Raj Tarun Lavanya: హీరో రాజ్ తరుణ్ మాజీ ప్రేయసి లావణ్య సూసైడ్ నోట్ కలకలం రేపుతోంది. ఆమె తన లాయర్ కి సూసైడ్ లెటర్ పంపినట్లు సమాచారం. సూసైడ్ నోట్లో ఆమె పొందుపరిచిన అంశాలు సంచలనంగా మారాయి. రాజ్ తరుణ్ సీరియస్ ట్రబుల్స్ ఎదుర్కొంటున్నారు. లావణ్య అనే యువతి రాజ్ తరుణ్ మీద కేసు పెట్టింది. రాజ్ తరుణ్ శారీరకంగా వాడుకుని వదిలేయాలని చూస్తున్నాడు అనేది ఆమె ప్రధాన ఆరోపణ. ఇటీవల నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో రాజ్ తరుణ్ మీద కేసు పెట్టింది.
రాజ్ తరుణ్ ఎఫైర్ పెట్టుకున్నాడని లావణ్య ఆరోపిస్తున్న హీరోయిన్ మాల్వి మల్హోత్రను కూడా తన కంప్లైంట్ లో జోడించారు. రాజ్ తరుణ్ ప్రస్తుతం తిరగబడరసామీ మూవీ చేస్తున్నాడు. ఈ చిత్రానికి ఏఎస్ రవికుమార్ చౌదరి దర్శకుడు. టీజర్ కూడా విడుదల చేశారు. త్వరలో విడుదల కావాల్సి ఉంది. సడన్ గా రాజ్ తరుణ్ వివాదంలో చిక్కుకున్నాడు. లావణ్య అనే యువతి ఆయన మీద కేసు పెట్టింది.
మాల్వి మల్హోత్రతో ఎఫైర్ పెట్టుకున్న రాజ్ తరుణ్ నన్ను వదిలించుకోవాలని చూస్తున్నాడు. లేదంటే చంపేస్తా అని బెదిరిస్తున్నాడు. రాజ్ తరుణ్ కి చాలా అఫైర్స్ ఉన్నాయి. బిగ్ బాస్ ఫేమ్ అరియనా గ్లొరీ తో కూడా రాజ్ తరుణ్ రిలేషన్ పెట్టుకున్నాడని లావణ్య ఆరోపించారు. లావణ్య పేరెంట్స్ సైతం మీడియా ముందుకు వచ్చారు. రాజ్ తరుణ్-లావణ్యల సహజీవనం గురించి మాకు తెలుసని వారు అంటున్నారు.
రాజ్ తరుణ్ ఫ్యామిలీతో మాకు సన్నిహిత్యం ఏర్పడింది. ఇరు కుటుంబాల మధ్య రాకపోకలు, ఫోన్లో మాట్లాడుకోవడం ఉండేదని లావణ్య ఫాదర్ తెలియజేశారు. మూడు నెలల నుండి రాజ్ తరుణ్ తో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా మాట్లాడటం లేదు. ఫోన్ నెంబర్ కలవడం లేదు. స్విఛ్ ఆఫ్ వస్తుందని లావణ్య పేరెంట్స్ తెలియజేశారు. ఆడపిల్ల కాబట్టి కొన్ని విషయాలు మేము బటయటకు చెప్పుకోలేకపోయాము. లావణ్యకు డ్రగ్స్ అలవాటు లేదని, మా అమ్మాయి గురించి మాకు బాగా తెలుసంటూ ఆవేదన చెందారు.
తాజాగా లావణ్య సూసైడ్ నోట్ రాయడం చర్చకు దారి తీసింది. ఈ లేఖ ఆమె తన లాయర్ దిలీప్ సుంకరకు పంపినట్లు సమాచారం. సదరు లెటర్లో తన చావుకు రాజ్ తరుణ్ పేరెంట్స్, మాల్వి మల్హోత్రా కారణం అని రాశారట. రాజ్ తరుణ్ లేని జీవితం నాకు వద్దు. నన్ను అందరూ మోసం చేశారు. సర్వం కోల్పోయానని లావణ్య సూసైడ్ లెటర్ రాశారని తెలుస్తుంది. లావణ్య సూసైడ్ లెటర్ అందిన వెంటనే దిలీప్ సుంకర పోలీసులకు సమాచారం ఇచ్చాడు.
లావణ్య ఇంటికి వెళ్లిన పోలీసులు ఆమెను కలిసి కౌన్సిలింగ్ ఇచ్చారట. మరోవైపు రాజ్ తరుణ్ కెరీర్ అయోమయంలో పడింది. అరెస్ట్ పుకార్లు నేపథ్యంలో నిర్మాతలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే రాజ్ తరుణ్ కెరీర్ అయోమయంగా తయారైంది. వరుస పరాజయాలతో రాజ్ తరుణ్ సపోర్టింగ్ రోల్స్ కి పడిపోయాడు. సంక్రాంతికి విడుదలైన నా సామిరంగ మూవీలో రాజ్ తరుణ్ సపోర్టింగ్ రోల్ చేసిన సంగతి తెలిసిందే..
కేసు రోజు రోజుకు కాంప్లికేట్ అవుతుంది. కాగా లావణ్య కథనం ప్రకారం సోషల్ మీడియాలో వీరికి పరిచయం ఏర్పడింది. అప్పుడు రాజ్ తరుణ్ షార్ట్ ఫిలిమ్స్ చేసేవాడు. మొదట ఫ్రెండ్స్ గా ఉన్న వీరు ప్రేమికులు అయ్యారు.
Also Read: నాగార్జున చేసిన సోగ్గాడే చిన్ని నాయన సినిమాను మిస్ చేసుకున్న హీరో ఎవరో తెలుసా..?