Gold Price Today: బంగారం, వెండి ధరలు తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరిగాయి. వెండి ఏకంగా రూ.1300లకు పైగా పెరిగింది. దేశీయంగా బుధవారం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?
బులియన్ మార్కెట్ ప్రకారం.. జూన్ 5న ఓవరాల్ గా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,800గా నమోదైంది. 24 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు రూ.72,880 గా ఉంది. జూన్ 4న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.66,100తో విక్రయించారు. 10 గ్రాముల బంగారానికి మంగళవారంతో పోలిస్తే బుధవారం రూ.700 పెరిగింది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..
న్యూఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,960 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.73,030గా నమోదైంది.ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.66,800 కొనసాగుతోంది. 24 క్యారెట్లు రూ.72,880 పలుకుతోంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.67,460 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.73,590తో విక్రయిస్తున్నారు. బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.66,800 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.72,880తో విక్రయిస్తున్నారు. హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.66,800తో విక్రయిస్తున్నారు. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.72,880తో విక్రయిస్తున్నారు.
బంగారం ధరలతో పాటు వెండి ధరలు తగ్గుతున్నాయి. మంగళవారం ఓవరాల్ గా కిలో వెండి రూ.94,000గా నమోదైంది. మంగళవారంతో పోలిస్తే బుధవారం రూ.1300 మేర పెరిగింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం న్యూ ఢిల్లీలో కిలో వెండి రూ.94,000గా ఉంది. ముంబైలో రూ.94,000, చెన్నైలో రూ.98,600 బెంగుళూరులో 91,900, హైదరాబాద్ లో రూ. 98,600 తో విక్రయిస్తున్నారు.