Devara: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలు ఉన్నప్పటికీ జూనియర్ ఎన్టీఆర్ కు ఉన్న క్రేజ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఎలాంటి పాత్రలో అయిన నటించి మెప్పించగలిగే సత్తా ఉన్న నటుడు జూనియర్ ఎన్టీఆర్… ప్రస్తుతం ఆయన కొరటాల శివ డైరెక్షన్ లో ‘దేవర ‘ అనే సినిమా చేస్తున్న విషయం మనకు తెలిసిందే…ఈ సినిమాలో ఆయన తన నట విశ్వరూపాన్ని చూపించడానికి రెడీ అవుతున్నాడు అంటూ సినిమా యూనిట్ నుంచి ఒక సమాచారం అయితే అందుతుంది. ఇక దానికి తగ్గట్టుగానే ఈ సినిమా టీజర్ ను కూడా చాలా రోజుల క్రితమే రిలీజ్ చేశారు. ఇక ఆ టీజర్ ని కనక మనం చూసినట్లయితే అది ఊర మాస్ లెవెల్లో ఉంది. ఇక ఈ సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ కి పెద్ద పీట వేస్తూ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇక అనిరుధ్ ఇచ్చిన మ్యూజిక్ కూడా ఈ సినిమాకు చాలా వరకు ప్లస్ అవుతుంది అంటూ కొరటాల శివ పలు సందర్భాల్లో తెలియజేస్తూ వస్తున్నాడు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ గా రిలీజ్ అయిన సాంగ్ కి కూడా ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ అయితే దక్కింది. ఇక బ్యాగ్రౌండ్ స్కోర్ విషయంలో కూడా అనిరుధ్ చాలా స్పెషల్ కేర్ తీసుకుంటూ చేస్తున్నాడట. ఎందుకంటే రీసెంట్ గా ఆయన చేసిన ‘భారతీయుడు 2’ సినిమాలో సాంగ్స్ గాని, బ్యాగ్రౌండ్ స్కోర్ పరంగా గాని ఏ విధమైన ఇంపాక్ట్ ను చూపించలేదు. కాబట్టి దేవర సినిమాతో తనను తాను మరొకసారి ప్రూవ్ చేసుకోవాల్సిన సమయం అయితే ఆసన్నమైంది.
Also Read: రాజాసాబ్ గ్లింప్స్ లో ప్రభాస్ లుక్ బాగుంది…కానీ మారుతి ఆ ఒక్క మిస్టేక్ చేయకుండా ఉంటే బాగుండేది…
ఒకవేళ ఈ సినిమాతో కనక తను మంచి మ్యూజిక్ ఇవ్వడం లో ఫెయిల్ అయినట్టైతే ఇక అనిరుధ్ కి పెద్ద సినిమాల్లో ఛాన్స్ లు తగ్గే అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి ఎలాగైనా సరే తనను తాను స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరమైతే వచ్చింది. ఇక దాంతో పాటుగా తెలుగులో ఆయనకు భారీ మార్కెట్ అనేది క్రియేట్ అవ్వడం లేదు. దానివల్లే మన డైరెక్టర్లు ఆయన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు. ఇక అందుకోసమే అనిరుధ్ ఈ సినిమాతో ఒక పెను ప్రభంజనాన్ని సృష్టించాల్సిన అవసరమైతే ఉంది. ఇక ఇదిలా ఉంటే దేవర సినిమాలో ఒక ఫైట్ ను తెరకెక్కించడం కోసం దాదాపు 5 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారనే విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది.
ఈ సినిమా మొత్తం లో దాదాపు 7 నుంచి 8 ఫైట్లు ఉన్నాయట. అందులో ఒక ఫైట్ మాత్రం చాలా కీలకంగా ఉండబోతున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి. అందులో జూనియర్ ఎన్టీఆర్ చాలా వరకు డూప్ లేకుండా నటిస్తూ ఉండడం విశేషం. అయితే ఈ ఫైట్ కోసం డబ్బులను కూడా భారీ గా ఖర్చు చేస్తుండడంతో ఈ ఫైట్ మీద అంచనాలైతే పెరిగిపోతున్నాయి. ఇక ఈ ఫైట్ ను ప్రముఖ స్టంట్ మాస్టర్ అయిన పీటర్ హెయిన్స్ నేతృత్వంలో తెరకెక్కిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది.
ఇక ఇంతకుముందు జూనియర్ ఎన్టీఆర్ సింహాద్రి, ఆది సినిమాల్లో ఎలాంటి వీరోచితమైన ఫైట్లు చేశాడో మనందరికీ తెలిసిందే. ఇక ఇప్పుడు కూడా అదే బాటలో నడుస్తూ ఈ సినిమాలో కూడా తను భారీ ఫైట్స్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది…ఈ సినిమా సెప్టెంబర్ 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపథ్యంలో సినిమా ఎలాంటి సక్సెస్ ని సాధిస్తుందనేది కూడా తెలియాల్సి ఉంది…
Also Read: కల్కి సినిమా కి ఇంత క్రేజ్ ఏంటి భయ్య…నెల గడిచిన కూడా కలెక్షన్ల వర్షం కురిపిస్తుందిగా…