https://oktelugu.com/

New Cars In India: మార్కెట్లోకి త్వరలో రాబోతున్న 5 కొత్త కార్లు ఇవే..

మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ కొత్త ఎస్ యూవీని అందుబాటులోకి తీసుకురానుంది. దీని నుంచ 5 డోర్ల థార్ మార్కెట్లోకి రావొచ్చు. ఇది రూ.15 లక్షల వరకు ప్రారంభ ధరతో విక్రయించవచ్చు.

Written By:
  • Srinivas
  • , Updated On : March 30, 2024 11:39 am
    discount car

    discount car

    Follow us on

    New Cars In India: ప్రజల అవరాలు రోజురోజుకు మారిపోతున్నాయి. ఒకప్పుడు ప్రయాణాలు చేయాలంటే బస్సుల్లో, ప్రత్యేక వాహనాలను అద్దెకు తీసుకొని వెళ్లేవారు. కానీ ఇటీవల కాలంలో ఎక్కువగా సొంతంగా వెహికల్ ఉండాలని కోరుకుంటున్నారు. వీటిలో ఎక్కువ శాతం సొంతంగా కారు ఉండాలని అనుకుంటున్నారు. ఫ్యామిలీతో పాటు వివిధ పనుల నిమిత్తం ఇంట్లో 4 వీలర్ ఉండాలని ఆశపడుతున్నారు. ఈ నేపథ్యంలో కార్ల అమ్మకాలు జోరందుకున్నాయి. ఇండియన్ ఆటోమోబైల్ మాన్యు ఫ్యాక్చరర్స్ ప్రకారం 2024 ఫిబ్రవరి ఒక్క నెలలోనే 3.70 లక్షల కార్లు విక్రయాలు జరుపుకున్నారు. అయితే వీటిలో ఎక్కువగా ఎస్ యూవీలు ఉన్నాయి. దీంతో కొన్ని కంపెనీలు కొత్త ఎస్ యూవీలను మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్ధం చేశాయి.

    దేశంలోని కార్ల ఉత్పత్తిలో మారుతి కంపెనీ అగ్రగామిగా ఉంటోంది. ఈ కంపెనీ నుంచి హ్యాచ్ బ్యాక్ నుంచి ఎస్ యూవీ వరకు వివిధ వేరియంట్లలో ఉత్పత్తి అవుతున్నాయి. తాజాగా ఈ కంపెనీ నుంచి స్విప్ట్ జెన్ రాబోతుంది. ఇది 1.2 లీటర్ డ్యూయెల్ జెట్ పెట్రోల్ ఇంజిన్ ను కలిగి ఉంది. దీనిని రూ.6.50 లక్షల ప్రారంభ ధర నుంచి రూ.10 లక్షల వరకు విక్రయించవచ్చు.

    మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ కొత్త ఎస్ యూవీని అందుబాటులోకి తీసుకురానుంది. దీని నుంచ 5 డోర్ల థార్ మార్కెట్లోకి రావొచ్చు. ఇది రూ.15 లక్షల వరకు ప్రారంభ ధరతో విక్రయించవచ్చు. కారులో 18 అంగుళాల అలాయ్ వీల్స్, సిగ్నేచర్ సిక్స్, స్లాట్ గ్రిల్ డిజైన్ వంటి ఫీచర్స్ ఆకర్షించనున్నాయి.

    మారుతికి గట్టి పోటీ ఇస్తోంది టాటా మోటార్స్. ఈ కంపెనీ విభిన్నంగా కొత్త ఈవీని మార్కెట్లోకి తీసుకొస్తుంది. దీనిని ఇప్పటి ఆటో ఎక్స్ పో లో ఆవిష్కరించారు. ఇది జూన్ లోకి మార్కెట్లోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. టాటా హారియర్ గా రాబోతున్న దీని ధర రూ.22 లక్షల ప్రారంభ ధర ఉండొచ్చన్న అంచనాలు ఉన్నాయి.

    స్కోడా సైతం సూపర్బ్ కారును కొత్త వెర్షన్ ను తీసుకొస్తుంది. దీనిని రూ.28 లక్షల వరకు విక్రయించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇందులో రెండు ఇంజిన్లు ఉండే అవకాశం ఉన్నాయి. వీటిలో ఒకటి 2.0 లీటర్ టర్బో పెట్రోల్, మరొకటి 2.0 లీటర్ డీజిల్ ఇంజిన్ ను కలిగి ఉంది.

    కియా కంపెనీ ఈ మధ్య భారత్ లో దూసుకుపోతుంది. ఈ కంపెనీ జూన్ లో కొత్తగా కార్నివాల్ కారును అందుబాటులోకి తీసుకురానుంది. ఇందులో 12.3 అంగుళాల డిజిటల్ గేజ్ క్లస్టర్ తో పాటు 12.3 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ ఉంటుంది. దీనిని రూ.40 లక్షల ప్రారంభ ధర నుంచి రూ.45 లక్షల వరకు విక్రయించే అవకాశం ఉంది.