https://oktelugu.com/

Allu Arjun : అల్లు అర్జున్ సర్జరీల గుట్టు విప్పిన ప్రముఖ డాక్టర్… ఆ రెండు పార్ట్స్ కి జరిగిందంటూ కీలక కామెంట్స్, వీడియో వైరల్

అల్లు అర్జున్ యాంటీ ఫ్యాన్స్ తరచుగా ఆయన్ని ఓ విషయంలో ట్రోల్ చేస్తుంటారు. అందం కోసం సర్జరీలు చేయించుకున్నాడని ఎద్దేవా చేస్తుంటారు. నిజంగా అల్లు అర్జున్ సర్జరీ చేయించుకున్నాడా? అందులో నిజమెంత? ప్రముఖ కాస్మెటిక్ సర్జన్ అల్లు అర్జున్ సర్జరీల గుట్టు విప్పాడు. ఈ వీడియో వైరల్ అవుతుంది.

Written By:
  • S Reddy
  • , Updated On : July 30, 2024 / 05:29 PM IST
    Follow us on

    Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ టాలీవుడ్ టాప్ స్టార్స్ లో ఒకరు. పుష్ప సినిమాతో ఆయన రేంజ్ మారిపోయిది. పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. దేశ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. పుష్ప సినిమాలో నటనకు గానూ అల్లు అర్జున్ ని ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డు వరించింది. జాతీయ ఉత్తమ నటుడు అవార్డు అందుకున్న ఏకైక టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ కావడం విశేషం. సినిమా సినిమాకు అల్లు అర్జున్ తనను మెరుగుపరుచుకుంటూ వచ్చాడు. ఇక అల్లు అర్జున్ బెస్ట్ డాన్సర్.

    కాగా అల్లు అర్జున్ ని ఉద్దేశిస్తూ ఓ డాక్టర్ చేసిన కామెంట్స్ సంచలనం రేపుతున్నాయి. అల్లు అర్జున్ సర్జరీలపై చర్చ జరిగింది. డాక్టర్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అల్లు అర్జున్ ముఖానికి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నారు అని గతంలో చాలా రూమర్స్ వినిపించాయి.
    ఇదే అంశం పై తాజాగా ప్రముఖ కాస్మొటిక్ సర్జన్ డాక్టర్ రాజశేఖర్ గొల్లు స్పష్టత ఇచ్చారు. సినీ ఇండస్ట్రీలో హీరోలు, హీరోయిన్లు అందంగా కనిపించడానికి ప్లాస్టిక్ సర్జరీలకు పాల్పడతారనే వాదన ఉంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో నటీనటుల ఒకప్పటి లుక్ ని ప్రజంట్ లుక్ తో పోలుస్తూ ట్రోల్ చేయడం మనం చూస్తున్నాం. కాగా అల్లు అర్జున్ ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నాడు అంటూ ప్రముఖ కాస్మొటిక్ సర్జన్ డాక్టర్ రాజశేఖర్ గొల్లు తేల్చి చెప్పారు.

    డాక్టర్ కి అల్లు అర్జున్ గంగోత్రి సినిమా నాటి ఫోటో, ఇప్పటి ఫోటో కలిపి చూపించి సర్జరీ గురించి యాంకర్ ప్రశ్నించారు. డాక్టర్ మాట్లాడుతూ .. అల్లు అర్జున్ ముక్కుకి సర్జరీ చేయించారని బాగా తెలుస్తుంది. అలాగే లిప్స్ విషయంలో కూడా క్లియర్ గా తెలిసిపోతుంది. ముక్కు, పెదాలకు సర్జరీ చేయించారని మనం చెప్పొచ్చు. నా అవగాహన బట్టి అల్లు అర్జున్ సర్జరీ చేయించుకున్నారు, అని అన్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సదరు వీడియో పై అల్లు అర్జున్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. యాంటీ ఫ్యాన్స్ కావాలని అల్లు అర్జున్ ఇమేజ్ దెబ్బ తీయాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

    ప్రస్తుతం బన్నీ పుష్ప 2 ప్రాజెక్టు తో బిజీగా ఉన్నారు. ఈ సినిమా ఆగస్టు 15న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కావాల్సివుంది. కానీ అనూహ్యంగా డిసెంబర్ నెలకు వాయిదా పడింది. తాజాగా పుష్ప 2 షూటింగ్ పునః ప్రారంభించారు. రామోజీ ఫిలిం సిటీలో ఇతర ఆర్టిస్టులతో ఉన్న సీన్స్ సుకుమార్ చిత్రీకరిస్తున్నారట.

    సుకుమార్ ఇతర నటుల మీద కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారట. ఇటీవల వెకేషన్ నుంచి అల్లు అర్జున్ తిరిగివచ్చారు. త్వరలోనే తన నెక్స్ట్ షెడ్యూల్ కోసం పుష్ప 2 సెట్స్ లో అడుగుపెట్టనున్నారని సమాచారం. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. సునీల్, అనసూయ భరద్వాజ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ విలన్ గా నటిస్తున్నారు. పుష్ప 2పై ఇండియా వైడ్ అంచనాలున్నాయ