Nagarjuna : పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ అరెస్ట్ అయిన తర్వాత మొదలైన గందరగోళం చిచ్చు రేపుతోంది. సంధ్య థియేటర్‌లో తొక్కిసలాట ఘటనపై సోషల్ మీడియాలో పోస్ట్‌లు హల్‌చల్ చేస్తున్నాయి. ఈ ఘటనపై ప్రజలు ఇష్టానుసారంగా పోస్టులు పెడుతున్నారు కాబట్టి.. ప్రజలను తప్పుదోవ పట్టించేలా పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. ఈ క్రమంలోనే సినీ ప్రముఖులు సీఎం రేవంత్ రెడ్డితో పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో సమావేశం అయ్యారు. సమావేశంలో రేవంత్ రెడ్డి.. అల్లు అర్జున్ వ్యవహారం పై కీలక వ్యాఖ్యలు చేశారు. సినీ ఇండస్ట్రీ నుంచి ప్రభుత్వం ఎలాంటి సహకారం కోరుకుంటుందో రేవంత్ రెడ్డి వివరించారు. అదే విధంగా సినీ ఇండస్ట్రీకి ప్రభుత్వం నుంచి పూర్తి మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు. ఇండస్ట్రీ సమస్యల పరిష్కారం కోసం పరిశ్రమ నుంచి ఒక కమిటీ ఏర్పాటు చేసుకుని.. పూర్తి నివేదిక తో తనను కలవాలని సూచించారు. ఇక, అల్లు అర్జున్ తో పాటుగా రామ్ చరణ్ తో తనకు ఉన్న సంబంధాల గురించి రేవంత్ రెడ్డి ఆసక్తి కరంగా చెప్పుకొచ్చారు.
సినీ పెద్దలతో సీఎం రేవంత్ నిర్వహించిన భేటీలో పలు అంశాలు చర్చకు వచ్చాయి. ప్రభుత్వం సినీ పెద్దల ముందు నిర్దిష్ట ప్రతిపాదనలు చేసింది. ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమాల్లో సినీ రంగం నుంచి ప్రాతినిధ్యం ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. డ్రగ్స్ పైన చేస్తున్న పోరాటానికి మద్దతుగా నిలవాలని ఆయన కోరారు. ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగా ఎవరి పైనా కేసులు పెట్టడం లేదని చట్టం తన పని తాను చేసుకుపోతుందని రేవంత్ చెప్పారు. తమ ప్రభుత్వానికి ఐటీ, ఫార్మాతో పాటుగా సినీ రంగం కూడా ప్రధానమైనదని చెప్పుకొచ్చారు. టాలీవుడ్ సమస్యల పరిష్కారానికి మంత్రివర్గ ఉప సంఘం ఏర్పాటు చేస్తామని రేవంత్ ప్రకటించారు.
సమావేశంలో పాల్గొన్న సినీ ప్రముఖుల్లో… దిల్ రాజు, సురేష్ బాబు, బోయపాటి శ్రీను, వంశీ పైడిపల్లి, రాఘవేంద్రరావు, శ్యాంప్రసాద్ రెడ్డి, మురళీమోహన్, త్రివిక్రమ్, సాయిరాజేష్, సీ. కల్యాణ్, హరీశ్ శంకర్, బీవీఎన్ ప్రసాద్, కిరణ్ అబ్బవరం, వశిష్ట, నవీన్, రవిశంకర్, గోపి ఆచంట మొదలైనవారు ఉన్నారు. ఈ సమావేశంలో 21 మంది నిర్మాతలు, 13 మంది దర్శకులతో పాటు 11 మంది నటులు హాజరు అయ్యారు. ఇక ప్రభుత్వం తరుపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తో పాటు సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. వీరితో పాటు డీజీపీ, ఇతర అధికారులు పాల్గొన్నారు. సినీ పెద్దలు – తెలంగాణ సర్కార్ మధ్య తాజాగా జరుగుతున్న భేటీకి సంబంధించి ఆసక్తికర విషయాలు తెరమీదకు వచ్చాయి.
సినిమా టిక్కెట్లపై ప్రత్యేక సెస్ ను ఏర్పాటు చేసి, దాని ద్వారా వచ్చే నిధులను ఇంటిగ్రేటేడ్ స్కూళ్లకు వినియోగించనున్నట్లు ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. సినీ ప్రముఖులతో జరుగుతున్న సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాట ఘటనపై స్పందించారని సమాచారం. ఆ తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందడం, ఆమె కుమారుడు ప్రాణాపాయ స్థితికి చేరుకోవడంతోనే తమ ప్రభుత్వం సీరియస్ గా స్పందించిందని తెలిపారని తెలుస్తోంది. ప్రధానంగా శాంతి భద్రతల విషయంలో రాజీ పడేది లేదని తెలిపారు. అభిమానులను కంట్రోల్ చేసుకునే బాధ్యత సెలబ్రెటీలదే అని రేవంత్ రెడ్డి చెప్పినట్లు తెలుస్తోంది. బౌన్సర్ల విషయంలోనూ సీఎం సీరియస్ గా స్పందించారని అంటున్నారు. ఒక్కొక్కరూ 30 – 40 మంది బౌన్సర్లను ఏర్పాటు చేసుకుంటే.. వారేమో తమ ప్రతాపాన్ని సామాన్య ప్రజలపై చూపిస్తున్నారని అన్నట్లు సమాచారం.
ఇది ఇలా ఉంటే ఈ సమావేశంలో ఓ ఆసక్తికర సన్నివేశం కనిపించింది. రేవంత్ రెడ్డితో భేటీ అయిన వారిలో హీరో నాగార్జున కూడా ఉన్నారు. సాధారణంగా నాగార్జున ఇలాంటి కార్యక్రమాలకు వెళ్లరు. కానీ ఈ భేటీలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. అదే విధంగా ఈయన రేవంత్ రెడ్డికి శాలువా కప్పి సన్మానించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. నాగార్జున రేవంత్ రెడ్డి మధ్య ఇటీవల కాలంలో కాస్త గ్యాప్ పెరిగిన విషయం తెలిసిందే. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత హైదరాబాద్లో అక్రమ కట్టడాలపై జులుం విదిలించారు. హైదరాబాద్లో ప్రభుత్వ స్థలాలను చెరువులను ఆక్రమించి అక్రమ కట్టడాలు నిర్మించిన వాటన్నింటిని కూడా కూల్చివేశారు. ఇందులో భాగంగా నాగార్జున ఎన్ కన్వెన్షన్ సెంటర్ ని కూడా కూల్చివేసిన విషయం తెలిసిందే.
ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేయడంతో నాగార్జున కోర్టుకు వెళ్లారు. అదేవిధంగా కాంగ్రెస్ మంత్రి కొండా సురేఖ సైతం సమంత నాగచైతన్య విడాకులకు కేటీఆర్ కారణమంటూ ఇష్టానుసారంగా మాట్లాడడంతో ఈ విషయాన్ని నాగార్జునతో పాటు సినిమా ఇండస్ట్రీ మొత్తం ఖండించింది. అంతేకాకుండా తనపై పరువు నష్టం దావా కూడా వేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ భేటీలో నాగార్జున పాల్గొన్నారని అందరూ భావించారు.. కానీ ఆయన మాత్రం ఈ భేటీలో పాల్గొని ఏకంగా రేవంత్ రెడ్డికి శాలువా కప్పి మరి సన్మానించడంతో వీరిద్దరి మధ్య విభేదాలు తొలగిపోయినట్టేనని తెలుస్తోంది.
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Nagarjuna was honored with a shawl even if the convention collapsed revanth received it with a smile viral pic
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com