Harry Brook Wicket: ఇటీవల జరిగిన టి20 సిరీస్ లో టీమ్ ఇండియా మీద బ్రూక్ రెచ్చిపోయాడు. ముఖ్యంగా ఐదవ టి20 మ్యాచ్లో ఏకంగా 95 పరుగులు చేశాడు. టీమిడియా బౌలింగ్ మొత్తాన్ని ఊచ కోత కోశాడు. సూపర్ ఫామ్ లో ఉన్న అతడు.. వన్డే సిరీస్లో తేలిపోయాడు.. బుమ్రా బౌలింగ్ లో హ్యాండ్సప్ అంటూ చేతులెత్తేశాడు. మూడు వన్డేల సిరీస్ లో భాగంగా తొలి మ్యాచ్ ఎడ్జ్ బాస్టన్ వేదికగా మొదలైంది. టాస్ గెలిచిన ఆతిథ్య జట్టు కెప్టెన్ బ్యాటింగ్ తీసుకున్నాడు.
భారత బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు వేయడంతో ఇంగ్లాండు బ్యాటర్లకు పరుగులు తీయడం కష్టంగా మారింది. అయితే బ్రార్ బౌలింగ్లో ఇంగ్లాండ్ బ్యాటర్లు స్వేచ్ఛగా బ్యాటింగ్ చేయడంతో పరుగులు వచ్చాయి. ఈ దశలో ఓపెనర్లు డకెట్ (43), బెతల్ (14) పరుగులు చేశారు. వీరిద్దరు కూడా బ్రార్ బోర్డింగ్ అవుట్ అయ్యారు. తొలి వికెట్ కు వీరిద్దరు 61 పరుగులు జోడించారు. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడిని బ్రార్ విడదీశాడు. ముఖ్యంగా డకెట్ కొట్టిన బంతిని బౌండరీ లైన్ వద్ద బుమ్రా అద్భుతంగా అందుకున్నాడు.
బ్రార్ వేసిన బౌన్సర్ ను గట్టిగా కొట్టేందుకు డకెట్ ప్రయత్నించాడు .. బంతి బ్యాట్ చివరి అంచు తగిలి అంత ఎత్తున లేచింది. ఈ దశలో బౌండరీ లైన్ వద్ద ఉన్న బుమ్రా అద్భుతంగా అందుకున్నాడు. దీంతో 43 పరుగులు చేసిన డకెట్ పెవిలియన్ చేరుకున్నాడు. ఇద్దరు ఓపెనర్లు అవుట్ అయిన తర్వాత కెప్టెన్ బ్రూక్.. రూట్ వచ్చారు.
ఈ సమయంలో బుమ్రా వేసిన బంతిని బ్రూక్ సరిగ్గా అంచనా వేయలేకపోయాడు. బ్యాట్ చివరి అంచు తగలడంతో గాలిలో లేచింది. దీంతో ఆ బంతిని స్లిప్ లో ఉన్న రోహిత్ శర్మ అద్భుతంగా అందుకున్నాడు. ఫలితంగా కెప్టెన్ ఒక్క పరుగు మాత్రమే చేసి పెవిలియన్ చేరుకున్నాడు..
Bumrah showed levels to harry brook pic.twitter.com/yOWrEzs0VV
— Ankur (@wrist_class) July 14, 2026
