https://oktelugu.com/

Dhanush And Rajinikanth: రజినీకాంత్ కోసం రంగం లోకి దిగుతున్న ధనుష్…ఇంతకీ వీళ్ళ మధ్య మాటలు ఉన్నాయా..?

తెలుగు, తమిళ్ రెండు సినిమా ఇండస్ట్రీ ల్లో కూడా రజినీకాంత్ కి చాలా మంచి గుర్తింపు ఉంది. ప్రస్తుతం ఆయన చాలా మంచి సినిమాలను చేసే పనిలో బిజీ గా ఉన్నట్టుగా తెలుస్తుంది...

Written By:
  • Gopi
  • , Updated On : July 31, 2024 / 09:42 AM IST

    Dhanush And Rajinikanth

    Follow us on

    Dhanush And Rajinikanth: తమిళ్ సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న నటుడు రజనీకాంత్…ఆయన ఎంటైర్ కెరియర్ లో ఎన్నో బ్లాక్ బాస్టర్ సక్సెస్ లను అందించిన ఆయన ప్రస్తుతం 70 సంవత్సరాల వయసులో కూడా హీరోగా సినిమాలను చేస్తూ సూపర్ సక్సెస్ లను అందుకుంటున్నాడు. ఇక గత సంవత్సరం వచ్చిన జైలర్ సినిమాతో దాదాపు 400 కోట్ల వరకు కలెక్షన్స్ ను రాబట్టి పాన్ ఇండియాలో భారీ విజయనందుకోవడమే కాకుండా మరోసారి తన స్టామినా ఏంటో ప్రూవ్ చేసుకున్నాడు. ఇక అప్పటికి ఇప్పటికీ రజనీకాంత్ లో తనను తాను ప్రూవ్ చేసుకోవాలనే తపన పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. ఇక ఇప్పుడున్న యంగ్ హీరోలకి ఏమాత్రం తీసిపోకుండా వాళ్ళతో పోటీపడుతూ చాలా ఫాస్ట్ గా సినిమాలను కంప్లీట్ చేయాలని రజనీకాంత్ టార్గెట్ గా పెట్టుకొని ముందుకు సాగుతున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం రజినీకాంత్ లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో చేస్తున్న ‘కూలీ ‘ సినిమాలో తన అల్లుడు అయిన ధనుష్ ఒక కీలక పాత్రలో నటించబోతున్నాడు అంటు వార్తలైతే వస్తున్నాయి. ఇక లోకేష్ కనకరాజ్ సినిమాలో హీరోకి ఎలాంటి గుర్తింపు అయితే ఉంటుందో, మిగతా క్యారెక్టర్ ఆర్టిస్టులుగా నటించిన వాళ్లకు కూడా చాలా మంచి గుర్తింపు అయితే వస్తుంది. ఉదాహరణకి విక్రమ్ సినిమాను కనక మనం చూసుకున్నట్లైతే అందులో విలన్ గా చేసిన ‘విజయ్ సేతుపతి’ అలాగే ఒక క్యారెక్టర్ లో నటించిన ‘ఫహద్ ఫాజిల్’ లాంటి నటులకు కూడా చాలా మంచి గుర్తింపు అయితే వచ్చింది.

    Also Read: అల్లు అర్జున్ సర్జరీల గుట్టు విప్పిన ప్రముఖ డాక్టర్… ఆ రెండు పార్ట్స్ కి జరిగిందంటూ కీలక కామెంట్స్, వీడియో వైరల్

    వాళ్ళ పాత్రను కూడా చాలా బాగా డిజైన్ చేసుకొని సినిమాని అద్భుతంగా తెరకెక్కించడమే కాకుండా ప్రేక్షకులకు నచ్చే విధంగా చేసి ఈ సినిమాని బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిపాడు… ఇక ఇదిలా ఉంటే రజనీకాంత్ సినిమాలో కూడా ధనుష్ ను ఒక కీలకపాత్రలో తీసుకొని ఆయన చేత ఆ పాత్రలో నటింపజేకి సినిమా మీద భారీ హైప్ ను క్రియేట్ చేయాలనే ఉద్దేశంలో డైరెక్టర్ ఉన్నట్టుగా తెలుస్తుంది… ఇక ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ రజనీకాంత్ కూతురు అల్లుడైన ఐశ్వర్య-ధనుష్ ల మధ్య గొడవలు రావడం వల్ల ప్రస్తుతానికి వాళ్ళు డివోర్స్ తీసుకొని సపరేట్ అయిపోయారు.

    మరి ఇలాంటి సందర్భంలో ధనుష్ రజనీకాంత్ మధ్య సత్సంబంధాలు ఉన్నాయా? వీళ్లిద్దరి మధ్య మాటలు ఉన్నాయా ధనుష్ ఇప్పుడు రజనీకాంత్ సినిమాలో నటించడానికి సిద్ధంగా ఉన్నాడా? లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఇక ధనుష్ లాంటి ఒక టాలెంటెడ్ నటుడు రజనీకాంత్ సినిమాలో నటిస్తే బాగుంటుంది అని రజినీకాంత్ అభిమానులతో పాటు ధనుష్ అభిమానులు కూడా కోరుకుంటున్నారు. రజనీకాంత్ ఒప్పుకుంటే ధనుష్ కూడా తన సినిమాలో నటించడానికి సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది.

    చూడాలి మరి లోకేష్ కనకరాజ్ అనుకున్న కోరిక నెరవేరుతుందా లేదా అనేది… ఇక రీసెంట్ గా ధనుష్ స్వీయ దర్శకత్వంలో చేసిన ‘రాయన్ ‘ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయినప్పటికీ ఈ సినిమా అనుకున్న మేరకు సక్సెస్ అయితే సాధించలేకపోయింది. ఇక దాంతో తెలుగు మార్కెట్ పైన కన్నేసిన ధనుష్ మరోసారి నిలుత్సాహపడక తప్పలేదు… మరి ఫ్యూచర్ లో మరికొన్ని మంచి ప్రాజెక్టులతో వచ్చి తెలుగులో మంచి హిట్లను అందుకుంటాడా లేదా అనేది తెలియాల్సి ఉంది…

     

    Also Read: రామ్ చరణ్ తో రొమాన్స్ చేసిన ఈ ముద్దుగుమ్మలు చిరంజీవి, పవన్ కళ్యాణ్ లతో కూడా ఆడిపాడరనే విషయం మీకు తెలుసా..?