Husband Wife Relationship: ఒక వ్యక్తి సక్రమమైన పద్ధతితో జీవించాలంటే సరైన మార్గం చూపే గురువు ఉండాలి. అలాగే ఒక రాజ్యాన్ని ఎలాంటి ఆటంకాలు లేకుండా పాలించాలంటే ఆ రాజుకు దౌత్య వేత్త ఉండాలి. అపర చాణక్యుడు ఇలాంటి సమయంలో మంచి గురువుగా ఉండి గొప్ప గొప్ప సలహాలు ఇచ్చాడు. చాణక్యుడు కేవలం రాజులకే కాకుండా భవిష్యత్ తరాల వారి జీవితంలో ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి కొన్ని సూచనలను అందించాడు. చాణక్యుడు అందించిన సూచనలను చాలా మంది పాటించి తమ జీవితాలను సార్థకం చేసుకున్నారు. ముఖ్యంగా పెళ్లయిన దంపతుల విషయంలో చాణక్యుుడు చెప్పిన విధంగా పాటించి తమ సంసారంలో ఇబ్బందులు లేకుండా చేసుకున్నారు. అయితే చాణక్యుడు చెప్పిన ప్రకారం భార్యభర్తల బంధం ఎంతో పవిత్రమైంది. దంపతుల మధ్య ఎలాంటి బేధాభిప్రాయాలు లేకుండా హాయిగా జీవించేందుకు ప్రయత్నించాలని సూచించారు. ఒకరి మనసును ఒకరు అర్థం చేసుకొని ముందుకు సాగాలని చెప్పారు. ఇద్దరి మధ్య ఎలాంటి రహస్యాలు లేకుండా ఉండడం వల్ల మనస్పర్థలు రావని చెప్పారు. అయితే ఒక్కడ ఓ విషయంలో మాత్రం చాణక్యుడు అప్రమత్తం చేశాడు. భార్యభర్తలు సంతోషంగా ఉండడానికి భర్తకు సంబంధించిన కొన్ని విషయాలను భార్యకు చెప్పకూడదని చెప్పాడు. ఈ విషయాలు చెప్పడం వల్ల దు:ఖమే గానీ.. సంతోషం ఉండదని అన్నారు. అయితే పొరపాటున ఈ విషయాలు భార్యకు తెలిసినా వాటికి మన్నించే విధంగా వారితో ప్రవర్తించాలి.. ఇంతకీ భార్యకు చెప్పకూడని విషయాలు ఏవి? అవి చెప్పడం వల్ల ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి. ఆ వివరాల్లోకి వెళ్దాం..
సాధారణంగా ప్రతీ ఒక్కరిలో కొన్ని బలాలు, బలహీనతలు ఉంటాయి. బలాల గురించి చెప్పినా, చెప్పకపోయినా ఎదుటి వారికి అర్థమవుతుంది. ఒక వ్యక్తి కున్న ప్లస్ పాయింట్ ద్వారా ఆ వ్యక్తికి సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఇదే సమయంలో భార్య దగ్గర తాను గొప్పగా ఉండగలుగుతాయి. అయితే తన బలహీనత గురించి భార్యకు చెప్పకూడదని చాణక్య నీతి చెబుతుంది. భర్త బలహీనత గురించి భార్య దగ్గర చెప్పడం వల్ల వారికి లోకువవుతారు. దీంతో చిన్న విషయాలకే ఇద్దరి మధ్యమనస్పర్థలు వచ్చి బలహీనతను ఎత్తి చూపుతారు. అందువల్ల ఈ విషయం గురించి ఎక్కడా ప్రస్తావించకపోవడం మంచిది.
కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులు, వ్యాపారం చేసేవారు తమ పనుల వల్ల ఎన్నో ప్రశంసలు పొందుతారు. ఇదే సమయంలో అనుకోని అవమానాలు ఎదుర్కొంటారు. అయితే ఈ అవమానాల గురించి అక్కడే వదిలేయాలి. తాము ఎటువంటి పరిస్థితుల్లో అవమానం ఎదుర్కొన్నా.. ఆ విషయాన్ని ఇతరులకు చెప్పడం ద్వారా చులకన చూసే అవకాశం ఎక్కువగా ఉంది. అందువల్ల బయట జరిగే విషయాలను భార్యకు చెప్పకుండా అక్కడే వదిలేసి మిగతా విషయాలతో సంతోషంగా ఉండడం మంచిది.
కొందరు తాము చేసే దానం తక్కువే అయినా ప్రచారం ఎక్కువగా చేసుకుంటారు. ఇదే సమయంలో తన భర్త ఇంకొకరికి దానం చేసే విషయంలో భార్య కాస్త నిరాశ చెందుతుంది. అందువల్ల దాన, ధర్మాల గురించి ఇతరులకు, భార్యకు చెప్పకూడదు. ఈ విషయంలో కొందరు అర్థం చేసుకోవచ్చు. కానీ మరికొందరు మాత్రం వ్యతిరేక భావనతో ఉంటారు. దీంతో ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చి గొడవలు జరుగుతూ ఉంటాయి. అప్పుడు మీరు చేసిన దానానికి ఎటువంటి ఫలితం ఉండదు.
మగవాళ్ల జీతం ఎంత అని అడొద్దు.. అని కొన్ని సందర్భాల్లో పేర్కొంటారు. ఇదే సమయంలో భర్త తనకు వచ్చే ఆదాయం గురించి పూర్తిగా చెప్పొద్దు. లేదంటే ఆదాయం ఎక్కువగా ఉందని ఖర్చులు ఎక్కువగా చేస్తుంటుంది. దీంతో వచ్చే ఆదాయం అంతా ఖర్చులకే వెళ్తుంది. అందువల్ల భర్త తన ఆదాయం గురించి భార్యకు అస్సలు చెప్పొద్దని చాణక్య నీతి చెబుతుంది.