Nagarjuna: ఒకప్పుడు తన స్టైల్ తో యావత్ ఇండియా జనాన్ని తన వైపు తిప్పుకున్న ఒకే ఒక హీరో రజినీకాంత్… ఆయన స్క్రీన్ మీద కనిపించాడు అంటే చాలు జనాలు విజిల్స్ వేస్తూ గోల చేస్తూ ఉంటారు. ఇక తను స్క్రీన్ మీద చాలా ఫాస్ట్ గా డైలాగులు చెబుతూ ప్రేక్షకులందరిని ఆనందింపజేసేవారు. ముఖ్యంగా సిగరెట్ తాగే స్టైల్ అయితే అప్పటి యూత్ లో విపరీతమైన క్రేజ్ ను సంపాదించుకుంది. ఇక మరీ ముఖ్యంగా ఆయన చేసే హావా భావాలు కానీ, యాక్టింగ్ గాని, ఆయన చెప్పే డైలాగులు గాని ప్రేక్షకులకు అమితంగా నచ్చేవి. అందుకే ఆయన సూపర్ స్టార్ గా గుర్తింపును సంపాదించుకున్నాడు. ముఖ్యంగా తమిళ్, తెలుగు రెండు భాషల్లో కూడా ఇప్పటి వరకు ఆయన సూపర్ స్టార్ గానే కొనసాగుతున్నాడు. ఇక ఇదిలా ఉంటే ఆయన ఎంటైర్ కెరియర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచిన సినిమాల్లో ‘భాషా’ సినిమా ఒకటి…ఇక అప్పటివరకు సినిమాలన్నీ ఒక రేంజ్ లో ఉంటే భాషా సినిమా మాత్రం అవుట్ అండ్ అవుట్ సినిమా స్టైల్ మొత్తాన్ని మార్చేసిందనే చెప్పాలి. ఇక ఆ సినిమా నుంచి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ సినిమాలు రావడం ఎలివేషన్స్ ఇవ్వడం, సినిమా మొత్తాన్ని ఎమోషన్స్ తో నింపేయడం లాంటివి జరుగుతూ వచ్చాయి. ఇక ఈ సినిమా ఇన్స్పిరేషన్ తో వచ్చిన చాలా సినిమాలు సూపర్ సక్సెస్ సాధించాయి.
Also Read: సందీప్ కిషన్ కి ఉన్న అనారోగ్య సమస్య ఏంటో తెలుసా..? రాయన్ షూట్ లో ఏం జరిగిందంటే..?
ఇక ఇదిలా ఉంటే రజనీకాంత్ కంటే ముందే తెలుగు స్టార్ హీరో అయిన నాగార్జున గ్యాంగ్ స్టర్ సినిమాలు తీసాడనే విషయం మనలో చాలామందికి తెలియదు. ఇక ముఖ్యంగా ఒక సాఫ్ట్ ఇమేజ్ ఉన్న నాగార్జున లాంటి హీరో గ్యాంగ్ స్టర్ సినిమా చేసి సూపర్ సక్సెస్ కొట్టడం అనేది అప్పట్లో ఒక పెను సంచలనంగా మారింది… రాంగోపాల్ వర్మ తీసిన శివ సినిమాతోనే నాగార్జున గ్యాంగ్ స్టర్ సినిమా చేశాడు. అయితే ఈ సినిమాలో ఆయన నటన అద్భుతంగా ఉంటుంది. ఇక ఈ సినిమాతో ఆయన ఓవర్ నైట్ లో స్టార్ హీరోగా మారిపోయాడు.
రామ్ గోపాల్ వర్మ అయితే ఒక్క సినిమాతోనే స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకొని తనను తాను స్టార్ డైరెక్టర్ గా ఎలివేట్ చేసుకున్నాడు… ఇక గ్యాంగ్ స్టర్ నేపథ్యంలో రజనీకాంత్ కంటే ముందే నాగార్జున ఒక సినిమా తీసి సూపర్ సక్సెస్ ని అందుకున్నాడనే చెప్పాలి. 1989 లో ‘శివ ‘ సినిమా వచ్చింది. కానీ రజినీకాంత్ చేసిన భాష సినిమా మాత్రం 1995 లో వచ్చింది.కాబట్టి రజినీకాంత్ కంటే ముందే నాగార్జున గ్యాంగ్ స్టర్ సినిమాలు చేసి సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. ఇక మొత్తానికైతే రజినీకాంత్ ఇప్పటికీ సౌత్ లో స్టార్ హీరోగా కొనసాగుతుండగా, నాగార్జున కూడా తెలుగులో స్టార్ హీరో గా గుర్తింపు పొడుతున్నాడు.
ఇక ప్రస్తుతం నాగార్జున కొంతవరకు సక్సెసులు లేక డీలాపడ్డప్పటికీ ఇప్పుడు శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో చేస్తున్న ‘కుబేర ‘ సినిమాతో మంచి సక్సెస్ ని అందుకోవాలని చూస్తున్నాడు. ఇక ఈ సినిమాతో కనక భారీ సక్సెస్ ని కొట్టినట్టైతే మరోసారి నాగార్జున స్టార్ హీరోగా తనను తాను ఎలివేట్ చేసుకుంటాడు. అలాగే ఆయనతో సినిమాలు చేయడానికి స్టార్ డైరెక్టర్లు కూడా క్యూ కడతారనే చెప్పాలి…
Also Read: వెయ్యి కోట్ల హీరోను డామినేట్ చేస్తున్న ఆడవాళ్లు… ఇది మామూలు ట్విస్ట్ కాదు!