https://oktelugu.com/

Pushpa 2: పుష్ప 2 ప్యాచ్ వర్క్ ఇంకా పూర్తవ్వడం లేదా..? ఇంక ఎన్ని సీన్లు చేస్తారు సామీ…

తెలుగులో చాలా మంది హీరోలు ఉన్నప్పటికీ అల్లు అర్జున్ కి ఒక ప్రత్యేకమైన క్రేజ్ అయితే ఉంది...ఇక ఇప్పుడు ఆయన చేస్తున్న సినిమాలా ద్వారా ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ మరింత పెరిగే అవకాశం కూడా ఉంది...

Written By:
  • Gopi
  • , Updated On : July 30, 2024 / 10:22 AM IST

    Pushpa 2

    Follow us on

    Pushpa 2: గంగోత్రి సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్ అతి తక్కువ సమయంలోనే స్టైలిష్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకోవడం అనేది నిజంగా ఒక గొప్ప విషయమనే చెప్పాలి. మొదటి సినిమాలో ఆయనను చూసిన ప్రతి ఒక్క ఆడియన్ కూడా ఈయన హీరో ఏంటి? డబ్బులుంటే ఎవరైనా హీరో అయిపోవచ్చా? అంటూ ఆయన మీద విపరీతమైన కామెంట్లైతే చేశారు. కానీ ఆ కామెంట్లన్నింటికీ చెక్ పెడుతూ ఆయన మంచి సినిమాలను సెలెక్ట్ చేసుకుంటూ ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కుతూ వచ్చాడు. దానివల్ల ఆయన ఇండస్ట్రీలో ‘స్టైలిష్ స్టార్’ గా గుర్తింపు సంపాదించుకోవడమే కాకుండా ప్రస్తుతం ‘ఐకాన్ స్టార్’ గా కూడా మారాడు. ఇక ఇప్పుడు ‘పుష్ప 2’ సినిమాతో మరోసారి పాన్ ఇండియా లేవల్లో తన సత్తా చాటుకునే ప్రయత్నం అయితే చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇదిలా ఉంటే ఆయన చేస్తున్న ప్రతి సినిమాలో కూడా ఏదో ఒక వైవిధ్యమైన కథాంశం అయితే ఉంటుంది. ఇక పుష్ప సినిమాతో పెను ప్రభంజనాన్ని సృష్టించిన ఆయన బాలీవుడ్ జనాలందరినీ తన అభిమానులుగా మార్చుకున్నాడు. అలాగే ఇప్పుడు పుష్ప 2 తో మరొకసారి తమ ప్రభంజనాన్ని సృష్టించి తనను తాను స్టార్ హీరోగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది…ఇక ఇప్పటికే మన తెలుగు హీరోలందరూ పాన్ ఇండియాలో తమ సత్తా చాటుతున్న క్రమంలో అల్లు అర్జున్ కూడా తన వంతు ప్రయత్నం చేస్తూ భారీ కలెక్షన్స్ ను కొల్లగొట్టడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది.

    Also Read: కల్కి సినిమా కి ఇంత క్రేజ్ ఏంటి భయ్య…నెల గడిచిన కూడా కలెక్షన్ల వర్షం కురిపిస్తుందిగా…

    ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా దర్శకుడు అయిన సుకుమార్ మాత్రం ఈ సినిమాని భారీ రేంజ్ లో తెరకెక్కించే విధంగా ప్రణాళికలను రూపొందించుకుంటూ మొదటి నుంచి ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది..

    ఇక అన్ని అనుకున్నట్టుగా జరిగితే ఈ సినిమా ఆగస్టు 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చేది. కానీ సినిమా షూట్ అనేది లేట్ అవ్వడం వల్ల ఈ సినిమాని డిసెంబర్ 6వ తేదీకి పోస్ట్ పోన్ చేశారు. ఇక మొత్తానికైతే ఈ సినిమాకి సంబంధించిన అవుట్ పుట్ ని ఇప్పుడు ప్రత్యేకంగా చూస్తూ తనకు నచ్చని సన్నివేశాలు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేసి వాటిని ప్యాచ్ వర్క్ చేసే విధంగా ప్రణాళికలు రూపొందించుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ఇక ఇప్పటికే చాలా సీన్లకు ప్యాచ్ వర్క్ లు నిర్వహించిన పుష్ప 2 సినిమా మేకర్స్ ప్రస్తుతం మరికొన్ని సీన్లకు ప్యాచ్ వర్క్ లను చేయాలని ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది…

    ఇక ఈ సినిమా సక్సెస్ కావడానికి దర్శకుడు ఇలా చేయడంలో తప్పులేదు. కానీ ఇలా చేయడం వల్ల ప్రొడ్యూసర్ కి భారీగా బడ్జెట్ పెరిగిపోతుంది. ఒకవేళ సినిమా తేడా కొడితే మాత్రం ఆయన భారీ నష్టాలను చవి చూడాల్సిన పరిస్థితి అయితే వస్తుంది. ఇక ఇలాంటివి లేకుండా ముందే ఒక పకడ్బందీ ప్రణాళిక ప్రకారం సినిమా షూట్ ని చేస్తే బాగుంటుందంటూ సినీ మేధావులు సైతం సుకుమార్ చేస్తున్న పని పట్ల కొంచెం అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు…చూడాలి మరి పుష్ప 2 సినిమాతో సుకుమార్ భారీ సక్సెస్ ను అందుకుంటాడా లేదా అనేది…

     

    Also Read: రాజాసాబ్ గ్లింప్స్ లో ప్రభాస్ లుక్ బాగుంది…కానీ మారుతి ఆ ఒక్క మిస్టేక్ చేయకుండా ఉంటే బాగుండేది