https://oktelugu.com/

Trisha: సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన తర్వాత ఈ టాప్ హీరోయిన్ ఎవరిని పెళ్లి చేసుకోబోతోందంటే?

ప్రొషెషనల్ లైఫ్ కు సంబంధించింది కాదండోయ్. పర్సనల్ లైఫ్ కు చెందిందట. మీకు ఇప్పటికే మ్యాటర్ అర్థమై పోయింది అనుకుంట. ఈ బ్యూటీ ఇప్పుడు పెళ్లి కూతురు కాబోతుందట.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : June 5, 2024 / 08:32 AM IST

    Trisha

    Follow us on

    Trisha: చెన్నై బ్యూటీ త్రిష గురించి ఎంత చెప్పినా తక్కువ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలోనే టాప్ ప్లేస్ ను సంపాదించుకొని అప్పటి స్టార్ హీరోల సరసన నటించింది. అయితే ఇప్పుటికీ ఈ బ్యూటీ పెళ్లి మాత్రం చేసుకోలేదు. దీంతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన త్రిష గుడ్‌ న్యూస్‌ చెప్పబోతున్నారు అంటూ టాక్ వస్తుంది. కోలీవుడ్‌లో ఇదే హాట్‌ డిస్కషన్‌ గా మారింది. చెన్నై సుందరి సెకండ్‌ ఇన్నింగ్స్ మొదలుపెట్టినప్పటి నుంచీ ఏదో ఒక గుడ్‌న్యూస్‌ చెబుతూనే ఉంది ప్రస్తుతం మరోసారి చెప్పడానికి ఏం ఉంది అనుకుంటున్నారా?

    ప్రొషెషనల్ లైఫ్ కు సంబంధించింది కాదండోయ్. పర్సనల్ లైఫ్ కు చెందిందట. మీకు ఇప్పటికే మ్యాటర్ అర్థమై పోయింది అనుకుంట. ఈ బ్యూటీ ఇప్పుడు పెళ్లి కూతురు కాబోతుందట. వరుడి గురించి ప్రస్తుతానికి సస్పెన్స్ లో ఉంచి.. 2024లోనే ఇల్లాలు కావాలనుకుంటుందట. ఎప్పుడు వార్తలు రావడమే అమ్మడు పెళ్లి చేసుకోవడం ఏమైనా ఉందా అనుకుంటున్నారా? మరి ఈ విషయాన్ని త్రిష కన్‌ఫర్మ్ చేశారా లేదా? అనేదేగా మీ డౌట్‌. అసలు డౌట్లేమీ పడాల్సిన అవసరం లేదండోయ్ బాబు.

    గుండె కాస్త ధైర్యంగా ఉంచండి. ఎందుకంటే ఇప్పుడప్పుడే నేను పెళ్లి చేసుకోవడం లేదు.. అని క్లారిటీ ఇచ్చేసింది అమ్మడు. ఇప్పటికే తనకు చాలా సార్లు పెళ్లి చేసేశారని. సొసైటీలో నా పెళ్లి కన్నా ముఖ్యమైన వార్తలు చాలా ఉన్నాయి అని అంటుంది త్రిష. అయినా, పెళ్లికి ఇప్పుడప్పుడే తొందరేం వచ్చిందని..తను ఇప్పుడు చాలా హ్యాపీగా ఉందని.. ఇలా ఉండటం వల్ల ఎవరికి నష్టం? నన్ను ఇలా ఉండనివ్వండి అంటూ తేల్చి చెప్పింది త్రిష. పెళ్లి చేసుకునే రోజు వస్తే తప్పకుండా చెప్పే చేసుకుంటానని అంటుంది చెన్నై బ్యూటీ.

    ప్రస్తుతం త్రిష తెలుగు, తమిళ్‌, మలయాళ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇంకా టైమ్‌ ఉంటే, మరి కొన్ని సినిమాలకు సైన్ చేయడానికి కూడా సిద్ధంగా ఉందట. రీఎంట్రీలో తనదైన స్వాగ్‌తో ఆడియన్స్ ని మెస్మరైజ్‌ చేస్తూనే మరిన్ని సినిమాలతో ఎంటర్టైన్ చేయడానికి సిద్దంగా ఉందన్నమాట. కానీ పెళ్లి మాత్రం చేసుకోను అంటోంది.