Homeఆంధ్రప్రదేశ్‌AP FDC Chairman Post: ఏపీలో ఆ పదవి భర్తీ ఎప్పుడు?!

AP FDC Chairman Post: ఏపీలో ఆ పదవి భర్తీ ఎప్పుడు?!

AP FDC Chairman Post: రాజకీయ,సినీ రంగాలకు చాలా దగ్గర సంబంధాలు ఉంటాయి. ప్రస్తుతం ఏపీ డిప్యూటీ స్పీకర్ పవన్ కళ్యాణ్ సినిమా రంగానికి చెందిన వారే. కూటమి గెలిస్తే ఏపీలో సినీ రంగం అభివృద్ధి చెందుతుందని అంతా భావించారు. దీనికి తోడు మొన్న ఎన్నికల్లో చిత్ర పరిశ్రమ అంతా కూటమి గెలవాలని కూడా భావించింది. అయితే గెలిచిన తర్వాత ఏపీ ప్రభుత్వం సినీరంగం విషయంలో సైలెంట్ గా ఉంది. అటు తెలుగు చిత్ర పరిశ్రమ సైతం ఏపీ కంటే తెలంగాణ ప్రభుత్వం విషయంలోనే ఆసక్తిగా ఉంది. ఏపీలో సైతం సినీ రంగానికి సంబంధించిన నియామకాలు కానీ.. ఎటువంటి చర్యలు కానీ లేవు. ముఖ్యంగా ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇంతవరకు భర్తీ చేయలేదు.

అప్పట్లో పోసాని కృష్ణ మురళి..
2019లో అధికారంలోకి వచ్చిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వెంటనే ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవిని భర్తీ చేసింది. పోసాని కృష్ణమురళిని నియమించింది. అయితే కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్న ఆ పదవి భర్తీ చేయలేదు. తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఆ పదవిలో స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజును నియమించింది. ఏపీలో మాత్రం అదిగో ఇదిగో అంటూ రెండేళ్లు దాటిపోయింది. అయితే ఈ పదవి కోసం కూటమిలో చాలామంది ఆశావహులుగా ఉన్నారు. పైగా సినీ రంగానికి చెందిన పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా ఉండగా.. నందమూరి బాలకృష్ణ హిందూపురం ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఇంకోవైపు మెగా బ్రదర్ నాగబాబు ఎమ్మెల్సీగా ఉన్నారు. వీరంతా ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి తమవారికి కట్ట పెట్టాలన్న ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది.

Also Read: రాజీనామా యోచనలో వైసీపీ ఎమ్మెల్సీలు?!

టిడిపిలో సినీ గ్లామర్..
తెలుగుదేశం ( Telugu Desam) పార్టీకి ఆది నుంచి సినీ గ్లామర్ ఎక్కువ. ఆ పార్టీలో చాలామంది పనిచేశారు కూడా. ఒకప్పటి స్టార్ హీరోయిన్స్ జయప్రద, శారద లాంటివారు పనిచేశారు. ప్రస్తుతం రాఘవేంద్రరావు, అశ్విని దత్, మురళీమోహన్ లాంటి వారు ఉన్నారు. జనసేనలో సైతం సినీ గ్లామర్ ఉంది. బిజెపిలో దివంగత కృష్ణంరాజు కుటుంబ సభ్యులు ఉన్నారు. అయితే ప్రస్తుతం ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవికి విపరీతమైన పోటీ ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో పవన్ కళ్యాణ్ ఏఎం రత్నం కు పదవి ఇవ్వాలన్న కోరికను బయటపెట్టారు. అది కూడా సీఎం చంద్రబాబు నిర్ణయించాల్సి ఉంటుందని షరతు పెట్టారు. వీలైనంత త్వరగా ఈ పదవిని భర్తీ చేయాలని సినీ పరిశ్రమ నుంచి వస్తోంది. మరి సీఎం చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version