Homeఎంటర్టైన్మెంట్Vijay Deverakonda Rashmika Wedding Food Viral: విజయ్ దేవరకొండ , రష్మిక పెళ్ళిలో పంది...

Vijay Deverakonda Rashmika Wedding Food Viral: విజయ్ దేవరకొండ , రష్మిక పెళ్ళిలో పంది కూర..వైరల్ అవుతున్న ఫోటోలు!

Vijay Deverakonda Rashmika Wedding Food Viral: 8 ఏళ్ళ సుదీర్ఘ ప్రేమ బంధాన్ని నేడు విజయ్ దేవరకొండ(Vijay Devarakonda ), రష్మిక(Rashmika Mandanna) జంటలు శాశ్వత వివాహ బంధం గా మార్చుకున్నారు. వీళ్ళ పెళ్లి నేడు ఉదయం 10:10 నిమిషాలకు జరిగినట్టు తెలుస్తోంది. ఈ వివాహానికి ఈ జంటకు బాగా దగ్గరైన మిత్రులు , సన్నిహితులు , కుటుంబ సభ్యులు హాజరయ్యారు . మన సినీ పరిశ్రమ నుండి సందీప్ రెడ్డి వంగ, అల్లు అర్జున్ వంటి వారు హాజరు అయ్యినట్టు తెలుస్తోంది. వీళ్ళ పెళ్ళికి సంబంధించిన ఫోటోల కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు . విజయ్ దేవరకొండ తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా పెళ్లి పీటల ఫోటోలను తన స్టోరీ లో అప్లోడ్ చేసాడు . మరో పక్క రష్మిక కూడా కొన్ని ఫోటోలను స్టోరీ లో అప్లోడ్ చేస్తూ ఉంది. కానీ ముఖ్యమైన ఫోటోలను మాత్రం ఇంకా బయటకు వదల్లేదు .

అయితే ఈ పెళ్లిలో స్పెషల్స్ మాత్రం సోషల్ మీడియా లో లీక్ అయ్యి బాగా వైరల్ అవుతున్నాయి . శాఖాహారులు , మాంసాహారులకు కావాల్సినన్ని ఐటమ్స్ ని ఏర్పాటు చేశారు. హైదరాబాదీ ధమ్ బిర్యాని , తెలంగాణ స్టైల్ మటన్ బిర్యానీ , నాటు కోడి పులుసు, ఓల్డ్ సిటీ కీమా సమోసాలు ఇలా ఎన్నో రకాల నాన్ వెజ్ ఐటమ్స్ ఈ పెళ్ళిలో ఏర్పాటు చేశారట. చాలా మంది పండి మాంసం కూడా ఇష్టపడి తినేవాళ్లు ఉన్న సంగతి తెలిసిందే , వాళ్ళ కోసం పోర్క్ కర్రీ ని కూడా ఏర్పాటు చేశారట . దానికి సంబంధించిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. అంతే కాదు పోర్క్ అంటే రష్మిక కి కూడా చాలా ఇష్టమట . గతంలో ఒక ఇంటర్వ్యూ లో ఆమె మాట్లాడుతూ తనకు కొడగు సంప్రదాయమైన పండి కూర తినడమంటే మహాఇష్టం అంటూ మాట్లాడిన మాటలు అప్పట్లో బాగా వైరల్ అయ్యాయి.

Also Read: మార్చి 4 వ తేదీన విజయ్ – రష్మిక రిసెప్షన్ కి వచ్చే స్పెషల్ గెస్ట్ ఎవరంటే..?

ఇక శాఖాహారుల కోసం గారెలు , పప్పు , పచ్చిపులుసు , సాంబార్, రసం , ఇలా ఎన్నో రకాల వంటకాలు ఏర్పాటు చేశారట . వింటుంటేనే నోరు ఊరిపోతోంది కదూ, ఇండియా లోనే మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ పెళ్లి అంటే ఆ మాత్రం ఉంటుంది మరీ. ఇకపోతే వీళ్లిద్దరి వెడ్డింగ్ రిసెప్షన్ వచ్చే నెల 4వ తేదీన హైదరాబాద్ లోని తాజ్ బంజారా హోటల్ లో గ్రాండ్ గా జరగనుంది. ఈ రిసెప్షన్ కి టాలీవుడ్ సినీ ప్రముఖులు , రాజకీయ నాయకులూ , వ్యాపార వేత్తలు, ఇలా అన్ని రంగాలకు చెందిన వారు హాజరు కాబోతున్నారు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version