Kajal Aggarwal: కొంతమంది హీరోయిన్లు పెళ్లయ్యాక కూడా రొమాంటిక్ పాత్రల్లో నటించడానికి సిద్ధం అవుతున్నారు. కియారా అద్వానీ లాంటి హీరోయిన్స్ అయితే ఏకంగా అడల్ట్ రొమాంటిక్ సన్నివేశాల్లో నటించడానికి కూడా రెడీ అయిపోతున్నారు. రీసెంట్ గా ‘టాక్సిక్’ నుండి విడుదలైన పాటని చూస్తే కియారా అద్వానీ ఏ రేంజ్ లో రొమాంటిక్ సన్నివేశాల్లో నటించిందో అర్థం అవుతుంది. అయితే కొంతమంది హీరోయిన్లు మాత్రం పెళ్లి తర్వాత లిమిట్స్ దాటేందుకు అసలు ఇష్టం చూపించడం లేదు. నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేస్తున్నారు , అవసరమైతే చిన్నపాటి రొమాంటిక్ సన్నివేశాల్లో నటించడానికి సిద్దమే కానీ , అంతకు మించి మాత్రం ముందుకు పోవడం లేదు. అలాంటి హీరోయిన్స్ క్యాటగిరీలో ఇప్పుడు కాజల్ అగర్వాల్ కూడా చేరిపోయింది. ఈమె తన కెరీర్ లో అధిక శాతం నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలకంటే, గ్లామర్ రోల్స్ చేసింది.
కానీ పెళ్లి తర్వాత అలాంటి పాత్రలకు నో చెప్తూ వస్తోంది. రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో ఆమె మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఈ ఇంటర్వ్యూ లో ఒక యాంకర్ కాజల్ ని ప్రశ్న అడుగుతూ ‘బికినీ సన్నివేశాల్లో నటించాల్సి వస్తే నటిస్తారా?’ అని అడగ్గా, దానికి కాజల్ అగర్వాల్ సమాధానం ఇస్తూ ‘నాకు అసలు బికినీ వేసుకోవడం ఇష్టం లేదు. అలాంటి హద్దులు దాటినా అందాల ఆరబోతకు నేనెప్పుడూ వ్యతిరేకం. నేను గ్లామరస్ ఇండస్ట్రీ లోకే అడుగుపెట్టాను. కానీ ఏనాడూ కూడా నేను నమ్ముకున్న సిద్ధాంతాలను వదులుకోలేదు. ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా అయినా సరే, ఎంత రెమ్యూనరేషన్ ఇస్తామని మాట ఇచ్చినా సరే , బికినీ వేసుకోడానికి మాత్రం నేను నో చెప్తాను. ఒకవేళ తప్పనిసరి పరిస్థితిలో బికినీ వేసుకోమని దర్శక నిర్మాతలు పట్టుబడితే , ఆ సినిమా నుండి నేను తప్పుకుంటానే తప్ప, నమ్మిన సిద్ధాంతాలకు వ్యతిరేకంగా సినిమాలు చేయను’ అంటూ చెప్పుకొచ్చింది.
ఆమె ప్రధాన పాత్ర పోషించిన ‘ది ఇండియా స్టోరీ’ అనే చిత్రం ఈ నెల 24 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా ఆమె ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో పై విధంగా చెప్పుకొచ్చింది కాజల్ అగర్వాల్. రీ ఎంట్రీ లో ఆమె రెగ్యులర్ హీరోయిన్ పాత్రలు ఇక చేయబోనని , కేవలం నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు మాత్రమే చేస్తానని చెప్పుకొచ్చింది కాజల్. లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో పాటు , విలన్ క్యారెక్టర్స్ చేయడానికి కూడా సిద్దమే అంటోంది. ప్రస్తుతం ఆమె నితీష్ తివారీ తెరకెక్కిస్తున్న ‘రామాయణం’ చిత్రం లో రావణుడి భార్య మండోదరి పాత్రలో నటిస్తోంది. ఈ చిత్రంలో రాముడిగా రణబీర్ కపూర్ , రావణుడిగా యాష్ నటిస్తున్న సంగతి తెలిసిందే.
