https://oktelugu.com/

Sai Dharam Tej: పవన్ కళ్యాణ్ గెలిచాక సాయి ధరమ్ తేజ్ ఏం చేశాడో తెలుసా.. వైరల్ వీడియో…

సాయిధరమ్ తేజ్ ప్రేమ అభిమానాన్ని చూసిన పవన్ కళ్యాణ్ కూడా చాలా సంబరపడిపోయాడు. ఇక మొత్తానికైతే పవన్ కళ్యాణ్ ఏ ఎజెండాతో అయితే ముందుకు సాగాడో దాన్ని శిరసావహిస్తూ సక్సెస్ ఫుల్ గా జగన్ ఓటమికి కారణమయ్యాడు.

Written By:
  • Dharma
  • , Updated On : June 5, 2024 / 08:09 AM IST

    Sai Dharam Tej

    Follow us on

    Sai Dharam Tej: శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ అనే పేరు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఒక బ్రాండ్ గా మారిపోయింది. ఒకప్పుడు ఆయన ఏపీ రాజకీయ రంగంలోకి అడుగు పెట్టిన క్షణంలో తను రాజకీయానికి పనిచేయాడు అంటూ చాలా విమర్శలైతే ఎదుర్కొన్నాడు. ఇక అయినప్పటికీ ఆ విమర్శలని ఎదిరిస్తూ అతి తక్కువ సమయంలోనే ఒక రాజకీయ వ్యూహాన్ని రచించగల నాలెడ్జ్ ని సంపాదించాడు.

    ఇక ఎలాంటి పరిస్థితుల్లో అయితే తను ఓడిపోయి ఒంటరి వాడిగా మిగిలిపోయి, క్లిష్ట పరిస్థితులను ఎదిరించి పిఠాపురం నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో 70 వేలకి పైన ఓట్ల మెజారిటీ తో విజయం సాధించడం అనేది మామూలు విషయం కాదు. ప్రస్తుతం ఏపీ ఎలక్షన్స్ లో తను గేమ్ చేంజర్ గా మారాడు. ఇక సీఎం చంద్రబాబు నాయుడు అయినప్పటికీ పవన్ కళ్యాణ్ మాత్రం వైయస్ జగన్మోహన్ రెడ్డిని గద్దే దింపడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు కదిలాడు.

    ఇక ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ గెలుపుని చాలామంది అభిమానులు, అలాగే జనసేన పార్టీ కార్యకర్తలతో పాటు ఈ పార్టీకి ఓటు వేసిన ప్రతి ఒక్కరు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇక ఇదిలా ఉంటే స్టార్ సెలెబ్రిటీలు కూడా పవన్ కళ్యాణ్ కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ఇక ఇలాంటి క్రమం లోనే ఎమ్మెల్యేగా గెలిచిన పవన్ కళ్యాణ్ ఇంటికి వచ్చాక ఆయన మేనల్లుడు అయిన సాయి ధరమ్ తేజ్ మామయ్య అయిన పవన్ కళ్యాణ్ కనిపించగానే హగ్ చేసుకొని తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూనే పవన్ కళ్యాణ్ ని గాల్లోకి ఎత్తాడు.

    ఇక సాయిధరమ్ తేజ్ ప్రేమ అభిమానాన్ని చూసిన పవన్ కళ్యాణ్ కూడా చాలా సంబరపడిపోయాడు. ఇక మొత్తానికైతే పవన్ కళ్యాణ్ ఏ ఎజెండాతో అయితే ముందుకు సాగాడో దాన్ని శిరసావహిస్తూ సక్సెస్ ఫుల్ గా జగన్ ఓటమికి కారణమయ్యాడు…ఇక మొత్తానికైతే పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగు పెట్టడానికి రెడీగా ఉన్నాడు. మరి పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో ఎలాంటి పాత్ర పోషిస్తాడు అనేది కూడా తెలియాల్సి ఉంది……