Homeఎంటర్టైన్మెంట్Vijay Rashmika Wedding Reception: మార్చి 4 వ తేదీన విజయ్ - రష్మిక రిసెప్షన్...

Vijay Rashmika Wedding Reception: మార్చి 4 వ తేదీన విజయ్ – రష్మిక రిసెప్షన్ కి వచ్చే స్పెషల్ గెస్ట్ ఎవరంటే..?

Vijay Rashmika Wedding Reception: సినిమా ఇండస్ట్రీలో టాలెంట్ ఉన్న వాళ్ళు మాత్రమే టాప్ పొజిషన్ కి చేరుకుంటారు. లక్షల మంది సినిమా హీరోలవ్వాలనే ప్రయత్నం చేసిన కూడా పని పట్ల నిబద్ధత అవకాశం కోసం ఎదురు చూసే ఓపిక లేని వాళ్ళు ఇండస్ట్రీ రాణించడం చాలా కష్టం… ఇక్కడ ఎవ్వరికి ఎప్పుడు ఏ అవకాశం వస్తుందో చెప్పడం ఎవరి వల్ల కాదు… అందుకే వచ్చిన ప్రతి అవకాశాన్ని వాడుకుంటూ ముందుకు సాగాలి. ప్రస్తుతం విజయ్ దేవరకొండ లాంటి నటుడు టాప్ హీరోగా వెలుగొందుతున్నాడు అంటే కెరియర్ స్టార్టింగ్ లో ఆయన ఎన్నో స్ట్రగుల్స్ ని ఎదుర్కొన్నాడు. తనకు దొరికిన ప్రతి పాత్రలో నటించి నటుడిగా తనను తాను ఎస్టాబ్లిష్ చేసుకోవాలనే ప్రయత్నం చేశాడు. వాటన్నింటిలో తను సక్సెస్ అయ్యాడు. కాబట్టే పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి, గీతా గోవిందం లాంటి సినిమాలతో వరుసగా మూడు బ్లాక్ బాస్టర్ సక్సెస్ లను అందుకున్నాడు…

Also Read: లోకేష్ తలచుకుంటే అంతే!

ఆయన చేసిన సినిమాలు ఆయనకు గొప్ప గుర్తింపును ఇవ్వడమే కాకుండా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక డిఫరెంట్ నటుడిగా తనకు ఒక ఐడెంటిటి కూడా తీసుకొచ్చి పెట్టింది. ఇక ఇలాంటి క్రమంలోనే తను రష్మిక మందానని ప్రేమించాడు. రష్మిక కూడా విజయ్ ని అమితంగా ప్రేమించడంతో వీళ్ళు ఎక్కడా కూడా ప్రేమ విషయాన్ని బయటికి చెప్పలేదు.

కానీ ఎట్టకేలకు ఈరోజు పెళ్లి చేసుకొని ఇద్దరు ఒకటవబోతున్నారు. ఇక మార్చి 4వ తేదీన హైదరాబాద్ లో వీళ్ళ రిసెప్షన్ చాలా గ్రాండ్ గా నిర్వహించే ప్రయత్నాలైతే జరుగుతున్నాయి. దీనికి రెండు రాష్ట్రాల సీఎంలతో పాటు చాలామంది సినిమా రాజకీయ సెలబ్రిటీలు సైతం హాజరబోతుండడం విశేషం… రిసెప్షన్ కి ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవిని ఆహ్వానిస్తున్నారట. ఇక చిరంజీవి సైతం ఈ రిసెప్షన్ కి వచ్చి నూతన వదూవరులను ఆశీర్వదించబోతున్నట్టుగా తెలుస్తుంది…

చిరంజీవికి విజయ్ దేవరకొండ కి మధ్య చాలా మంచి సన్నిహిత సంబంధాలైతే ఉన్నాయన్న విషయం చాలా సందర్భాల్లో ప్రూవ్ అయింది. ఎందుకంటే ఒకే వేదిక మీద చిరంజీవి, విజయ్ దేవరకొండ ఇద్దరు కలిసి మాట్లాడటం ఒకరి పర్సనల్స్ మరొకరు షేర్ చేసుకోవడం తెలుగు ప్రేక్షకులందరు చూశారు..కాబట్టి విజయ్- రష్మిక ల రిసెప్షన్ కి తను కచ్చితంగా హాజరవుతానని చిరంజీవి హామీ ఇచ్చినట్టుగా తెలుస్తుంది…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version