Honeymoon Planning Tips: హనీమూన్ ప్లాన్ చేస్తున్నారా? ఇవి ఎంచుకోండి.. ఖర్చు కూడా చాలా తక్కువ.

వైవాహిక జీవితంలో అలసట, ఒత్తిడిని దూరం చేసుకోవాలన్నా హనీమూన్ కు వెళ్లాలి. హనీమూన్ ప్లాన్ చేయడంలో ఫ్లైట్ బుక్ చేయడం, హోటల్ రూమ్స్ బుక్ చేయడం, ట్రిప్పులు ప్లాన్ చేయాల్సిందే. వీటన్నింటిని ముందుగా చేసుకుంటేనే ప్రయాణం సులువవుతుంది.

Written By: Swathi, Updated On : July 25, 2024 5:21 pm

Honeymoon Planning Tips

Follow us on

Honeymoon Planning Tips: పెళ్లి అంటే నూరేళ్ళ పంట. దీనికి పునాది ఎంత బాగుంటే అంత బెటర్ గా ఉంటుంది. అన్ని పక్కన పెడితే పెళ్లి పిల్లలు కంటే మధ్యలో ఒకటి ఉంటుంది. అదేంటో చెప్పండి. గుర్తువచ్చిందా? జర వెయిట్.. హనీమూన్ అండోయ్.. మరి మీరు ఎక్కడికి వెళ్లాలి అనుకుంటున్నారు? అయ్యో పెళ్లి కాలేదు అనుకుంటున్నారా? అయితే అయ్యాక వెళ్లండి. ఇప్పుడే అయితే ఇంకెందుకు టైమ్ వేస్ట్ వేళ్లేసేయండి. మరి ఎక్కడికి వెళ్లాలో కూడా ఒకసారి ఆలోచించాల్సిందే. భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి హనీమూన్ చాలా అవసరం అంటారు నిపుణులు.

వైవాహిక జీవితంలో అలసట, ఒత్తిడిని దూరం చేసుకోవాలన్నా హనీమూన్ కు వెళ్లాలి. హనీమూన్ ప్లాన్ చేయడంలో ఫ్లైట్ బుక్ చేయడం, హోటల్ రూమ్స్ బుక్ చేయడం, ట్రిప్పులు ప్లాన్ చేయాల్సిందే. వీటన్నింటిని ముందుగా చేసుకుంటేనే ప్రయాణం సులువవుతుంది. ఇవన్నీ ప్లేస్ ను డిసైడ్ అయిన తర్వాత కదా.ప్రస్తుతం హనీమూన్ ప్రదేశం అంటే బాలి, మాల్దీవులు గుర్తుకు వస్తుంటాయి. ఈ రెండు ప్రదేశాలు బడ్జెట్ ఫ్రెండ్లీగా వెళ్లి రావచ్చు. చేతిలో లక్ష రూపాయలు ఉన్నా ఇక్కడికి ప్రయాణం సులభం అవుతుంది. కేవలం ఈ రెండు ప్రాంతాలే కాదు… మరికొన్ని ప్రాంతాలకు కూడా మీరు చాలా ఫ్రీగా వెళ్లి రావచ్చు. అవేంటంటే..

న్యూజిలాండ్: మీరు హనీమూన్ కు వెళ్లాలి అనుకుంటే మంచి ప్లేస్ లలో ఒకటి న్యూజిలాండ్. ఇక్కడ బంగీ జంప్ లతో మీకు ప్రారంభంలోనే ఉత్సాహం అనిపిస్తుంది. ఇక్కడ మీరు లగ్జరీ క్రూయిజ్ లో కూడా వెళ్ళవచ్చు కానీ అది పూర్తిగా మీ ఇష్టం. ఇక్కడ చూడటానికి చాలా ప్రాంతాలు ఉన్నాయి. అందులో అన్ని మిమ్మల్ని హత్తుకుంటాయి.

స్విట్జర్లాండ్: మంచుతో కప్పిన పర్వతాలు, ప్రకాశవంతమైన రంగులలోని వృక్షసంపదను చూస్తే మీ మనసు ఉరకలు పెడుతుంటుంది. వీటిని లైవ్ గా వెళ్లి చూస్తే ఆ ఆనందమే వేరు అనుకోండి. మీరు మీ భాగస్వామితో కలిసి స్విట్జర్లాండ్ వెళితే ఈ జర్నీ మీకు లైఫ్ లో కూడా గుర్తుండిపోతుంది. మంచి మెమోరీలు కలెక్ట్ చేసుకోవడం కోసం స్విట్జర్లాండ్ వెళ్లండి.

శ్రీలంక: శ్రీలంక భారత్ కు చాలా దగ్గరలో ఉంటుంది. ఇక్కడికి కూడా మీరు చాలా సులభంగా తక్కువ ఖర్చుతో వెళ్లవచ్చు. శ్రీలంకలోని నువారా ఎలియా ప్రాంతానికి మీ భాగస్వామితో వెళ్లండి. జస్ట్ ఒక కప్ టీ తాగండి చాలు. భలే అనిపిస్తుంది. అందమైన జలపాతాలు, తేయాకు తోటలు, పాత భవనాలు చెప్పుకుంటూ పోతే శ్రీలంకలో కూడా చాలా ప్రాంతాలు మీ హనీమూన్ ను అందంగా మారుస్తాయి.

థాయిలాండ్: మరో మంచి హనీమూన్ స్పాట్ అంటే థాయ్ లాండ్ అనే చెప్పవచ్చు. ఇక్కడ అందమైన కోహ్ ఫిఫి ద్వీపం చాలా బాగుంటుంది. బీచ్ లో సేదతీరాలన్నా, స్నార్కెలింగ్ ఎంజాయ్ చేయాలన్నా కపుల్స్ ఇక్కడికి వెళ్లాల్సిందే. థాయిలాండ్ వెళ్లాలంటే పెద్దగా ఖర్చు కూడా కాదు.

టర్కీ: టర్కీ దేశానికి ఎన్నో శతాబ్దాల చరిత్ర ఉంది. టర్కీలో మీ భాగస్వామితో కలిసి ఎయిర్ బెలూన్ లో ప్రయాణం చేయవచ్చు ఇది మీకు చాలా ఫన్నీగా ఉంటుంది. ఎన్నో మధురమైన క్షణాలను అందిస్తుంది టర్కీ.

పైన తెలిపిన దేశాలు మీకు తక్కువ బడ్జెట్ లోనే మంచి హనీమూన్ ప్లేస్ లు అవుతాయి. ఎక్కడైనా మీ ఆలోచన వల్ల డబ్బు పెంచవచ్చు, తగ్గించుకోవచ్చు. మీరు ఖరీదైన హోటల్ లో ఉండాలి అనుకుంటే కాస్త ఖర్చు ఎక్కువ. లేదంటే కాస్త తక్కువ అవుతుంది. కానీ కొత్త దంపతులు ఒకసారి వెళ్లి వస్తారా?