందు రోజుతో పోలిస్తే ఏకంగా 70 శాతం కి పైగా గ్రాస్ వసూళ్లు డ్రాప్ అయ్యాయి అన్నమాట. ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల నుండి ఈ చిత్రానికి 32 కోట్ల 85 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు, 19 కోట్ల 85 లక్షల రూపాయల షేర్ వసూళ్లు వచ్చాయి.
నైజాం ప్రాంతం నుండి ఈ చిత్రానికి నాలుగు రోజుల్లో 8 కోట్ల 20 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు రాగా, సీడెడ్ ప్రాంత నుండి 2 కోట్ల 44 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. నైజాం , సీడెడ్ ప్రాంతాల్లో ఈ చిత్రానికి వర్కింగ్ డే లో కూడా మంచి వసూళ్లు వచ్చాయి అనే చెప్పాలి. ఇక మిగిలిన ప్రాంతాల విషయానికి వస్తే ఉత్తరాంధ్ర ప్రాంతం నుండి 2 కోట్ల 58 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు రాగా , ఈస్ట్ గోదావరి నుండి 1 కోటి 80 లక్షలు , వెస్ట్ గోదావరి నుండి 1 కోటి 11 లక్షలు , గుంటూరు జిల్లా నుండి 1 కోటి 68 లక్షలు , కృష్ణా జిల్లా నుండి 78 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.
ఇక రెస్ట్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణ విషయానికి వస్తే కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి 1 కోటి 75 లక్షలు రాగా, ఓవర్సీస్ నుండి 3 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ వరల్డ్ వైడ్ గా ఈ చిత్రానికి 24 కోట్ల 60 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. గ్రాస్ వసూళ్లు 44 కోట్ల 25 లక్షల రూపాయిల వరకు ఉంది. కానీ మేకర్స్ మొదటి మూడు రోజుల్లోనే 61 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వచ్చిందంటూ ప్రచారం చేశారు. అందులో ఎలాంటి నిజం లేదట. కేవలం 22 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ బిజినెస్ ని జరుపుకున్న ఈ చిత్రం అప్పుడే బ్రేక్ ఈవెన్ మార్కుని రాబట్టి 2 కోట్ల రూపాయలకు పైగా లాభాలను అందుకుంది. రాబోయే రోజుల్లో ఈ చిత్రం ఇంకా ఎంత పెద్ద రేంజ్ కి వెళ్లబోతుందో చూడాలి.
