https://oktelugu.com/

Sundeep Kishan: సందీప్ కిషన్ కి ఉన్న అనారోగ్య సమస్య ఏంటో తెలుసా..? రాయన్ షూట్ లో ఏం జరిగిందంటే..?

సినిమా ఇండస్ట్రీ లో ఉన్న నటీ నటులకు ఎలాంటి ఇబ్బందులూ ఉండవు. వాళ్ళు కావాలనుకున్న ఫుడ్ తినచ్చు, ఎప్పుడంటే అప్పుడు ఎక్కడికంటే అక్కడికి వెళ్ళచ్చు అని మనలో చాలా మంది అనుకుంటూ ఉంటారు...కానీ వాళ్ళకి కూడా చాలా ఇబ్బందులు ఉంటాయి...

Written By:
  • Gopi
  • , Updated On : July 25, 2024 / 01:26 PM IST

    Sundeep Kishan

    Follow us on

    Sundeep Kishan: సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటీనటులు మంచి అవకాశాలను అందుకుంటు సినిమాలను చేస్తూ సూపర్ సక్సెస్ లను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తూ ఉంటారు. ఇక ఇలాంటి క్రమంలోనే చాలామంది వాళ్ళకంటు ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకోవడంలో మాత్రం చాలా వరకు సక్సెస్ అవుతూ ఉంటారు. ఇక ఎవరు ఎలాంటి సినిమాలు చేసిన కూడా అల్టిమేట్ గా వాళ్ళ సినిమాని సక్సెస్ ఫుల్ గా నిలపడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతూ ఉంటారు. మరి ఇలాంటి క్రమంలో తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలామంది నటీనటులకు కొన్ని ఆరోగ్యపరమైన సమస్యలు ఉన్నాయనే విషయం మనలో చాలామందికి తెలియదు. అయితే ఇక్కడ ఆక్టీవ్ గా ఉన్న వాళ్లకు సినిమా అవకాశాలు అనేవి ఎక్కువగా వస్తాయి. కాబట్టి వాళ్ళకున్న అనారోగ్య సమస్యల గురించి ఎవరు ఎక్కువగా బయట చెప్పడానికి ఇష్టపడరు. దాని వల్ల వాళ్లకు వచ్చే అవకాశాలను కూడా కోల్పోయే ప్రమాదం ఉంది. ఇక ఇదిలా ఉంటే తెలుగు సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ గా కొన్ని సంవత్సరాల పాటు వెలుగొందిన సమంత గత కొన్ని రోజుల క్రితం తనకి ‘మయో సైటిస్’ అనే ఒక వ్యాధి ఉన్నట్టుగా తెలియజేశారు. దానికి సంబంధించిన ట్రీట్మెంట్ కూడా ఆమె తీసుకుంటున్న ఫోటోలను అభిమానులతో సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఇక సమంత అంతకు ముందు తన వ్యాధి గురించి ఇండస్ట్రీలో ఎవరికైనా తెలిస్తే ఇబ్బందిలు ఎదురవ్వచ్చనే ఉద్దేశ్యంతోనే ఆ విషయాన్ని చాలా గోప్యంగా ఉంచారట. ఇక మొత్తానికైతే ఆమె నాగచైతన్య నుంచి విడాకులు తీసుకున్న తర్వాత తనకున్న అరుదైన వ్యాధి గురించి చెప్పడమే కాకుండా దానికి సంబంధించిన ట్రీట్మెంట్ కూడా తీసుకుంటూనే షూటింగ్ లో పాల్గొంటున్నారు…

    Also Read: 13 డిజాస్టర్ల తర్వాత మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్న బాలీవుడ్ స్టార్ హీరో…

    ఇక తన అనారోగ్య సమస్య గురించి చెప్పిన తర్వాత మిగతా ఆర్టిస్టులు కూడా వాళ్లకున్న సమస్యలను తెలియజేశారు…గోవా బ్యూటీ అయిన ఇలియానాకు ‘డిస్ మార్ఫిక్ డిజార్డర్ ‘ , అనుష్క శర్మ కు ‘మానసిక ఆరోగ్య సమస్య’, స్నేహ ఉల్లాల్ కి ‘ఆటో ఇమ్యూన్ డిజార్డర్’ లాంటి అనారోగ్య సమస్యలు ఉన్నాయని వాళ్ళు కూడా ఓపెన్ అయ్యారు…ఇక మొత్తానికైతే సెలబ్రిటీలకు కూడా డిప్రెషన్ ప్రాబ్లమ్స్ రావడం. అనారోగ్య సమస్యలు ఉండడం అనేది కామన్ అయిపోయింది. ఇంక అందులో భాగంగానే తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి చోటా కే నాయుడు అల్లుడిగా ఎంట్రీ ఇచ్చిన సందీప్ కిషన్ సైతం మంచి హీరోగా పేరు సంపాదించుకొని ముందుకు సాగుతున్నారు. తన కెరియర్ లో ఆయన చేసిన స్నేహ గీతం, వెంకటాద్రి ఎక్స్ ప్రెస్, ప్రస్థానం, బీరువా, టైగర్, నగరం లాంటి సినిమాలు మంచి విజయాలను అందుకొని సూపర్ సక్సెసులుగా నిలిచాయి.

    ఇక ఇలాంటి సందర్భంలోనే ఆయన చేసిన ప్రతి సినిమా కూడా ఇండస్ట్రీలో తనదైన రీతిలో మంచి గుర్తింపును సంపాదించుకోవడమే కాకుండా తనకి కూడా హీరోగా మంచి పేరుని తీసుకొచ్చాయి. ఇక ఇలాంటి సందర్భంలోనే ఆయన ధనుష్ హీరోగా వస్తున్న ‘రాయన్ ‘ అనే సినిమాలో ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఈ సినిమాతో తనను తాను మరొకసారి మంచి నటుడి గా ప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక అందులో భాగంగానే ఈ సినిమా షూటింగ్ సమయంలో ఆయన ఎదుర్కొన్న కొన్ని ఇబ్బందులను తెలియజేశాడు. ఆయనకు మొదటి నుంచి సైనస్ ప్రాబ్లం అయితే ఉందట. అంటే శ్వాసకు సంబంధించిన ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి.

    ఇక ఈ సినిమా షూటింగ్ లో భాగంగా ఒకరోజు ఎక్కువగా డస్ట్ ఉన్న ప్లేస్ లో షూట్ చేయాల్సి రావడం వల్ల ఆయనకి కొద్దిపాటిగా బ్రీతింగ్ ప్రాబ్లం అయితే ఎదురైందని దాంతో సినిమా యూనిట్ అంత కంగారు పడిపోయి అంబులెన్స్ ని తీసుకువస్తామని చెప్పారట. కానీ తను మాత్రం వద్దని కాసేపు ఫ్రెష్ ఎయిర్ తీసుకుంటే సెట్ అయిపోతుందని పక్కకు వచ్చి కూర్చున్నాడట. ఇక దాంతో 15 నిమిషాల తర్వాత మళ్లీ ఆయన షూట్ కి వెళ్లి బ్యాలెన్స్ షూట్ మొత్తాన్ని కంప్లీట్ చేశారట… ఇక సందీప్ కిషన్ కి ఉన్న అనారోగ్య సమస్యలను తెలుసుకున్న ఆయన అభిమానులు కొంతవరకు కంగారు పడుతున్నారు…

     

    Also Read: గజిని తర్వాత నుంచి కంగువ వరకు సూర్య చేసిన ఒకే ఒక మిస్టేక్ ఏంటో తెలుసా..?