https://oktelugu.com/

Prabhas : లండన్ లో ఇల్లు కొన్న ప్రభాస్… ఎన్ని కోట్లో తెలుసా?

పలువురు బాలీవుడ్ స్టార్స్ కి లండన్ లో సొంత ఇళ్ళు ఉన్నాయి. అక్కడ ఇల్లు కలిగి ఉండటం ఒక స్టేటస్ గా భావిస్తారు. ఇక హైదరాబాద్ లో కూడా ప్రభాస్ కి ఒక విలాసవంతమైన ఇల్లు ఉంది. అలాగే నగర శివారులో ఫార్మ్ హౌస్ ఉంది. ప్రభాస్ ఖాళీగా ఉంటే ఏకాంతంగా గడపడానికి ఇష్టపడతాడు. ప్రభాస్ పలు ప్రాజెక్ట్స్ పూర్తి చేయాల్సి ఉంది.

Written By:
  • NARESH
  • , Updated On : March 27, 2024 / 08:47 PM IST
    Follow us on

    Prabhas : ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. క్షణం తీరిక లేకుండా కమిటైన ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న కల్కి 2829 AD ఈ ఏడాది మే 9న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా వస్తున్న ఈ మూవీపై విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ప్రభాస్ కెరీర్ లో మొదటిసారి సైన్స్ ఫిక్షన్ మూవీ చేస్తున్నాడు. అమితాబచ్చన్, దీపికా పదుకొనె, దిశా పటాని, కమల్ హాసన్ వంటి భారీ క్యాస్ట్ కల్కి చిత్రంలో భాగం అయ్యారు.

    అలాగే దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న రాజా సాబ్ కొంత మేర షూటింగ్ జరుపుకుంది. సలార్ 2 ఇదే ఏడాది సెట్స్ పైకి వెళుతుందని సమాచారం. ఈ ఏడాది ప్రభాస్ నటించిన కల్కి, రాజా సాబ్ విడుదలయ్యే అవకాశం కలదు. అలాగే సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్ టైటిల్ తో ఒక ప్రాజెక్ట్ ప్రకటించారు. ఇదిలా ఉండగా ప్రభాస్ కు సంబంధించిన ఆసక్తికరమైన వార్త ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ప్రభాస్ లండన్ లో ఓ విలాసవంతమైన ఇల్లు కొనుగోలు చేశాడని సమాచారం.

    ఆయన షూట్స్, వెకేషన్స్ కోసం లండన్ వెళ్ళినప్పుడు ఓ ఇంట్లో అద్దెకు ఉండేవాడట. ప్రభాస్ కి ఆ ఇల్లు అంటే చాలా ఇష్టం అట. ఆధునిక సౌకర్యాలతో ఎంతో విలాసవంతంగా ఆ ఇల్లు ఉంటుందట. ఆ ఇంటిని ప్రభాస్ సొంతం చేసుకున్నాడట. ఇక ఆ ఇంటి ధర వంద కోట్లకు పైమాటే అని సమాచారం. సినిమాకు నూటయాబై కోట్లు తీసుకుంటున్న ప్రభాస్ కి వంద కోట్లు ఓ లెక్కా చెప్పండి. ప్రభాస్ లండన్ లో ఇల్లు కొన్నాడన్న వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

    పలువురు బాలీవుడ్ స్టార్స్ కి లండన్ లో సొంత ఇళ్ళు ఉన్నాయి. అక్కడ ఇల్లు కలిగి ఉండటం ఒక స్టేటస్ గా భావిస్తారు. ఇక హైదరాబాద్ లో కూడా ప్రభాస్ కి ఒక విలాసవంతమైన ఇల్లు ఉంది. అలాగే నగర శివారులో ఫార్మ్ హౌస్ ఉంది. ప్రభాస్ ఖాళీగా ఉంటే ఏకాంతంగా గడపడానికి ఇష్టపడతాడు. ప్రభాస్ పలు ప్రాజెక్ట్స్ పూర్తి చేయాల్సి ఉంది.