spot_img
Homeఅప్పటి ముచ్చట్లుTollywood : 500 రోజులు ఆడిన ఈ తెలుగు సినిమా గురించి తెలుసా?

Tollywood : 500 రోజులు ఆడిన ఈ తెలుగు సినిమా గురించి తెలుసా?

Tollywood : ఒకప్పుడు తెలుగు సినిమా స్వర్ణయుగం. జీవితాలను పణంగా పెట్టి చిత్రాలను నిర్మించేవారు. కోట్ల కొద్దీ డబ్బుల ఖర్చుపెట్టి ప్రేక్షకులకు వినోదాన్ని పంచేవారు. ఆ సినిమాలకు ఎంత ఖర్చుపెడుతున్నారో.. అంతే స్థాయిలో నటులు సినిమాల కోసం కుటుంబాలను వదులుకొని పనులు చేసేవారు. అలా చేస్తేనే సినిమాలు బ్లాక్ బస్టర్ అయ్యాయి. ఆ కాలంలో సినీ జనాలను ఆకర్షించేందుకు నటులు పడ్డ కష్టం అంతా ఇంతాకాదు. అలాంటి కష్టాలనికి ఓ సినిమా రికార్డులు సృష్టించింది. 100 కాదు.. 200 కాదు.. ఏకంగా 500 రోజులు నడిచింది. మరి ఆ సినిమా ఏదో తెలుసా?

సీనియర్ ఎన్టీఆర్ సినిమాలంటే ఇప్పటికీ ఇష్టమున్నవారు లేరని చెప్పలేం. నటకీర్తీగా పేరు తెచ్చుకున్న ఆయన సినిమాలు దాదాపు విజయవంతం అయ్యేవి. భవిష్యత్ తరాలకు గుర్తుండిపోయే విధంగా ఎన్టీఆర్ పౌరాణిక చిత్రాల్లో నటించేవారు. ఒక దశలో రాముడు, కృష్ణుడు ఇలా ఉంటాడని చెప్పిన ఎన్టీఆర్ ను కొందరు అభిమానులు దేవుడిగా భావిస్తారు. ఆ శ్రీరాముడే మళ్లీ పుట్టి ఎన్టీఆర్ రూపంలో కనిపించాడని అంటారు. అంతలా ఆకట్టుకున్న ఎన్టీఆర్ పలు పౌరాణిక చిత్రాలు తీసి వినోదాన్ని పంచాడు. ఆయన తీసిన జానపద చిత్రాలన్నీ దాదాపు విజయవంతంగా నడిచాయి.

అప్పటికే రాముడిగా, శ్రీకృష్ణుడిగా అలరించిన ఎన్టీఆర్ నటించిన పౌరాణిక చిత్రాల్లో లవకుశ సినిమా ఎవర్ గ్రీన్ గా ఉండిపోయింది. ఈ సినిమాలో నందమూరి చెప్పే డైలాగ్ లు, పద్యాలు ఆద్యంతం ఆకట్టుకుంటాయి. రామాయణం నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాలో ఎన్టీఆర్ రాముడిగా నటించారు. సీత పాత్రలో అంజలీ దేవి నటించారు. లవకుశలుగా ఇద్దరు బాల నటులు చేశారు. తెలుగుతో పాటు తమిళం, హిందీ భాషల్లో రిలీజై ఆకట్టుకుంది. ఆరోజుల్లో ఈ సినిమా పెద్ద సంచలనంగా మారింది. 1963 మార్చి 29న విడుదలైన ఈ సినిమా ను చూసేందుకు ఎడ్లబండ్లపై థియేటర్లకు వేళ్లేవాళ్లమని కొందరు చెబుతున్నారు.

లవకుశ సృష్టించిన రికార్డు ఇప్పటీకీ ఏ సినిమా బద్దలు కొట్టలేదు. ఈ సినిమా ఏకంగా 500 రోజులు ప్రదర్శింపబడింది. అంతకుముందు ఈ ఎన్టీఆర్ నటించిన పాతాళ భైరవి 245 రోజులు నడిచింది. ఆ తరువాత ఆ రికార్డును ఎన్టీఆరే లవకుశతో బ్రేక్ చేశాడు. ఆ రోజుల్లో ఇన్ని రోజులు నడిచి రూ.కోటి రూపాయల వరకు వసూళ్లు తెచ్చింది. తెలుగుతో పాటు తమిళంలోనూ లవకుశ రికార్డు రాసింది. అక్కడ ఏకంగా 40 వారాలు ప్రదర్శించారు. హిందీలో 25 వారాలు నడవడంతో అన్నగారు ఆ కాలంలోనే పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు. అల్లారెడ్డి శంకర్ రెడ్డి నిర్మాణంలో వచ్చిన లవకుశ సినిమా తొలి తెలుగు కలర్ సినిమా కావడం విశేషం. ఇందులో లక్హణ్ గా కాంతారావు, భరతుడిగా సత్యనారాయణ, శత్రఘ్ణుడిగా శోభన్ బాబు, లవుడుగా నాగబాబు, కుశుడిగా సుబ్రహ్మణ్యం నటించారు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

The Odyssey 3 Day Collections

The Odyssey Box Office : ‘ది ఒడిస్సీ’ 6 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. తెలుగు రాష్ట్రాల...

The Odyssey Box Office : క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వం లో తెరకెక్కిన లేటెస్ట్ చిత్రం 'ది ఒడిస్సీ' బాక్స్ ఆఫీస్ వసూళ్ల సునామీ జోరు ఏమాత్రం తగ్గలేదు. సినిమా విడుదలై 6...
Lenin 10 Days Collection

Lenin Movie : ‘లెనిన్’ 13 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. కొత్త సినిమాలు వచ్చినా జోరు తగ్గలేదు..

Lenin Movie : అఖిల్ 'లెనిన్' చిత్రం బాక్స్ ఆఫీస్ జోరు ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఈ సినిమా విడుదలై 13 రోజులైనప్పటికీ కూడా, కొన్ని సెంటర్స్ లో నేటికీ కూడా భారీ...
Vijay Deverakonda

Vijay Deverakonda : ఆగిపోయిన విజయ్ దేవరకొండ కొత్త సినిమా.. కోట్ల రూపాయిల నష్టం..

Vijay Deverakonda : యూత్ ఆడియన్స్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న హీరోల్లో ఒకరు విజయ్ దేవరకొండ. చేసిన సినిమాలు తక్కువే, అందులో డిజాస్టర్స్ ఎక్కువ , అయినప్పటికీ ఈ...

India student protests : నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక ల నమూనా భారత్ లో ఎందుకు సక్సెస్ కాదు?

India student protests : దేశవ్యాప్తంగా విద్యార్థుల ఆందోళనలు క్రమంగా ఉధృతమవుతున్నాయి. ప్రారంభంలో వందల సంఖ్యలో సాగిన నిరసనలు ఇప్పుడు వేలాదిమందిని ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా నీట్ పేపర్ లీక్ వ్యవహారం, పరీక్షల పారదర్శకతపై...
Jana Nayagan Advance Bookings

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ఓపెనింగ్ రికార్డు ని బ్రేక్ చేయకుండానే రిటైర్ అయిపోయిన సీఎం విజయ్..

Pawan Kalyan : ఈమధ్య కాలం లో సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ , విజయ్ ల మధ్య పోలికలు పెడుతూ , అభిమానుల మధ్య జరుగుతున్న ఫ్యాన్ వార్స్ ని మన...
Oktelugu Epaper