Homeఎంటర్టైన్మెంట్సినిమా ఎనాలిసిస్Lady Contestant Blackmailed: బ్లాక్ మెయిల్ చేసి మరీ జబర్ధస్త్ కొచ్చిన ఆ లేడీ...

Lady Contestant Blackmailed: బ్లాక్ మెయిల్ చేసి మరీ జబర్ధస్త్ కొచ్చిన ఆ లేడీ కంటెస్టెంట్

Lady Contestant Blackmailed: జబర్దస్త్ షో ఎంతటి ప్రాచుర్యం పొందిందో మనకు తెలిసిందే. ఎక్కడ చూసినా దాని గురించే చర్చ. ఏ సెల్ ఫోన్ ఓపెన్ చేసినా ఆ షోనే చస్తుండటం చూస్తున్నాం. ప్రేక్షకులకు అంతలా నచ్చిన షో కావడంతో కామెడీ కోసం జబర్దస్త్ ను ఇష్టంగా వీక్షిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో కన్నా కాస్త కామెడీ తగ్గింది. కమెడియన్లు కూడా చాలా మంది వెళ్లిపోవడంతో ప్రస్తుతం జబర్దస్త్ షో కాస్త వెనుకబడి పోయిందనే చెబుతున్నారు. ప్రజలకు కామెడీ పంచడమే ధ్యేయంగా వచ్చిన షో ప్రస్తుతం కాస్త ఒడిదుడుకుల మధ్య ఉన్నట్లు సమాచారం. జబర్దస్త్ షో లో అవకాశం రావడం ఓ అదృష్టంగా భావిస్తారు. అలాంటి అవకాశాలు చాలా మంది అందుకున్నా కొందరు మాత్రం పొందలేకపోవడం నిజంగా దురదృష్టమే.

Lady Contestant Blackmailed
Jabardast

జబర్దస్త్ షో లో లేడీ కంటెస్టెంట్లు తక్కువే. కానీ ఉన్న వారు మాత్రం కామెడీ పండించడానికే ప్రాధాన్యం ఇస్తారు. ఎక్కువగా లేడీ గెటప్ లతోనే నడిపిస్తారు. ఈ కోవలో జబర్దస్త్ లో అవకాశం దక్కించుకున్న ఫైమా గురించి ఇక్కడ చెప్పుకోవాలి. ఆమె పటాస్ షో ద్వారా జబర్దస్త్ కు ఎంట్రీ ఇచ్చింది. మొదట పటాస్ షోలో ఆడియన్ గా వచ్చిన ఆమె వాయిస్ నటన బాగుండటంతో ఆమెను జబర్దస్త్ టీంలోకి తీసుకున్నారు. కానీ ఆమె జబర్దస్త్ టీంలోకి రావడానికి చాలా కష్టాలు పడింది.

Also Read: EAtala Rajender: రాజేందర్ బీజేపీకి సికిందర్ కాబోతున్నాడా?

పటాస్ షోలో పర్ఫార్మెన్స్ కు మెచ్చి జబర్దస్త్ లో అవకాశం ఇస్తామని చెప్పడంతో ఇంట్లో వాళ్లు ఒప్పుకోలేదు. మనకు షోలు కలిసి రావని అడ్డు చెప్పడంతో ఇక ఏం చేయాలనే ఆలోచనలో పడిపోయింది. కానీ ఎలాగైనా జబర్దస్త్ లో స్థానం దక్కించుకోవాలనే తపనతో ఓ ప్లాన్ వేసింది. తనను జబర్దస్త్ కు పంపకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది. దీంతో కుటుంబసభ్యులు ఆందోళన చెంది తరువాత వెళ్లమని చెప్పారట. దీంతో ఆమె జబర్దస్త్ టీంలోకి రంగప్రవేశం చేసింది.

Lady Contestant Blackmailed
Faima

మొదట చిన్న చిన్నవేషాలు ఇచ్చినా తరువాత తానేమిటో నిరూపించుకుంది. జీవన్ టీంలో చేసినప్పుడు అంతగా గుర్తింపు రాలేదు. తరువాత బుల్లెట్ భాస్కర్ టీంలోకి రావడంతో ప్రస్తుతం ఆమె పేరు మారుమోగుతోంది. తన నటనతో అందరిని మెప్పిస్తోంది. దీంతో భాస్కర్ టీంకు కూడా మంచి పేరు వచ్చేందుకు దోహదపడుతోంది. ఫైమా తల్లిదండ్రులు నో చెబితే ఏం చేయాలని ఆలోచిస్తూ కూర్చుంటే అక్కడే ఉండేది. కానీ ధైర్యం చేసి ఇంట్లో వారిని బ్లాక్ మెయిల్ చేసి మరీ జబర్దస్త్ కు ఆతిథ్యమిచ్చింది. దీంతో తల్లిదండ్రులను ఎదిరించి వారితో ఒప్పించుకుని జబర్దస్త్ లోకి రావడం నిజంగా ఫైమాకు అదృష్టమే.

Also Read: Crisis In Amma Party In Tamil Nadu: తమిళనాడులో అమ్మ పార్టీలో సంక్షోభం…కత్తులు దూసుకుంటున్నఆ ఇద్దరు నేతలు

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
RELATED ARTICLES

Most Popular