https://oktelugu.com/

Toxic Movie: వెయ్యి కోట్ల హీరోను డామినేట్ చేస్తున్న ఆడవాళ్లు… ఇది మామూలు ట్విస్ట్ కాదు!

వెయ్యి కోట్ల హీరోని ఆడవాళ్లు డామినేట్ చేస్తున్నారు. ఈ స్టోరీ తిలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. లేడీ డైరెక్టర్ తో సినిమా చేస్తున్న స్టార్ హీరో మూవీలో ఆడవాళ్ల డామినేషన్ పెరిగిపోయింది. ఆ సంగతి ఏమిటో చూద్దాం.

Written By:
  • S Reddy
  • , Updated On : July 25, 2024 / 12:36 PM IST

    Toxic Movie

    Follow us on

    Toxic Movie: మనం ఇక్కడ మాట్లాడుకుంటుంది హీరో యష్ గురించి. కెజిఎఫ్, కెజిఎఫ్ 2 చిత్రాలతో పాన్ ఇండియా హీరో అయ్యాడు. ఆయనకు అన్ని పరిశ్రమలో ఫేమ్ ఉంది. కన్నడ హీరో అయిన యష్ ఒక ఆర్టీసీ బస్ డ్రైవర్ కావడం కొసమెరుపు. ఎలాంటి నేపథ్యం లేకుండా పరిశ్రమలో అడుగుపెట్టి యష్ స్టార్ అయ్యాడు. 2014లో ఉగ్రం టైటిల్ తో ప్రశాంత్ నీల్ ఒక చిత్రం తెరకెక్కించారు. ఇది బ్లాక్ బస్టర్ కొట్టింది.

    Also Read: గజిని తర్వాత నుంచి కంగువ వరకు సూర్య చేసిన ఒకే ఒక మిస్టేక్ ఏంటో తెలుసా..?

    ఆ మూవీ విడుదలైన నాలుగేళ్లకు 2018లో కెజిఎఫ్ మూవీని తెరకెక్కించాడు. ప్రశాంత్ నీల్ ప్రతిభ మీద నమ్మకం ఉంచిన నిర్మాతలు భారీ బడ్జెట్ తో కెజిఎఫ్ నిర్మించేందుకు ముందుకు వచ్చారు. రెండో చిత్రానికే ఆ స్థాయి మూవీ తీయడం ఆషామాషీ కాదు. అప్పటికే కన్నడలో కొంత ఫేమ్ తెచ్చుకున్న యష్ ని హీరోగా ఎంచుకున్నాడు. బాహుబలి 2 తర్వాత పాన్ ఇండియా స్థాయిలో ప్రభావం చూపిన మూవీ ఏదైనా ఉందంటే కెజిఎఫ్ అని చెప్పొచ్చు.

    కెజిఎఫ్ పార్ట్ 1 వరల్డ్ వైడ్ రూ. 300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇక దానికి కొనసాగింపుగా వచ్చిన కెజిఎఫ్ 2 వసూళ్ల సునామీ గురించి ఎంత చెప్పినా తక్కువే. వెయ్యి కోట్లు వసూలు చేసిన ఫస్ట్ కన్నడ మూవీ కెజిఎఫ్ 2 కావడం విశేషం. వరల్డ్ వైడ్ కెజిఎఫ్ 2 రూ. 1200 కోట్లకు పైగా వసూళ్ళు రాబట్టింది. తెలుగు, హిందీ భాషల్లో కూడా రికార్డు స్థాయిలో వసూళ్లు అందుకుంది.

    కెజిఎఫ్ 2 విడుదలై రెండేళ్లు దాటిపోయింది. ఏడాదికి పైగా యష్ రెస్ట్ తీసుకున్నారు. ఆయన ఎలాంటి మూవీ ప్రకటించలేదు. దాంతో అభిమానులు అసహనం వ్యక్తం చేశారు. యష్ కొత్త మూవీ ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. లేడీ డైరెక్టర్ కి ఆయన ఛాన్స్ ఇచ్చారు. గీతు మోహన్ దాస్ దర్శకత్వంలో టాక్సిక్ మూవీ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ జరుపుకుంటుంది.

    టాక్సిక్ ప్రీ లుక్ ఆకట్టుకుంది. ఈ మూవీ పీరియాడిక్ క్రైమ్ డ్రామా అని సమాచారం. 1970లలో గోవా వేదికగా జరిగిన డ్రగ్ మాఫియా నేపథ్యంలో మూవీ సాగుతుందని సమాచారం. కాగా ఈ మూవీలో పలువురు హీరోయిన్స్ కీలక రోల్స్ చేయడం విశేషం. సౌత్ ఇండియా లేడీ సూపర్ స్టార్ గా వెలుగొందుతున్న నయనతార యష్ కి అక్కగా చేస్తుందట. ఈ పాత్ర కోసం మొదట కరీనా కపూర్ ఖాన్ ని అనుకున్నారట. సౌత్ తో పాటు నార్త్ లో కూడా ఫేమ్ ఉన్న నయనతార అయితే బెటర్ అని తర్వాత నయనతార వైపు మొగ్గు చూపారట.

    ఇక కియారా అద్వానీ, తార సుతారియా హీరోయిన్స్ గా నటిస్తున్నారట. ఈ మూవీలో విలన్ కూడా లేడీ అంటున్నారు. ప్రధాన విలన్ రోల్ హుమా ఖురేషి చేస్తుందట. ఈ మేరకు ఆసక్తికర సమాచారం అందుతుంది. లెక్కకు మించిన స్టార్స్ ఇన్వాల్వ్ అయిన టాక్సిక్ ప్రాజెక్ట్ విషయంలో యష్ డామినేట్ అయ్యాడనే వాదన వినిపిస్తోంది.

    ఇక టాక్సిక్ మూవీ సమ్మర్ కానుకగా 2025 ఏప్రిల్ లో విడుదల కానుంది. కెజిఎఫ్ 2 తర్వాత యష్ నుండి వస్తున్న మూవీ కావడంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆడియన్స్ ఈ మూవీ కోసం ఎగబడటం ఖాయం. మరి చూడాలి టాక్సిక్ ఈ స్థాయి విజయం సాధిస్తుందో..

     

    Also Read: 13 డిజాస్టర్ల తర్వాత మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్న బాలీవుడ్ స్టార్ హీరో…