Babar Azam: క్రికెట్ పరిభాష గురించి.. క్రికెట్ చూసే వారి కంటే.. క్రికెట్ ఆడేవారికి ఎక్కువ తెలిసి ఉండాలి. లేకుంటే పరువు పోతుంది. సరిగ్గా ఇలాంటి పరిస్థితినే పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజాం ఎదుర్కొంటున్నాడు. అతడు ట్విట్టర్ ఎక్స్ లో చేసిన ఒక ట్వీట్ పరువు మొత్తం తీసింది. అంతేకాదు పదిమందిలో నవ్వుల పాలు చేసింది. ఇంతకీ ఏం జరిగిందంటే.
ఇంగ్లాండ్ లెజెండరీ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ అండర్సన్ టెస్ట్ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. 188 టెస్ట్ మ్యాచ్ లు ఆడిన అండర్సన్.. 704 వికెట్లు పడగొట్టాడు. తన సుదీర్ఘ కెరియర్ కు వెస్టిండీస్ జట్టుతో ఆడిన మ్యాచ్ ద్వారా టెస్ట్ క్రికెట్ కు గుడ్ బై చెప్పేశాడు.. వెస్టిండీస్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో ఇంగ్లాండ్ 114 పరుగుల తేడాతో గెలిచింది. అయితే టెస్ట్ క్రికెట్ కు అండర్సన్ వీడ్కోలు పలకడంతో.. మిగతా జట్ల క్రికెటర్లు సోషల్ మీడియా వేదికగా అండర్సన్ గొప్పతనాన్ని కొనియాడారు. ఇందులో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజాం కూడా ఉన్నాడు. అయితే అతడు అండర్సన్ ను ఉద్దేశించి ట్విట్టర్ ఎక్స్ లో చేసిన ఒక పోస్ట్ నవ్వుల పాలు చేసింది. చివరికి తాను చేసిన తప్పిదాన్ని గుర్తించి.. సవరించాడు. అయినప్పటికీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
It was a privilege to face your swing, Jimmy!
The beautiful game will now miss one of its greatest. Your incredible service to the sport has been nothing short of remarkable. Huge respect for you, GOAT pic.twitter.com/fE2NMz4Iey
— Babar Azam (@babarazam258) July 12, 2024
” జిమ్మీ.. మీరు క్రికెట్ కు ఎనలేని సేవలు చేశారు. ఆ ఆట ఇప్పుడు తన అందాన్ని కోల్పోతుంది.. మీ కట్టర్ లను ఎదుర్కోవడం ఒక అదృష్టం..మీరు క్రికెట్ చరిత్రలో గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం” అంటూ బాబర్ అజాం ట్వీట్ చేశాడు.. బాబర్ ఈ ట్వీట్ చేసిన నేపథ్యంలో నెటిజన్లు వెంటనే స్పందించారు. “అండర్సన్ నీకు అరుదుగా కట్టర్లు బౌలింగ్ చేశాడని” సోషల్ మీడియా వేదికగా అభిమానులు ఎత్తిచూపడంతో బాబర్ అజాం నాలుక కరుచుకున్నాడు. వెంటనే తాను చేసిన ట్వీట్ లో కట్టర్ స్థానంలో స్వింగ్ అనే పదాన్ని జత చేశాడు. “మీ స్వింగ్ ఎదుర్కోవడం ఒక విశేషం జిమ్మీ. అందమైన టెస్ట్ క్రికెట్ ఇప్పుడు దాని గొప్పతనాన్ని కోల్పోతుంది. క్రికెట్ క్రీడకు మీరు చేసిన అపురూపమైన సేవ అద్భుతమైనది. మీ పట్ల అపారమైన గౌరవం ఉంది. క్రికెట్ క్రీడలో మీరు గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం అంటూ” అండర్సన్ ను కీర్తిస్తూ అజాం ట్వీట్ ను సవరించాడు.
బాబర్ ఈ ట్వీట్ ను సవరించినప్పటికీ అప్పటికే అది సోషల్ మీడియాలో తెగ సర్కులేట్ అయింది. దీంతో నెటిజన్లు బాబర్ అజాం ను ఒక ఆట ఆడుకోవడం మొదలుపెట్టారు. “పాకిస్తాన్ క్రికెట్ కు అతిపెద్ద బ్రాండ్ అంబాసిడర్ అయిన ఆటగాడికి కట్టర్, స్వింగ్ కు తేడా తెలియడం లేదు. ఇంతకు మించి నవ్వొచ్చే విషయం మరొకటి ఉంటుందా అంటూ” ఓ నెటిజన్ వ్యాఖ్యానించాడు.
Cutters pic.twitter.com/GcasN7NZul
— Raja Babu (@GaurangBhardwa1) July 12, 2024
” బాబర్ అజాం గారు జేమ్స్ అండర్సన్ కట్టర్స్ వెయ్యరు. ఆయన కేవలం స్వింగ్ బౌలింగ్ మాత్రమే చేస్తారు. ఇది మీరు గుర్తుంచుకోవాలి” అంటూ మరో నెటిజన్ కామెంట్ చేశాడు..
“మీకు స్వింగ్ కు కట్టర్ కు తేడా తెలియడం లేదు. దయచేసి మీ వ్యక్తిగత వ్యవహారాలు చూసేందుకు, ముఖ్యంగా మీ సోషల్ మీడియా పోస్టులు పర్యవేక్షించేందుకు ఒక మంచి మేనేజర్ ను నియమించుకోండి అంటూ” ఓ నెటిజన్ చురకలాంటించాడు.
Why you deleted this Babar Azam pic.twitter.com/C43XbTkCjm
— Satya Prakash (@_SatyaPrakash08) July 12, 2024
కాగా, వెస్టిండీస్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో అండర్సన్ ఏకంగా నాలుగు వికెట్లు పడగొట్టాడు. మొత్తంగా 704 వికెట్లు పడగొట్టి.. తన టెస్ట్ కెరియర్ ముగించాడు. ఆస్ట్రేలియా దివంగత లెజెండరీ స్పిన్నర్ షేన్ వార్న్ 708 వికెట్లు పడగొట్టి టెస్ట్ క్రికెట్ హిస్టరీలో.. అత్యధిక వికెట్లు సాధించిన రెండవ బౌలర్ గా కొనసాగుతున్నాడు. అతని కంటే ముందు శ్రీలంక లెజెండరీ బౌలర్ ముత్తయ్య మురళీధరన్ ఉన్నాడు.