https://oktelugu.com/

Kalki Movie : కల్కి సినిమా కి ఇంత క్రేజ్ ఏంటి భయ్య…నెల గడిచిన కూడా కలెక్షన్ల వర్షం కురిపిస్తుందిగా…

ప్రభాస్ అంటే ఇప్పుడు ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక మంచి క్రేజ్ అయితే ఉంది. ఇక దాని వల్లే ఇప్పుడు ఆయన చేస్తున్న ప్రతి సినిమా మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలైతే ఉంటున్నాయి...

Written By:
  • Gopi
  • , Updated On : July 29, 2024 / 07:15 PM IST
    Follow us on

    Kalki Movie  :  బాహుబలి సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియాలో తన సత్తా చాటుకున్న హీరో ప్రభాస్…ప్రస్తుతం ప్రభాస్ నుంచి ఏ సినిమా వచ్చిన టాక్ తో సంబంధం లేకుండా అది దాదాపు 500 కోట్లకు పైన కలెక్షన్లను రాబడుతుందంటే ఆయన స్టార్ డమ్ ఎంతవరకు విస్తరించిందో మనం అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ ఈ సినిమా కనక పాజిటివ్ టాక్ ను తెచ్చుకున్నట్లైతే 1000 కోట్లకు పైన కలెక్షన్లను వసూలు చేస్తుందనడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన కల్కి సినిమా వెయ్యికోట్ల మార్కును దాటి ఇప్పటికీ సక్సెస్ ఫుల్ సినిమాగా ముందుకు దూసుకెళ్తుంది. అయితే ఈ సినిమా రిలీజ్ అయి 30 రోజులు దాటినప్పటికీ ఇప్పటికీ కూడా ఈ సినిమాను చూడడానికి చాలామంది ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు అంటే ఈ సినిమా ఎంతటి ప్రభంజనాన్ని సృష్టించిందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం కల్కి సినిమా ఇప్పటికి విజయవంతంగా ప్రదర్శించబడుతుందంటూ ఆయా ఏరియాలోని డిస్ట్రిబ్యూటర్స్ చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక దాంతో పాటు కల్కి 2 సినిమాకి సంభందించిన సన్నాహాలను కూడా నాగ్ అశ్విన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ సినిమా ఎప్పుడు వస్తుంది అనే విషయాన్ని పక్కన పెడితే ఇప్పుడు సినిమాకు సంబంధించిన మరికొన్ని సెట్స్ ని వేయించే పనిలో నాగ్ అశ్విన్ చాలా బిజీగా ముందుకు సాగుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతం ప్రభాస్ లాంటి స్టార్ హీరో వరుస సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ తొందర్లోనే ఆ సినిమాలను పూర్తి చేసుకొని కల్కి 2 సినిమా మీదకి రావడానికి కొంచెం టైమ్ అయితే పడుతుంది.

    అయినప్పటికీ నాగ్ అశ్విన్ మాత్రం తనకి టైమ్ వేస్ట్ చేసుకునే ఉద్దేశ్యం లేకపోవడంతో ఇప్పటినుంచే కల్కి 2 సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొత్తాన్ని ఫినిష్ చేసే పనిలో తను బిజీగా ఉన్నట్టుగా తెలుస్తుంది…ఇక మొత్తానికైతే ప్రభాస్ ఈ సినిమాతో ఒక పెను ప్రభంజనాన్ని సృష్టించడమే కాకుండా తెలుగు వాడి స్టామినా ఏంటో మరోసారి ఇండియా వైడ్ గా చాటి చెప్పాడనే చెప్పాలి… ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం కల్కి సినిమా ప్రపంచవ్యాప్తం గా రిలీజైన 32 వ రోజు కూడా 63 వేల టికెట్లు అమ్ముడుపోయాయంటూ బుక్ మై షో ద్వారా ఒక సమాచారం అయితే అందుతుంది… ఇక మొత్తానికైతే ఈ సినిమా ఇప్పటికీ కూడా ప్రపంచవ్యాప్తంగా ఒక పెను ప్రభంజనాన్ని సృష్టిస్తూ ముందుకు సాగుతుందనే చెప్పాలి.

    ఇక రీసెంట్ గా హాలీవుడ్ సినిమా అయిన ‘డెడ్ పూల్ అండ్ వాల్వరిన్’ అనే సినిమా రిలీజ్ అయినప్పటికి ఆ సినిమా పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది. అయిన కూడా కల్కి సినిమా కలెక్షన్ల మీద ఆ సినిమా ఏ మాత్రం తన ప్రభావాన్ని అయితే చూపించలేక పోతుంది. అలాగే ఆగస్టు 15వ తేదీ వరకు మన ఇండస్ట్రీ నుంచి ఏ ఒక్క పెద్ద సినిమా కూడా రిలీజ్ అవ్వడం లేదు.

    కాబట్టి అప్పటివరకు కల్కి సినిమా ప్రభంజనం కొనసాగే అవకాశాలైతే ఉన్నాయంటూ సినీ మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు… ప్రస్తుతం కల్కి సినిమాను చూస్తున్న ప్రతి ప్రేక్షకుడు కూడా కల్కి 2 సినిమా మీద భారీ అంచనాలైతే పెట్టుకున్నాడు. ఇక రెండో పార్ట్ కూడా ప్రేక్షకుల అంచనాలకు మించి ఉంటుందని డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఇప్పటికే చాలాసార్లు వివరణ ఇస్తున్నాడు…