https://oktelugu.com/

Ram Charan : రామ్ చరణ్ తో రొమాన్స్ చేసిన ఈ ముద్దుగుమ్మలు చిరంజీవి, పవన్ కళ్యాణ్ లతో కూడా ఆడిపాడరనే విషయం మీకు తెలుసా..?

సినిమా ఇండస్ట్రీ లో హీరోలకు ఉన్న గుర్తింపు హీరోయిన్లకు ఉండదు. నిజానికి చాలా సినిమాల్లో హీరోయిన్స్ సాంగ్స్ కు మాత్రమే పరిమితమవుతారు...

Written By:
  • Gopi
  • , Updated On : July 30, 2024 / 07:25 PM IST
    Follow us on

    Ram Charan  : సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లు చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి హీరోతో కలిసి నటిస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళను వాళ్ళు స్టార్ హీరోయిన్స్ గా ఎస్టాబ్లిష్ చేసుకునే సమయంలో వాళ్ళకి ఎలాంటి అవకాశం వచ్చిన కూడా వదులుకోలేరు. కాబట్టి ప్రతి ఒక్క హీరోతో సినిమాలను చేసి ఆ తర్వాత స్టార్ హీరోయిన్స్ గా మారుతారు. ఇక అప్పుడు మాత్రం కేవలం స్టార్ హీరోలతో సినిమాలు చేస్తారు. ఇక ఇక్కడి వరకు బాగానే ఉన్నప్పటికీ కొంతమంది హీరోయిన్లు మాత్రం ఇండస్ట్రీ లో ఉన్న తండ్రి కొడుకులతో సినిమాలను చేసి వాటిని సక్సెస్ ఫుల్ గా నిలపడమే కాకుండా తండ్రితో కొడుకుతో ఇద్దరితో కూడా సక్సెస్ ఫుల్ కాంబినేషన్ గా గుర్తింపు పొందుతూ ఉంటారు. ఇక వాళ్ళు చేసిన ఆ ఇద్దరు హీరోలతో కూడా కెమిస్ట్రీ అనేది బాగా వర్కౌట్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోతో సినిమా చేయడానికి చాలా మంది హీరోయిన్లు ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. తన కెరియర్ స్టార్టింగ్ నుంచి చాలామంది హీరోయిన్లతో కలిసి నటించిన రామ్ చరణ్ ఒక ముగ్గురు హీరోయిన్లతో మాత్రం చాలా ప్రత్యేకమైన బాండింగ్ ని ఏర్పాటు చేసుకున్నాడనే చెప్పాలి. ఇక అలాగే ఆయన చేసిన ఆ ముగ్గురు హీరోయిన్లతో ఆ తర్వాత కాలంలో పవన్ కళ్యాణ్, చిరంజీవి లాంటి స్టార్ హీరోలు కూడా నటించారు…నిజానికి మెగా కాంపౌండ్ లో ఒక హీరోయిన్ ఎంటర్ అయింది అంటే ఆ కాంపౌండ్ లో ఉన్న మెగా ఫ్యామిలీ హీరోలందరు ఆ హీరోయిన్ తో నటించడానికి ఆసక్తి చూపిస్తుంటారు అంటూ చాలా రోజుల నుంచి ఒక వార్త అయితే ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది.

    అందుకే చాలా మంది హీరోయిన్లు మెగా ఫ్యామిలీ లో ఉన్న ఏదో ఒక హీరోతో మొదట సినిమా చేయాలని కోరుకుంటారు. ఇక ఆ తర్వాత ఆ అమ్మాయి యాక్టింగ్ గాని, బిహేవియర్ గాని బాగుంటే మెగా ఫ్యామిలీ లో ఉన్న హీరోలందరు తమ తమ సినిమాల్లో ఆ హీరోయిన్లకు అవకాశాలను ఇస్తూ ఉంటారు. ఇక ఇప్పటివరకు రామ్ చరణ్ తో చేసిన ముగ్గురు హీరోయిన్లు చిరంజీవి, పవన్ కళ్యాణ్ లతో చేసి మెప్పించడం అనేది నిజంగా ఒక మంచి విషయమనే చెప్పాలి. మరి ఆ హీరోయిన్లు ఎవరు అనేది మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

    మొదటగా రామ్ చరణ్, కాజల్ అగర్వాల్ తో మగధీర, నాయక్, గోవిందుడు అందరి వాడేలే లాంటి మూడు సినిమాలను చేసి మంచి విజయాలను అందుకున్నాడు. ఇక వీళ్ళ అన్ స్క్రీన్ కెమిస్ట్రీ చాలా అద్భుతంగా ఉంటుందంటూ ప్రేక్షకుల నుంచి చాలా మంచి ప్రశంసలు కూడా వచ్చాయి… ఇక ఆ తర్వాత పవన్ కళ్యాణ్ కాజల్ తో ‘సర్దార్ గబ్బర్ సింగ్’ అనే సినిమా చేశాడు. అయితే ఈ సినిమా కమర్షియల్ గా ఫ్లాప్ అయినప్పటికీ పవన్ కళ్యాణ్ – కాజల్ కాంబోకి మంచి మార్కులు పడ్డాయి… ఇక వీళ్లిద్దరి తర్వాత మెగాస్టార్ చిరంజీవి హీరోగా వచ్చిన ‘ఖైదీ నెంబర్ 150’ సినిమాలో కాజల్ హీరోయిన్ గా నటించి చిరంజీవి పక్కన కూడా ఆడి పాడిందనే చెప్పాలి. ఇక తను చిరంజీవి తో కూడా బెస్ట్ జోడి అనిపించుకుంది…

    అలాగే రామ్ చరణ్ తో రచ్చ సినిమాలో నటించిన తమన్నా ఆ తర్వాత పవన్ కళ్యాణ్ తో ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ సినిమాలో నటించింది. చిరంజీవితో సైరా, భోళా శంకర్ లాంటి రెండు సినిమాల్లో నటించి మెప్పించింది. ఇక రామ్ చరణ్ తో నటించిన మరొక హీరోయిన్ శృతిహాసన్ ఈమె పవన్ కళ్యాణ్ తో ‘గబ్బర్ సింగ్’ సినిమాలో నటించడమే కాకుండా వీళ్ళిద్దరి కాంబినేషన్ కు ప్రేక్షకుల నుంచి మంచి గుర్తింపు కూడా వచ్చింది. ఇక చిరంజీవి తో ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలో నటించి మెప్పించింది…