Homeఅంతర్జాతీయంIran rejects Trump Victory Claim: యుద్ధం గెలిచామంటున్న ట్రంప్‌.. అంత సీన్‌ లేదన్న ఇరాన్‌.....

Iran rejects Trump Victory Claim: యుద్ధం గెలిచామంటున్న ట్రంప్‌.. అంత సీన్‌ లేదన్న ఇరాన్‌.. ఆపేందుకు షరతులు!

Iran rejects Trump Victory Claim: పశ్చిమాసియాలో అగ్రరాజ్యం అమెరికా రాజేసిన అగ్గి.. క్రమంగా విస్తరిస్తూ ప్రత్యక్షంగా, పరోక్షంగా 30 దేశాలకు విస్తరించింది. 13 రోజులైనా యుద్ధ తీవ్రతలో ఎలాంటి తగ్గుదల కనిపించడం లేదు. ఎవరూ తగ్గడం లేదు. ఇది అంతర్జాతీయంగా ఆందోళన పెంచుతోంది. 13 రోజుల యుద్ధంలో ఇరాన్‌ సుప్రీం లీడర్‌ అయతుల్లా అలీ ఖమేనీతోపాటు 1,200 మంది మరణించారు. ఈ తరుణంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మాట్లాడుతూ యుద్ధం చివరి దశకు వచ్చిందని, అమెరికా దాదాపు విజయం సాధించింది అని ప్రకటించాడు. ఇరాన్‌ దీనిని ఖండించింది. యుద్ధం కొనసాగుతోందని, అమెరికా దాడులు ఆపకుంటే క్రూడ్‌ ఆయిల్‌ ధరలు 200 డాలర్లకు పెంచేలా చేస్తామని హెచ్చరించింది. మరోవైపు ఇరాన్‌ అధ్యక్షుడు మసూద్‌ పెజెష్కియాన్‌ మూడు డిమాండ్లు ప్రకటించారు. వీటిని అమెరికా, ఇజ్రాయెల్‌ ఆమోదించకపోతే శాంతి కష్టమే అని హెచ్చరించాడు. హార్మూజ్‌ జలసంధి మూతతో చమురు ధరలు రోజుకు 20% పెరిగి బారెల్‌కు 150 డాలర్లకు చేరాయి.

Also Read: వైసిపి చేతికి ‘ఆమె’ కొత్త బాణం!

1,200 మంది మృతి..
ఫిబ్రవరి 28న అమెరికా ఎయిర్‌ఫోర్స్, ఇజ్రాయెల్‌ ఐడీఎఫ్‌ ఇరాన్‌ అణు సైట్లు, సైనిక బేసులపై 50కి పైగా దాడులు చేశాయి. ఇరాన్‌ ప్రతీకారంగా ఇజ్రాయెల్‌పై 300 మిస్సైళ్లు విసిరింది. ఫలితంగా 1,200 మంది మరణించారు. ఇందులో ఇరాన్‌కు చెందిన వారు 850, ఇజ్రాయెల్‌కు చెందినవారు 250, అమెరికాకు చెందిన వారు వంద మంది ఉన్నారు. ఇరాన్‌ అణుకేంద్రాలు 70 శాతం దెబ్బతిన్నాయి. 50 బిలియన డాలర్ల ఆస్తినష్టం జరిగింది.

ఇరాన్‌ షరతులు..
ఇక యుద్ధం ఆపేందుకు ఇరాన్‌ అధ్యక్షుడు ఆపెజెష్కియాన్‌ మూడు షరతులు పెట్టారు. రష్యా అధ్యక్షుడు పుతిన్, పాకిస్తాన్‌ ప్రధాని షరీఫ్‌తో చర్చల తర్వాత మూడు కండీషన్లు పెట్టారు.

– సార్వభౌమత్వ గుర్తింపు
ఐక్యరాజ్యసమితి, ఐఏఈఏ ఇరాన్‌ హక్కులను అధికారికంగా ఆమోదించాలి. ఆర్థిక ఆంక్షలు తొలగించాలి. ఇది ఇరాన్‌ గెలుపును, అమెరికా ఓటమిని సూచిస్తుది. దీనికి అంగకరించే అవకాశం లేదు.

– నష్ట పరిహారం ఇవ్వాలి..
యుద్ధం కారణంగా జరిగిన నష్టాన్ని పూడ్చుకునేందుకు అమెరికా, ఇజ్రాయెల్‌ 100 బిలియన్లు చెల్లించాలి. ఇరాన్‌ పునర్నిర్మాణానికి సహాయం చేయాలి.

దాడులు చేయమని హామీ…
ఇక మూడో కండీషన్‌ ముఖ్యమైదని. భవిష్య™Œ లో ఇరాన్‌పై దాడి చేయమని అమెరికా, ఇజ్రాయెల్‌ రాతపూర్వకంగా హామీ ఇవ్వాలి. దీనికి కూడా అమెరికా అస్సలు అంగీకరించదు.

పెరుగుతున్న చమురు ధరలు..
ఇదిలా ఉంటే హార్మూజ్‌ జలసంధి మూసివేతతో ఇంధన ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. క్రూడ్‌ ధరలు ఇప్పటికే 80 డాలర్ల నుంచి 150 డాలర్లకు పెరిగింది. అమెరికా, యూరోపియన్‌ యూనియన్‌ దేశాలకు చెందిన షిప్పులు హార్మూజ్‌ జలసంధి దాటనివ్వమని ఇరాన్‌ స్పష్టం చేసింది. అయితే భారత షిప్పులకు మాత్రం అనుమతి ఇచ్చింది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version