CM Revanth Reddy: ఇటీవల శాసనసభలో జరిగిన చర్చలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టంగానే తన వైఖరి చెప్పారు. బెనిఫిట్ సోలు ఉండవని, టికెట్ రేట్ల పెంపు కూడా సాధ్యం కాదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. దీంతో సినీ పరిశ్రమ చెందిన పెద్దలు గురువారం కమాండ్ కంట్రోల్ సెంటర్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో సమావేశమయ్యారు. సుమారు రెండు గంటల పాటు ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి తన వైఖరిని మరోసారి స్పష్టం చేశారు. బెనిఫిట్ షోలు ఉండవని, టికెట్ రేట్ల పెంపుదల సాధ్యం కాదని చెప్పేశారు.. అంతేకాదు బౌన్సర్ల వ్యవహారంలో కఠినంగా ఉంటామని, ఈవెంట్లకు అనుమతులు ఇస్తామని.. కాకపోతే అభిమానులను నియంత్రించాల్సిన బాధ్యత హీరోలదేనని ప్రకటించారు.
సంధి కుదిరింది గాని..
శాసనసభలో ముఖ్యమంత్రి చేసిన ప్రకటన నేపథ్యంలో తెలుగు చిత్ర పరిశ్రమ పెద్దలు ఒక్కసారిగా కలకలానికి గురయ్యారు. ఎందుకంటే ప్రస్తుతం టాలీవుడ్ లో భారీ బడ్జెట్ తో అనేక సినిమాలు నిర్మాణంలో ఉన్నాయి. సంక్రాంతికి డాకు మహారాజ్, గేమ్ చేంజర్ లాంటి సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఇది భారీ బడ్జెట్ తో రూపొందాయి. ఈ సినిమాలు నిర్మించిన నిర్మాతలు గట్టెక్కాలంటే బెనిఫిట్ షో లు, టికెట్ ధరల పెంపు వంటివి కచ్చితంగా జరగాలి. ముఖ్యమంత్రి నిర్ణయం వల్ల అవి జరిగే పరిస్థితి లేదు. శాసనసభలో ముఖ్యమంత్రి ఈ నిర్ణయం ప్రకటించిన నేపథ్యంలో.. ఆయన తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటారని.. తెలుగు చిత్ర పరిశ్రమ భావించింది. కానీ అలాంటి సంకేతాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవ్వలేదు. పైగా తన నిర్ణయం మారబోదని స్పష్టం చేశారు. తెలుగు చిత్ర పరిశ్రమకు ఇచ్చే రాయితీల విషయంలో వెనక్కి తగ్గేది లేదని.. ఇంకా అంతర్జాతీయ స్థాయికి తెలుగు చిత్ర పరిశ్రమను తీసుకెళ్లే ఉద్దేశం తమకు ఉందని ముఖ్యమంత్రి ప్రకటించారు. చంద్రబాబు హయాంలో నిర్వహించినట్టుగా అంతర్జాతీయ స్థాయిలో ఫిలిం ఫెస్టివల్ హైదరాబాద్ వేదికగా నిర్వహించే ఉద్దేశం తమకు ఉందని ముఖ్యమంత్రి వెల్లడించారు. అయితే ఈ దశలో నాగార్జున ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేశారు. క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ప్రభుత్వం చేపడితే.. తెలుగు చిత్ర పరిశ్రమను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్తామని ఆయన పేర్కొన్నారు. మరోవైపు సీనియర్ దర్శకుడు రాఘవేంద్రరావు కూడా ప్రభుత్వం తెలుగు చిత్ర పరిశ్రమకు అందిస్తున్న సహకారాన్ని కొనియాడారు. పుష్ప -2 వివాదం వల్ల ప్రభుత్వానికి, తెలుగు చిత్రపరిశ్రమకు ఏర్పడిన గ్యాప్ ప్రస్తుతానికైతే కాస్త పూడింది. అయితే ఇది పూర్తిస్థాయిలో కాదనేది నిజం. మరోవైపు ఫిలిం కార్పొరేషన్ చైర్మన్ గా దిల్ రాజు కూడా బెనిఫిట్ షో లు, టికెట్ రేట్లపై ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. ప్రస్తుతానికి అయితే చిత్ర పరిశ్రమ అభివృద్ధి పైన తమ ఫోకస్ ఉందని ఆయన వ్యాఖ్యానించడం విశేషం. మొత్తంగా చూస్తే ప్రభుత్వం చెప్పాల్సింది , దిల్ రాజు ద్వారా చెప్పించిందని సినీ విశ్లేషకులు అంటున్నారు.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Tollywood celebrities who meet telangana cm revanth reddy what were the topics discussed in the meeting
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com