https://oktelugu.com/

Rajasaab Glimpse : రాజాసాబ్ గ్లింప్స్ లో ప్రభాస్ లుక్ బాగుంది…కానీ మారుతి ఆ ఒక్క మిస్టేక్ చేయకుండా ఉంటే బాగుండేది…

ఈశ్వర్ సినిమాతో ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్..మొదటి సినిమాతోనే హీరోగా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇక ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా ఎదగడం నిజంగా గ్రేట్ అనే చెప్పాలి...

Written By:
  • Gopi
  • , Updated On : July 29, 2024 / 07:33 PM IST

    rajasaab

    Follow us on

    Rajasaab Glimpse : యంగ్ రెబల్ స్టార్ గా తెలుగు సినిమా ప్రేక్షకులకు పరిచయమైన ప్రభాస్.. ప్రస్తుతం తన స్థాయిని విస్తరించుకునే పనిలో చాలా బిజీగా ఉన్నాడు. బాహుబలి సినిమాతో పాన్ ఇండియాలో స్టార్ గా ఎదిగిన ఆయన ఇప్పుడు మాత్రం అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక దానికి తగ్గట్టుగానే రీసెంట్ గా కల్కి సినిమాతో ప్రపంచవ్యాప్తంగా ఒక పెను ప్రభంజనాన్ని సృష్టించాడనే చెప్పాలి. ఇక ఈ సినిమా వెయ్యి కోట్లకు పైన కలెక్షన్లను రాబట్టి ప్రభాస్ లో ఒక మంచి జోష్ ను అయితే నింపింది. అలాగే తన అభిమానులు కూడా బాహుబలి తర్వాత ప్రభాస్ నుంచి వెయ్యి కోట్లు కలెక్ట్ చేసే సినిమా ఒక్కటి కూడా రాలేదంటూ వాళ్లు కూడా కొద్ది రోజుల నుంచి చాలా వరకు నిరుత్సాపడుతున్నారు. ఇక కల్కి సినిమా సక్సెస్ తో ప్రభాస్ ఒక్కసారిగా అందరిలో జోష్ అయితే నింపాడు…ఇక ఇప్పుడు ప్రభాస్ కూడా రెట్టింపు ఉత్సాహంతో మారుతి డైరెక్షన్ లో చేస్తున్న ‘రాజాసాబ్ ‘ సినిమా షూటింగ్ లో పాల్గొనబోతున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి. ఇంకా దానికి సంబంధించిన గ్లింప్స్ ని కూడా కొద్దిసేపటి క్రితమే రిలీజ్ చేశారు. దాదాపు ఈ సినిమాని స్టార్ట్ చేసి 2 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందనే దాని మీద చాలా మందిలో చాలా రకాల వార్తలైతే వినిపిస్తున్నాయి. ఇక కొంతమంది అయితే ప్రభాస్ కి ఇష్టం లేక పోవడంతో ఈ సినిమాని మధ్యలోనే ఆపేశాడు అంటూ కొన్ని రూమర్లను కూడా క్రియేట్ చేశారు. కానీ వాటన్నింటికి చెక్ పెడుతూ డైరెక్టర్ మారుతి ఈ సినిమాకి సంబంధించిన గ్లింప్స్ ను కొద్దిసేపటి క్రితమే రిలీజ్ చేశారు…

    ఇక ఈ గ్లింప్స్ లో ప్రభాస్ తనకు తానే దిష్టి తీసుకుంటూ కనిపించాడు. ఇక దీన్ని కనక మనం అబ్జర్వ్ చేస్తే ప్రభాస్ ఈ సినిమాలో ఒక యంగ్ లుక్ లో అయితే మనకు కనిపించబోతున్నాడు అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. అయితే ఈ సినిమా కమర్షియల్ సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కుతుంది. కాబట్టి ఈ సినిమాని మారుతి చాలా వరకు సక్సెస్ ఫుల్ గా నిలిపే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక అందులో భాగంగానే ప్రభాస్ లాంటి ఒక పాన్ ఇండియా స్టార్ హీరో నుంచి ఒక సినిమా వస్తుందంటే ప్రభాస్ అభిమానులతో పాటు ఇతర ప్రేక్షకుల్లో కూడా మంచి అటెన్షన్ అయితే క్రియేట్ అవుతుంది.

    అయితే ‘రాజాసాబ్ ‘ సినిమా ప్రభాస్ ఇంతకు ముందు చేస్తున్న సినిమాల కంటే డిఫరెంట్ గా ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. ఒకప్పుడు ఆయన చేసిన మిర్చి, డార్లింగ్ లాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ తో కూడుకున్న సినిమా ఇదని ప్రభాస్ మొదటి నుంచి కూడా చెప్పుకుంటూ వస్తున్నాడు… ఇక రీసెంట్ గా ప్రభాస్ చేస్తున్న సినిమాలన్నింటిలో కూడా మాస్ ఎలివేషన్స్ గానీ, కమర్షియల్ ఎలిమెంట్స్ కానీ అంత పెద్దగా చూపించడం లేదు.

    కాబట్టి ఈ సినిమాలో అవన్నింటినీ మిక్స్ చేసి మన ముందుకు తీసుకొస్తున్నట్టుగా తెలుస్తుంది… అయితే ఈ గ్లింప్స్ లో మారుతి ప్రభాస్ ను తనకు తానే దిష్టి తీసుకున్నట్టుగా చూపించడం కంటే మరేదైనా కొంచెం డిఫరెంట్ గా ట్రై చేసి ఉంటే బాగుండేది అంటూ కొంతమంది సినీ మేధావులు మారుతి పైన కొన్ని విమర్శలైతే చేస్తున్నారు. ఇక దాన్ని మారుతి మిస్టేక్ గానే పరిగణిస్తూ సోషల్ మీడియాలో దీని మీదనే డిస్కస్ చేస్తున్నారు.