Sourav Ganguly : సౌరవ్ గంగూలీ, యువరాజ్ సింగ్, మహమ్మద్ కైఫ్, జహీర్ ఖాన్.. వంటి మేటి ఆటగాళ్లు ఉన్నప్పటికీ టీమిండియా వరుసగా 9 వన్డే సిరీస్ లలో ఫైనల్ వెళ్లినప్పటికీ.. చివరి మ్యాచ్ లలో ఓడిపోయింది. దీంతో జట్టు ఆట తీరుపై తీవ్ర విమర్శలు వినిపించాయి. ఈ క్రమంలో టీమిండియా గంగూలీ ఆధ్వర్యంలో ఇంగ్లాండ్ జట్టుతో నాట్ వెస్ట్ టోర్నీ ఆడేందుకు వెళ్ళింది. ఫైనల్ మ్యాచ్ లో భారత జట్టు ఇంగ్లాండ్ పై ఉత్కంఠ విజయం సాధించింది. దీంతో కెప్టెన్ సౌరవ్ గంగూలీ తన జెర్సీ విప్పి లార్డ్స్ మైదానం బాల్కనీలో అటు ఇటు తిప్పుతూ రచ్చ రచ్చ చేశాడు. ఆ రోజుల్లో ఇది భారత జట్టు విజయ గర్వానికి దర్పణంగా నిలిచింది. సరిగ్గా 1983 వరల్డ్ కప్ లో భాగంగా బలవంతమైన వెస్టిండీస్ జట్టుతో లండన్ వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్ లో కపిల్ దేవ్ ఆధ్వర్యంలో టీమిండియా విజయం సాధించింది. ఆ సమయంలో కపిల్ దేవ్, ఇతర టీమ్ ఇండియా ఆటగాళ్లు లార్డ్స్ మైదానంలో సంబరాలు జరుపుకున్నారు. నాట్ వెస్ట్ టోర్నీ లో ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో విజయం సాధించడంతో సౌరవ్ గంగూలీ నిర్వహించిన ఆనందోత్సవ వేడుక.. నాటి కపిల్ దేవ్ సాగించిన సంబరాన్ని గుర్తు చేసింది.
ప్రస్తుత జూలై 13 తో నాటి నాట్ వెస్ట్ టోర్నీ విజయానికి 22 సంవత్సరాలు నిండాయి. నాట్ వెస్ట్ ఫైనల్ మ్యాచ్ కంటే ముందు భారత జట్టు దాదాపు వరుసగా తొమ్మిది వన్డే ఫైనల్స్ లో ఓడిపోయింది. ఇక నాట్ వెస్ట్ టోర్నీ లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు 5 వికెట్ల నష్టానికి 325 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ ఆటగాళ్లలో మార్కస్ ట్రెస్కో థిక్(109), నాసర్ హుస్సేన్(115) రెండో వికెట్ కు ఏకంగా 155 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు..
ఇంగ్లాండ్ విధించిన 325 పరుగుల విజయ లక్ష్యాన్ని చేదించే క్రమంలో భారత ఓపెనర్లు సౌరవ్ గంగూలీ (60), వీరేంద్ర సెహ్వాగ్ (45) తొలి వికెట్ కు 106 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఆ తర్వాత వీరిద్దరూ అవుట్ కావడంతో.. భారత్ మిగతా వికెట్లను త్వరత్వరగా కోల్పోయింది. ఒకానొక దశలో ఐదు వికెట్ల నష్టానికి 146 పరుగుల వద్ద నిలిచింది. ఈ దశలో మహమ్మద్ కైఫ్, యువరాజ్ సింగ్ ఇంగ్లాండ్ బౌలర్లను ధాటిగా ఎదుర్కొన్నారు. దూకుడైన బ్యాటింగ్ తో ఆకట్టుకున్నారు. వీరిద్దరూ ఆరో వికెట్ కు ఏకంగా 121 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వీరిద్దరి జోడి భారత జట్టును గెలుపు తీరాలకు చేర్చింది. అయితే యువరాజ్ సింగ్ ఔట్ అయినప్పటికీ.. మహమ్మద్ కైఫ్ జహీర్ ఖాన్ (4*) తో కలిసి భారత జట్టును గెలిపించాడు. ఈ మ్యాచ్లో కైఫ్ 87 పరుగులు చేయగా.. యువరాజ్ సింగ్ 69 పరుగులతో ఆకట్టుకున్నాడు.. చివరి ఓవర్ లో చాకచక్యంగా టుడీ తీయడం ద్వారా భారత జట్టును మహమ్మద్ కైఫ్ గెలిపించాడు. టీమిండియా గెలవడంతో కెప్టెన్ గంగూలి మైదానంలోకి పరిగెత్తుకొచ్చేకంటే ముందు తాను వేసుకున్న జెర్సీని విప్పాడు. లార్డ్స్ మైదానంలో బాల్కనీలో నిలుచుని అటూ ఇటూ తిప్పాడు.. భారతదేశ క్రికెట్ చరిత్రలో నాట్ వెస్ట్ టోర్నీ ఫైనల్ విజయం చిరస్థాయిగా నిలిచిపోతుంది.
The series that changed Indian Cricket for good
| Relive the famous #NatWestSeries victory where #TeamIndia scripted history by beating on their home turf & Dada celebrated for generations to remember #SonySportsNetwork #ENGvIND | @SGanguly99 pic.twitter.com/QJ7ZqnwWXU
— Sony Sports Network (@SonySportsNetwk) July 13, 2023