https://oktelugu.com/

Soggade Chinni Nayana: నాగార్జున చేసిన సోగ్గాడే చిన్ని నాయన సినిమాను మిస్ చేసుకున్న హీరో ఎవరో తెలుసా..?

ఎంటైర్ కెరియర్ లో ఒక అన్నమయ్య , శ్రీరామదాసు, షిరిడి సాయిబాబా, ఓం నమో వెంకటేశాయా లాంటి గొప్ప సినిమాల్లో నటించాడు. ఇక తనను తాను స్టార్ హీరోగా ఎస్టాబ్లిష్ చేసుకునే ప్రయత్నంలో భాగంగా కమర్షియల్ సినిమాల్లో కూడా నటించడమే కాకుండా తనకంటూ ఒక భారీ ఇమేజ్ ను కూడా క్రియేట్ చేసుకున్నాడు. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం ఆయన తన 100 వ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు.

Written By:
  • Gopi
  • , Updated On : July 13, 2024 / 03:06 PM IST

    Soggade Chinni Nayana

    Follow us on

    Soggade Chinni Nayana: తెలుగు సినిమా ఇండస్ట్రీలో యువ సామ్రాట్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న హీరో నాగార్జున…ఆయన వరుస సినిమాలు చేసి స్టార్ ఇమేజ్ ను సంపాదించుకున్నాడు. ఇక ఒకప్పుడు వాళ్ళ నాన్న నాగేశ్వరరావు అండతో సినిమా ఇండస్ట్రీ లోకి ప్రవేశించిన ఆయన అప్పటినుంచి ఇప్పటివరకు తన ఓన్ టాలెంట్ తో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నాడు. నిజానికి ఆయన చేసే ప్రతి పాత్ర కూడా చాలా ప్రాధాన్యతను సంపాదించుకొని ఉంటుంది.

    అందుకే ఆయన ఎంటైర్ కెరియర్ లో ఒక అన్నమయ్య , శ్రీరామదాసు, షిరిడి సాయిబాబా, ఓం నమో వెంకటేశాయా లాంటి గొప్ప సినిమాల్లో నటించాడు. ఇక తనను తాను స్టార్ హీరోగా ఎస్టాబ్లిష్ చేసుకునే ప్రయత్నంలో భాగంగా కమర్షియల్ సినిమాల్లో కూడా నటించడమే కాకుండా తనకంటూ ఒక భారీ ఇమేజ్ ను కూడా క్రియేట్ చేసుకున్నాడు. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం ఆయన తన 100 వ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ఇక దాంతో పాటుగా శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో చేస్తున్న ‘కుబేర ‘ సినిమా మీద కూడా ఆయన ఎక్కువగా ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తుంది. మరి మొత్తానికైతే ఆయన సాధించిన సక్సెసలన్నీ ఒకేత్తు అయితే ఇప్పుడు చేయబోయే సినిమాలు కూడా మరొక ఎత్తుగా మారబోతున్నట్టుగా తెలుస్తుంది.

    ఇక ఆయన ఎంటైర్ కెరియర్ లో 100వ సినిమా ఒక భారీ సక్సెస్ అందుకొని ఒక మైలురాయిగా నిలిచిపోవాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి దానికి అనుగుణంగానే మంచి కథలను వింటూ ఆయన ముందుకు సాగుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇక ఇదిలా ఉంటే కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నాగార్జున చేసిన ‘సోగ్గాడే చిన్ని నాయన’ సినిమా సూపర్ సక్సెస్ సాధించింది. ఇక ఈ సినిమాతో మొదటిసారిగా నాగార్జున 50 కోట్ల క్లబ్ లో చేరాడు. అయితే ఈ సినిమా మొదట వేరే హీరోతో చేయాలని అనుకున్నారట. కానీ అనుకోని కారణాల వల్ల అది నాగార్జున దగ్గరికి వచ్చింది. నిజానికి ఈ సినిమాని మొదట తమిళ్ హీరో అయిన కమలహాసన్ తో చేయాలని ప్రణాళికలు రూపొందించారట.

    ఇక అప్పుడు ఈ కథ కూడా కొంచెం డిఫరెంట్ గా ఉండేది. కానీ నాగార్జున దగ్గరికి వచ్చిన తర్వాత కథని మొత్తం చేంజ్ చేసి దాని స్క్రీన్ ప్లే కూడా మార్చినట్టుగా చెబుతున్నారు. నిజానికి ఈ సినిమాలో కమలహాసన్ కంటే నాగార్జుననే బాగా సెట్ అయ్యాడు. ఆయన మాత్రమే ఇలాంటి సబ్జెక్టులను చాలా బాగా డీల్ చేయగలరనే విషయం మనందరికీ తెలిసిందే. మరి నాగార్జున ఈ సినిమాను కొత్త దర్శకుడితో చేసి భారీ సక్సెస్ ని అందుకున్నాడు. ఇక దాంతో పాటుగా నాగార్జునను మరోసారి స్టార్ హీరోగా నిలబెట్టింది. ఇక ఇలాంటి పరిస్థితుల్లో ఈ సినిమా కి సీక్వెల్ గా ‘బంగార్రాజు ‘ అనే సినిమా కూడా వచ్చింది. అయితే ఈ సినిమా కూడా మంచి విజయాన్ని సాధించింది.

    ఇక ఇదిలా ఉంటే కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్ లో నాగార్జున మరొక సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి అది ‘సోగ్గాడే చిన్నినాయన’ సినిమాకి మళ్ళీ సీక్వెల్ గా వస్తుందా లేదంటే కొత్త కథతో వస్తుందా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉన్నాయి… ప్రస్తుతానికి నాగార్జునకైతే అర్జెంటుగా ఒక హిట్ కావాలి. దాని కోసం ఆయన తీవ్రమైన ప్రయత్నాలు కూడా చేస్తున్నాడు…చూడాలి మరి తను చేయబోయే కుబేర, అలాగే తన 100 వ సినిమాతో సక్సెస్ వస్తుందా లేదా అనేది…