Site icon OkTelugu

Janasena MLA Arava Sridhar Controversy: భరించలేం.. జనసేన ఎమ్మెల్యేపై బాధితురాలు మరో సంచలన వీడియో..

Janasena MLA Arava Sridhar Controversy

Janasena MLA Arava Sridhar Controversy

Janasena MLA Arava Sridhar Controversy: జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్( MLA arava Sridhar ) వ్యవహారం ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. బాధిత మహిళ తాజాగా మరో వీడియో విడుదల చేసింది. తాను అరవ శ్రీధర్ పై ఆరోపణలు చేసి నెల రోజులు గడుస్తోందని. ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు ఆమె. ఈ వ్యవహారంపై జనసేన ఒక కమిటీ ఏర్పాటు చేసిందని.. విచారణ కూడా జరిపారని.. కానీ ఇంతవరకు చర్యలు మాత్రం తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే గతంలో ఆమె ఈ వ్యవహారంతో పార్టీకి ఎటువంటి సంబంధం లేదని చెప్పుకొచ్చారు. తాజాగా మాత్రం జనసేన పార్టీ వల్లే అరవ శ్రీధర్ కు పేరు వచ్చిందని.. అలాంటప్పుడు అతడు చేసిన తప్పుకు శిక్షించాలి కదా అని ప్రశ్నించింది. ప్రస్తుతం ఆమె వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Also Read: వెంకటేష్ , అనిల్ రావిపూడి కొత్త మూవీ లో సెకండ్ హీరో గా కళ్యాణ్ రామ్..వీడియో వైరల్!

* సరిగ్గా నెల రోజుల కిందట..
నెల రోజుల కిందట బాధితురాలు మీడియా ముందుకు వచ్చారు. తనకు జరిగిన అన్యాయాన్ని చెబుతూ సోషల్ మీడియాలో( social media) అరవ శ్రీధర్ తో ఉన్న సన్నిహిత వీడియోలను విడుదల చేశారు. నెల రోజులు అవుతున్నా తనకు న్యాయం జరగలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అసలు జనసేన కమిటీ ఎలాంటి నివేదిక ఇవ్వలేదని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. ఒక మహిళ అన్యాయం జరిగిందని బయటకి వచ్చి చెప్పే న్యాయం చేసేందుకు ఒక్కడు కూడా ముందుకు రాలేదు. తనకు అన్యాయం జరిగినట్లేనని ఆమె వాపోయారు. జనసేన ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ అని గుర్తు చేశారు. అరవ శ్రీధర్ సర్పంచ్ గా ఉన్నప్పుడు ఎవరో కూడా తెలియదని చెప్పినా ఆమె.. అతడు ఇచ్చిన ధైర్యంతో ఎన్ని దారుణాలు చేసినా తను గుడ్డిగా నమ్మినట్లు చెప్పింది. గ్రామీణ ప్రాంతానికి చెందిన వ్యక్తి కావడంతో అన్యాయం చేయడానికి నమ్మానని చెప్పుకొచ్చారు. కూటమి ప్రభుత్వం పై నమ్మకంతో బయటకు వచ్చి తనకు జరిగిన మోసాన్ని వివరించానని.. కానీ హనీ ట్రాప్, రాజకీయ కుట్ర అంటూ తీవ్ర ఆరోపణలు చేస్తున్నారని బాధిత మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. కాళ్లు పట్టుకొని బతిమాలుకున్నా గత నెల రోజుల నుంచి ఎలాంటి న్యాయం జరగలేదని వాపోయింది.

* వైసీపీ సహకారం పై క్లారిటీ..
మరోవైపు ప్రతిపక్ష పార్టీ వైసీపీ( YSR Congress party ) సహకారం తీసుకుంటున్నారన్న ఆరోపణ ఆమెపై ఉంది. దానిపై కూడా ఆమె తోసిపుచ్చారు. అధికార పార్టీ తనకు న్యాయం చేయకపోతే ప్రతిపక్ష పార్టీ సాయం కోరడంలో తప్పు ఏముందని ఆమె ప్రశ్నించింది. పోలీస్ వ్యవస్థ, అధికారంలో ఉన్న వాళ్ళు తనకు ఏం న్యాయం చేశారని నిలదీసింది. తప్పు చేసిన ఎమ్మెల్యే క్రికెట్ ఆడుతున్నారని.. తాను మాత్రం ఒంటరి అయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. తప్పు చేసిన వాళ్ళని ప్రోత్సహిస్తారా? అంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను ఆమె ప్రశ్నించారు. నెల రోజుల నుంచి ఎవరూ తన వెంట లేరని.. దయచేసి తనకు న్యాయం చేయాలని పవన్ కళ్యాణ్ ను బాధితురాలు కోరడం ప్రాధాన్యత సంతరించుకుంది. అంతటితో ఆగకుండా తనకు న్యాయం చేయకుంటే ఆత్మహత్య చేసుకుంటానని కూడా సదరు మహిళ హెచ్చరించడం హాట్ టాపిక్ అయింది.

Exit mobile version