Homeఎంటర్టైన్మెంట్Allu Arjun : టాలీవుడ్ లో ఒకే ఒక్కడు.. అల్లు అర్జున్ కు అవార్డ్ ఇందుకే...

Allu Arjun : టాలీవుడ్ లో ఒకే ఒక్కడు.. అల్లు అర్జున్ కు అవార్డ్ ఇందుకే వచ్చింది..!

అల్లు అర్జున్ డిఫరెంట్ పాత్రలు చేయడంలో ఎక్స్‌పర్ట్. పుష్ప కోసం మరింత కష్టపడ్డాడు. చిత్తూరు యాసతోపాటు డీగ్లామర్ లుక్‌తో ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నాడు.

Allu Arjun  : జాతీయ చలన చిత్ర అవార్డుల్లో 69 ఏళ్ల తర్వాత తెలుగు సినిమా సత్తా చాటింది. 69 ఏళ్లుగా అందకుండా ఊరిస్తున్న ఉత్తమ నటుడి అవార్డు ఈసారి సాధ్యమైంది. తాజాగా 2021 సంవత్సరానికి ప్రకటించిన జాతీయ అవార్డుల్లో తెలుగు సినిమా మొత్తం 11 కేటగిరీల్లో పురస్కారాలు సొంతం చేసుకుంది. ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ నిలవడం సరికొత్త ఘనత అని చెప్పొచ్చు. ఎందుకంటే 69 ఏళ్ల సినీ చరిత్రలో ఓ తెలుగు నటుడికి జాతీయ అవార్డు రావడం ఇదే ఫస్ట్ టైమ్. అలానే డీఎస్పీ కూడా ‘పుష్ప’ సాంగ్స్‌కి గానూ అవార్డు అందుకోనున్నాడు. అసలు వీళ్లిద్దరికీ కలిసొచ్చిన అంశాలేంటి?

పాటలు వైరల్
సినిమాలో కథ ఎలాంటిదైనా సరే జనాల్లో అంచనాలు పెరగాలంటే ప్రమోషనల్ కంటెంట్ ముఖ్యం. ఆ విషయంలో ‘పుష్ప’ ఫుల్ మార్క్స్ కొట్టేసింది. ఎందుకంటే రిలీజ్ చేసిన ప్రతీపాట కూడా జనాలకు తెగ నచ్చేసింది. శ్రీవల్లి, సామీ సామీ, ఏయ్ బిడ్డా, ఊ అంటావా మావ, దాక్కో దాక్కో.. ఇలా ప్రతీ సాంగ్ జనం నోళ్లలో నానింది.

విదేశాల్లోనూ హవా
పుష్ప పాటలు తెలుగు వరకే పరిమితం కాలేదు. విదేశాల్లోనూ సెన్సేషన్ క్రియేట్ చేశాయి. పుష్ప రిలీజ్‌కి కొన్నిరోజుల ముందు, ఆ తర్వాత కూడా ఎక్కడా చూసిన పుష్ప పాటలకు డ్యాన్స్, రీల్స్ తెగ కనిపించాయి, వినిపించేవి. పాటలన్నీ మిలియన్ల కొద్దీ వ్యూస్‌తో సినిమాపై భారీ అంచనాలు పెంచాయి.

వీకెండ్‌లో హిట్‌ టాక్‌..
‘పుష్ప’ సినిమా రిలీజైన తొలిరోజు చాలామంది బాగోలేదని అన్నారు. కానీ వీకెండ్ పూర్తయ్యేసరికి టాక్ మొత్తం మారిపోయింది. బ్లాక్‌బస్టర్ హిట్ సొంతం చేసుకుంది. తెలుగుతోపాటు సౌత్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక నార్త్‌లో పుష్ప దెబ్బకు బన్నీ.. పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు.

ఊరమాస్ పాత్రలో..
అల్లు అర్జున్ డిఫరెంట్ పాత్రలు చేయడంలో ఎక్స్‌పర్ట్. పుష్ప కోసం మరింత కష్టపడ్డాడు. చిత్తూరు యాసతోపాటు డీగ్లామర్ లుక్‌తో ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నాడు. కామెడీ, ఎమోషన్, ఫైట్స్.. ఇలా అన్ని అంశాల్లోనూ ఊరమాస్ ఫెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. దీంతో ఆలోవర్ ఇండియా అల్లు అర్జున్‌కి ఫిదా అయింది. ఇప్పుడు ఏకంగా జాతీయ అవార్డు వరించింది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Oktelugu Epaper