Homeబాలీవుడ్Tamannaah Bhatia: పెళ్ళికి ముందే తల్లి కానున్న తమన్నా... ప్రియుడితో కలిసి అనూహ్య నిర్ణయం!

Tamannaah Bhatia: పెళ్ళికి ముందే తల్లి కానున్న తమన్నా… ప్రియుడితో కలిసి అనూహ్య నిర్ణయం!

Tamannaah Bhatia: తమన్నా భాటియా పెళ్లి కి ముందే తల్లి కాబోతున్నారన్న న్యూస్ కాకరేపుతుంది. ఈ మేరకు బాలీవుడ్ మీడియాలో ఆసక్తికర కథనాలు వెలువడుతున్నాయి. ప్రియుడు విజయ్ వర్మతో కలిసి తమన్నా ఈ నిర్ణయం తీసుకున్నారట. తమన్నా ఏడాదిన్నర కాలంగా నటుడు విజయ్ వర్మతో డేటింగ్ చేస్తుంది. 2013 న్యూ ఇయర్ వేడుకలు ఈ జంట కలిసి జరుపుకున్నారు. దాంతో ఎఫైర్ రూమర్స్ తెరపైకి వచ్చాయి. తమన్నా-విజయ్ వర్మ ఈ రూమర్స్ ని కొట్టిపారేశారు. తమ మధ్య ఎలాంటి రిలేషన్ లేదని వాదించారు.

కట్ చేస్తే కొన్ని నెలల తర్వాత… ఔను మేమిద్దరం ఇష్టపడ్డాం అని క్లారిటీ ఇచ్చారు. తమన్నా-విజయ్ వర్మ లస్ట్ స్టోరీస్ 2 సిరీస్ లో జంటగా నటించారు. ఆ ఆంథాలజీ సిరీస్ షూటింగ్ లోనే ప్రేమ చిగురించింది అట. విజయ్ వర్మ చాలా కేరింగ్. నన్ను జీవితాంతం భద్రంగా చూసుకుంటాడు, రక్షణగా ఉంటాడనే నమ్మకం కలిగింది. అందుకే అతన్ని ఇష్టపడ్డానని తమన్నా అన్నారు.

రిలేషన్ గురించి అందరికీ తెలిశాక తమన్నా-విజయ్ వర్మ బహిరంగంగా కలిసి తిరుగుతున్నారు. ఇష్టమైన ప్రదేశాలకు వెకేషన్స్ కి చెక్కేస్తున్నారు. పలు సెలెబ్రిటీ ఈవెంట్స్ లో జంటగా పాల్గొంటున్నారు. ఈ ఏడాది పెళ్లి పీటలు ఎక్కడం ఖాయమని వార్తలు వస్తున్నాయి. అయితే పెళ్లి కంటే ముందు పిల్లల్ని కనాలని ఫిక్స్ అయ్యిందట తమన్నా. సహజీవనం చేసి ముందు ఒక బిడ్డకు తల్లి కావాలని అనుకుంటుందట. ఇదేం నిర్ణయం.. పెళ్లి చేసుకున్నాకే పిల్లల్ని కనొచ్చు కదా.. అని సందేహం రావొచ్చు.

పిల్లలను కనడం, పెంచడం బాధ్యతతో కూడిన వ్యవహారం. తమ బంధం ఎంత బలంగా ఉందో తెలియాలంటే ముందు బిడ్డను కనాలని అనుకుంటున్నారట. కాబట్టి తమన్నా-విజయ్ వర్మ ఫ్యామిలీ ప్లానింగ్ చేస్తున్నారంటూ ఓ వాదన తెరపైకి వచ్చింది. ఈ న్యూస్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఈ రోజుల్లో పెళ్ళికి ముందే గర్భం దాల్చడం కామన్ అయిపోయింది. రన్బీర్ కపూర్ ని పెళ్లి చేసుకున్న అలియా భట్ అప్పటికే గర్భవతి. అలాగే ఇలియానా సహజీవనం చేసి తల్లి అయ్యింది. ఈ లిస్ట్ లో తమన్నా చేరనుందని అంటున్నారు.

RELATED ARTICLES

Most Popular