Tamannaah Bhatia: మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా చిక్కుల్లో పడింది. వివాద రహితురాలిగా పేరుపొందిన తమన్నాకు మహారాష్ట్ర సైబర్ క్రైమ్ పోలీసులు నోటీసులు జారీ చేయడం కలకలం రేపింది. నిబంధనలకు విరుద్ధంగా ఐపీఎల్ మ్యాచ్ లను పెయిర్ ప్లే యాప్ లో లైవ్ స్ట్రీమింగ్ చేసినందుకుగానూ ఈనెల 29న విచారణకు రావాలని పోలీసులు తమన్నాకు జారీ చేసిన నోటీసులలో పేర్కొన్నారు. తమన్నా చేసిన పని వల్ల తమకు కోట్లల్లో నష్టం వాటిల్లిందని.. వయాకాం (ముఖేష్ అంబానికి చెందిన మీడియా కంపెనీ) పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఐపీఎల్ 17వ సీజన్ కు సంబంధించి వయాకాం సంస్థ డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంది. ఈ సంస్థ జియో సినిమా యాప్ ద్వారా క్రికెట్ మ్యాచ్ లను లైవ్ ప్రసారం చేస్తోంది. ఈ సంస్థ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో మహారాష్ట్ర సైబర్ క్రైమ్ పోలీసులు పెయిర్ ప్లే యాప్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. దీనిపై మరింత లోతుగా దర్యాప్తు చేసేందుకు విచారణకు హాజరు కావాలని తమన్నాకు పోలీసులు నోటీసులు పంపించారు. దీనికి కారణం ఫెయిర్ ప్లే యాప్ తమన్నా ప్రమోట్ చేయడమే.. అందువల్లే విచారణకు సాక్షిగా ఆమెను పిలిచామని మహారాష్ట్ర సైబర్ క్రైమ్ పోలీసులు అంటున్నారు. మరోవైపు ఇదే కేసులో బాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్ దత్ కు కూడా నోటీసులు జారీ చేసినట్టు మహారాష్ట్ర సైబర్ క్రైమ్ పోలీసులు పేర్కొంటున్నారు. ఆయన కూడా ఈనెల 23న విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే వ్యక్తిగత కారణాలవల్ల ఆయన హాజరు కాలేకపోయారు. విచారణకు హాజరయ్యేందుకు తనకు మరో తేదీ కేటాయించాలని సంజయ్ దత్ పోలీసులను కోరారు. పెయిర్ ప్లే యాప్ ఐపీఎల్ మ్యాచ్ లను నిబంధనలకు విరుద్ధంగా టెలికాస్ట్ చేసిందని.. దానివల్ల మాకు 100 కోట్ల వరకు నష్టం వాటిల్లిందని వయాకాం ఆరోపిస్తోంది.
మహారాష్ట్ర సైబర్ క్రైమ్ పోలీసులు ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి విచారణ సాగిస్తున్నారు. పెయిర్ ప్లే యాప్ మ్యాచ్ లను టెలికాస్ట్ చేయడం ద్వారా భారీగా డబ్బు సంపాదించిందని.. ఆ యాప్ తనకు సంబంధించిన వివిధ కంపెనీల ఖాతాల నుంచి నటీనటులకు డబ్బులు పంపిందని పోలీసులు గుర్తించారు. వెంచర్ అనే కంపెనీ (ఇది కూరాకోలో ఉంది) ఖాతా నుంచి నటీనటులకు డబ్బులు ఇచ్చినట్టు పోలీసులు తమ విచారణలో ఐడెంటిఫై చేశారు. ఎఫ్ జడ్ ఎఫ్( ఇది లైకోస్ గ్రూప్ నకు చెందింది) అనే సంస్థ నుంచి మరో నటుడు డబ్బు అందుకున్నాడు. ప్రముఖ నటి జాక్వెలింగ్ ఫెర్నాండేజ్ కూడా ఇదే సంస్థ నుంచి డబ్బు స్వీకరించినట్టు తెలుస్తోంది.. గత ఏడాది డిసెంబర్లో పెయిర్ ప్లే యాప్ లో పనిచేస్తున్న ఓ ఉద్యోగిని పోలీసులు అరెస్ట్ చేశారు.
తమన్నాకు ఏమైనా డబ్బులు అందాయా? ఫెయిర్ ప్లే యాప్ లో ఐపీఎల్ మ్యాచ్ లు టెలికాస్ట్ గురించి ఆమెకు ఏమైనా తెలుసా? ఆ కంపెనీకి, ఆమెకు మధ్య ఏదైనా ఒప్పందం జరిగిందా? అనే కోణాల్లో పోలీసులు విచారణ సాగించనున్నట్టు తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ మహారాష్ట్ర సైబర్ క్రైమ్ పోలీసులు నోటీసులు జారీ చేయడంతో తమన్నా ఆందోళనకు గురైనట్టు తెలుస్తోంది. న్యాయ నిపుణులతో చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. ప్రస్తుతం తమన్నా చేతి నిండా సినిమాలతో బిజీబిజీగా ఉంది. అరణ్మనై చిత్రంలో కీలకపాత్ర పోషిస్తోంది. ఇటీవల ఆ సినిమాకు సంబంధించిన ఒక పాట విడుదలై యూట్యూబ్ ను షేక్ చేస్తోంది. రాశి ఖన్నాతో కలిసి తమన్నా వేసిన స్టెప్పులు అలరిస్తున్నాయి.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Police notices to heroine tamannaah bhatia
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com