Site icon OkTelugu

Venkatesh Anil Ravipudi New Movie: వెంకటేష్ , అనిల్ రావిపూడి కొత్త మూవీ లో సెకండ్ హీరో గా కళ్యాణ్ రామ్..వీడియో వైరల్!

Anil Ravipudi Venkatesh Movie

Anil Ravipudi Venkatesh Movie

Venkatesh Anil Ravipudi New Movie ‘సంక్రాంతికి వస్తున్నాం ‘, ‘మన శంకర వరప్రసాద్ గారు’ వంటి బ్యాక్ టు బ్యాక్ ఇండస్ట్రీ హిట్స్ తర్వాత అనిల్ రావిపూడి(Anil Ravipudi) ఎలాంటి మూవీ చేయబోతున్నాడు అని ప్రతీ ఒక్కరిలో ఒక ఆత్రుత ఉండేది. వికారి వెంకటేష్(Victory Venkatesh) తో చేయబోతున్నాడు అనే విషయం లో క్లారిటీ ఉంది కానీ, ఇందులో సెకండ్ హీరో గా ఎవరు నటించబోతున్నారు అనే దానిపై మాత్రం ఎలాంటి క్లారిటీ లేదు. ముందుగా తమిళ హీరో కార్తీ ని సంప్రదిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత మలయాళం స్టార్ హీరోలలో ఒకరైన ఫహాద్ ఫాజిల్ ని ఎంచుకున్నట్టు వార్తలు వచ్చాయి. చివరికి వీళ్లిద్దరు కాకుండా నందమూరి కళ్యాణ్ రామ్(Nandamuri Kalyan Ram) ని ఎంపిక చేసుకున్నారు . కాసేపటి క్రితమే ఈ విషయాన్నీ మేకర్స్ అధికారికంగా ఒక వీడియో ద్వారా ప్రకటించారు. నిజంగా ఎవ్వరూ ఊహించని కాంబినేషన్ ఇది.

తెలుగు చలన చిత్ర పరిశ్రమకు అనిల్ రావిపూడి ని డైరెక్టర్ గా పరిచయం చేసింది కళ్యాణ్ రామ్. అంతకు ముందు శ్రీను వైట్ల టీంలో పని చేస్తూ ఉండేవాడు అనిల్ రావిపూడి. అవకాశాల కోసం చాలా గట్టి ప్రయత్నాలే చేశాడు కానీ, అనిల్ రావిపూడి ని అప్పట్లో ఎవ్వరూ నమ్మలేదు , కళ్యాణ్ రామ్ నమ్మాడు. ఆరోజే కళ్యాణ్ రామ్ అనిల్ రావిపూడి కి అవకాశం ఇచ్చి ఉండకపోయుంటే, నేడు ఒక గొప్ప డైరెక్టర్ ని టాలీవుడ్ మిస్ అయ్యేది. ఇక అనిల్ రావిపూడి కథ చెప్పినా , చెప్పకపోయినా అతను ఎన్ని కాల్ షీట్స్ అడిగితే , అన్ని కార్ల్ షీట్స్ ఇవ్వడానికి రెడీ ఉంటాడు విక్టరీ వెంకటేష్. ఇప్పటికే వీళ్ళ కాంబినేషన్ లో వచ్చిన నాలుగు సినిమాలు సెన్సేషనల్ హిట్స్ గా నిలిచాయి. ఇప్పుడు ఐదవ సినిమా తెరకెక్కబోతుంది , ఇది ఏ రేంజ్ సెన్సేషన్ సృష్టించబోతుందో చూడాలి.

ఇకపోతే ఈ చిత్రాన్ని సాహు గారపాటి నిర్మించబోతున్నాడు. మ్యూజిక్ డైరెక్టర్ ఈ చిత్రానికి కూడా భీమ్స్ ఉండే అవకాశాలు ఉన్నాయి. కానీ ఈరోజు విడుదల్ చేసిన వీడియో చూస్తే, అందులో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ భీమ్స్ మార్క్ కనిపించలేదు. మరి ఈసారి మ్యూజిక్ డైరెక్టర్ ని మార్చబోతున్నారేమో చూడాలి. ఇకపోతే ఈ సినిమాలో హీరోయిన్స్ గా ఎవరు నటించబోతున్నారు అనేది తెలియాలంటే కొద్దిరోజులు ఎదురు చూడక తప్పదు. ఏది ఏమైనా క్రేజ్ కాంబినేషన్ సెట్ అయ్యింది. సోషల్ మీడియా లో బాగా వైరల్ అయిన ఈ వీడియో ని మీరు కూడా చూసేయండి.

Exit mobile version