Tollywood Actors Latest Remuneration Details
Tollywood Actors: టాలీవుడ్ స్టార్ హీరోల రేంజ్ మారిపోయింది. పాన్ ఇండియా స్టార్స్ గా ఎదిగారు. భారీ రెమ్యునరేషన్ అందుకుంటున్నారు. ఒకప్పుడు బాలీవుడ్ హీరోలు మాత్రమే వందల కోట్ల పారితోషికం తీసుకునే వారు. ప్రస్తుతం టాలీవుడ్ హీరోలు గ్లోబల్ వైజ్ క్రేజ్ రాబట్టారు. ఎన్టీఆర్, ప్రభాస్ లకు జపాన్ లో కూడా అభిమానులు ఉన్నారు. వీరిద్దరి సినిమాలో అక్కడ ప్రేక్షకులు ఇష్టంగా చూస్తారు. కాగా టాలీవుడ్ స్టార్ హీరోల లేటెస్ట్ రెమ్యూనరేషన్ లెక్కలు ఈ స్టోరీలో తెలుసుకుందాం….
టాలీవుడ్ హైయెస్ట్ పెయిడ్ యాక్టర్ గా ప్రభాస్ ఉన్నారు. బాహుబలి తో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన ప్రభాస్ సినిమాకు రూ. 150 కోట్లు తీసుకుంటున్నారు. రాధే శ్యామ్, ఆది పురుష్ వంటి సినిమాలు డిజాస్టర్ గా నిలిచినా ప్రభాస్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఇటీవల సలార్ తో కోట్లు కొల్లగొట్టారు.అందుకే ఆయనతో సినిమా చేసేందుకు దర్శక నిర్మాతలు పోటీ పడుతున్నారు. మహేష్ బాబు క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మహేష్ సినిమా విడుదల అవుతుంది అంటే ధియేటర్లలో సందడి ఓ రేంజ్ లో ఉంటుంది.
ఆయనతో సినిమా చేస్తే లాభాలు పక్కా వస్తాయని దర్శక నిర్మాతలు భావిస్తుంటారు. వరుస విజయాలతో జోరు మీదున్న మహేష్ బాబు సినిమాకు రూ. 70 నుండి రూ. 100 కోట్ల వరకు తీసుకుంటున్నారు. ఆర్ ఆర్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ రేంజ్ మారిపోయింది. ప్రస్తుతం ఎన్టీఆర్ సినిమాకు రూ. 80 నుండి రూ. 100 కోట్ల వరకుడిమాండ్ చేస్తున్నారని సమాచారం. అల్లు అర్జున్ పుష్ప సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. పాన్ ఇండియా స్టార్ అయిపోయారు. పుష్ప 2 చిత్రానికి గాను ఆయన రూ. 80 కోట్లు తీసుకున్నారట.
రామ్ చరణ్ గతంలో రూ. 40 కోట్ల కంటే తక్కువే తీసుకునే వారని సమాచారం. ఇప్పుడు ఆయన రెమ్యూనరేషన్ రూ. 70 – 80 కోట్లు మధ్య ఉన్నట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ కు యూత్ లో బాగా క్రేజ్ ఉంది. ఇక సినిమాకు రూ. 50 కోట్లు పారితోషికం తీసుకుంటున్నట్లు సమాచారం. ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. త్వరలో ఓజీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.