https://oktelugu.com/

Raj Tarun: అల్లుడూ! తిరిగి వచ్చేయ్ గ్రాండ్ గా పెళ్లి చేస్తా… రాజ్ తరుణ్ కి లావణ్య తండ్రి ఆఫర్, కేసులో కొత్త మలుపు

10 ఏళ్లకు పైగా సహజీవనం చేశామంటున్న లావణ్య రెండు సార్లు అబార్షన్ జరిగిందని ఆరోపిస్తున్నారు. రాజ్ తరుణ్ నన్ను గుడిలో పెళ్లి చేసుకున్నాడు. మాల్వి మల్హోత్రా పరిచయం తర్వాత నన్ను దూరం పెట్టడం స్టార్ట్ చేశాడు. ప్రస్తుతం మాల్వి మల్హోత్రా-రాజ్ తరుణ్ ఎఫైర్ లో ఉన్నారు. నన్ను వదిలించుకోవాలని చూస్తున్నాడు. నా మీద డ్రగ్స్, ఎఫైర్ ఆరోపణలు చేస్తున్నాడు. ఇల్లు, డబ్బులు ఇస్తా వదిలేయ్ అన్నాడు. కుదరదంటే.. చంపేస్తా అని బెదిరించాడు అంటూ లావణ్య కీలక వ్యాఖ్యలు చేసింది.

Written By:
  • S Reddy
  • , Updated On : July 13, 2024 / 02:46 PM IST

    Raj Tarun

    Follow us on

    Raj Tarun: రాజ్ తరుణ్ నాకు కావాలంటూ లావణ్య పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. వారం రోజుల్లో రాజ్ తరుణ్-లావణ్యల వివాదం టాలీవుడ్ ని షేక్ చేస్తుంది. లావణ్య తన మాజీ ప్రియుడు రాజ్ తరుణ్ మీద అనేక ఆరోపణలు చేసింది. 2008లో సోషల్ మీడియాలో మొదలైన పరిచయం ప్రేమకు దారి తీసింది. రాజ్ తరుణ్ షార్ట్ ఫిలిమ్స్ లో నటించే నాటి నుండి నాకు తెలుసు. మొదట్లో స్నేహంగా మొదలైన రిలేషన్ అది ప్రేమకు దారి తీసింది. అప్పట్లో పెళ్లి చేసుకుందాం అని నా వెనుక పడేవాడు. అతని ప్రేమను నేను అంగీకరించాను అని లావణ్య అంటున్నారు.

    10 ఏళ్లకు పైగా సహజీవనం చేశామంటున్న లావణ్య రెండు సార్లు అబార్షన్ జరిగిందని ఆరోపిస్తున్నారు. రాజ్ తరుణ్ నన్ను గుడిలో పెళ్లి చేసుకున్నాడు. మాల్వి మల్హోత్రా పరిచయం తర్వాత నన్ను దూరం పెట్టడం స్టార్ట్ చేశాడు. ప్రస్తుతం మాల్వి మల్హోత్రా-రాజ్ తరుణ్ ఎఫైర్ లో ఉన్నారు. నన్ను వదిలించుకోవాలని చూస్తున్నాడు. నా మీద డ్రగ్స్, ఎఫైర్ ఆరోపణలు చేస్తున్నాడు. ఇల్లు, డబ్బులు ఇస్తా వదిలేయ్ అన్నాడు. కుదరదంటే.. చంపేస్తా అని బెదిరించాడు అంటూ లావణ్య కీలక వ్యాఖ్యలు చేసింది.

    తాజాగా లావణ్య పేరెంట్స్ మీడియా ముందుకు వచ్చారు. ఓ ప్రముఖ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కొత్త విషయాలు బయటపెట్టారు. రాజ్ తరుణ్-లావణ్యల రిలేషన్ సంగతి తమకు తెలుసని అన్నారు. రాజ్ తరుణ్ రహస్యంగా లావణ్యను గుడిలో పెళ్లి చేసుకున్న విషయం నిజమే. సహజీవనం చేస్తున్నారని, అబార్షన్ జరిగిందని కూడా తెలుసు. కానీ ఆడపిల్ల పిల్ల జీవితాన్ని బయటపెట్టలేము. చెప్పుకోలేము.

    రాజ్ తరుణ్ తల్లిదండ్రులను మేము చాలా సన్నిహితంగా ఉండేవాళ్ళం. రాజ్ తరుణ్ వస్తూ పోతూ ఉండేవాడు. మేము తరచుగా ఫోన్ చేసేవాళ్ళం. మూడు నెలల నుండి రాజ్ తరుణ్ పేరెంట్స్ ఫోన్ నెంబర్ కూడా పని చేయడం లేదు. రాజ్ తరుణ్ వలె ఆయన పేరెంట్స్ కూడా మాట్లాడటం మానేశారు. రాజ్ తరుణ్ తిరిగి వస్తే ఘనంగా పెళ్లి చేస్తాము. లేదంటే న్యాయం జరిగే వరకు పోరాడుతాము.

    మా అమ్మాయికి డ్రగ్స్ అలవాటు లేదు. నా కూతురు గురించి నాకు తెలియదా? ఈ ఆరోపణలు చేసిన వారి మీద కోపం వస్తుంది. కరోనా టైం లో రాజ్ తరుణ్ కి ఆర్థిక సహాయం కూడా చేశాము. లావణ్యకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయట. లావణ్యకు ఏమైనా జరిగితే మేము కూడా బ్రతికి ఉండము… అంటూ లావణ్య తండ్రి ఎమోషనల్ అయ్యాడు.

    మరోవైపు లావణ్య ఆరోపణలు రాజ్ తరుణ్ ఖండిస్తున్న సంగతి తెలిసిందే. మేము రిలేషన్ షిప్ లో ఉన్న విషయం నిజమే. కానీ ఎలాంటి శారీరక సంబంధం లేదు. లావణ్యను నేను పెళ్లి చేసుకున్నాను అన్నది పచ్చి అబద్ధం. లావణ్య మొదట్లో మంచి అమ్మాయి. తర్వాత స్నేహాల వలన డ్రగ్స్ కి అలవాటు పడింది. డ్రగ్స్ తీసుకుని నాకు టార్చర్ చూపించింది. బ్లాక్ మెయిల్ చేసేది. మస్తాన్ సాయి అనే వ్యక్తితో లావణ్యకు ఎఫైర్ ఉందని రాజ్ తరుణ్ ఆరోపిస్తున్నాడు.

    రాజ్ తరుణ్ ఈ కేసును లీగల్ గా ఎదుర్కొంటాను అంటున్నారు. అయితే ఈ కేసులో రాజ్ తరుణ్ ఇరుక్కుంటున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఆయన ఇమేజ్ భారీగా డామేజ్ అవుతుంది. మరికొద్ది రోజుల్లో రాజ్ తరుణ్ కొత్త సినిమా తిరగబడర సామీ విడుదల కానుంది. ఈ మూవీ హీరోయిన్ తోనే రాజ్ తరుణ్ ఎఫైర్ రూమర్స్ ఎదుర్కొంటున్నాడు.