spot_img
Homeఎంటర్టైన్మెంట్Pawan - Dil Raju : దిల్ రాజు ను పవన్ కళ్యాణ్ కోరిన ఏకైక...

Pawan – Dil Raju : దిల్ రాజు ను పవన్ కళ్యాణ్ కోరిన ఏకైక కోరిక ఇదే

తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న హీరోలు దర్శకులు చాలామంది ఉన్నారు. అయితే ప్రొడ్యూసర్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న వాళ్లలో దిల్ రాజు ఒకరు. ఆయన చేసిన చాలా సినిమాలు ఇండస్ట్రీలో మంచి విజయాలను సాధించాయి. ఇక ఆయన నుంచి ఒక సినిమా వస్తుంది అంటే చాలు ఇప్పటికి చాలామంది అభిమానులు ఆ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. మరి ఇలాంటి సందర్భంలోనే దిల్ రాజు గేమ్ చేంజర్ సినిమాను నిర్మిస్తున్న విషయం మనకు తెలిసిందే. రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకి శంకర్ డైరెక్షన్ చేస్తున్నాడు… ఇక ఈ సినిమా జనవరి 10వ తేదీన రిలీజ్ అవుతున్న నేపధ్యంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను రాజమండ్రిలో నిర్వహించారు. మరి ఈ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా రావడం విశేషం…

ఇక పవన్ కళ్యాణ్ ఈ సినిమా యూనిట్ కి బెస్ట్ విషెస్ ను తెలియజేస్తూనే సినిమా ఇండస్ట్రీలో హీరోలు ఎలా ఉండాలి ఎలా నడుచుకోవాలి. సినిమా ఇండస్ట్రీని ఎలా ముందుకు తీసుకెళ్లాలి అనే ధోరణిలో మాట్లాడాడు. ఇక మొత్తానికైతే ఈ సినిమా ప్రొడ్యూసర్ అయిన దిల్ రాజు గురించి చాలా గొప్పగా మాట్లాడాడు. తన తొలిప్రేమ సినిమాకి మొదటగా డిస్ట్రిబ్యూటర్ గా ఇండస్ట్రీకి వచ్చిన దిల్ రాజు ఆ సినిమా సక్సెస్ అవ్వడంతో మరి కొన్ని సినిమాలకు డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరించి ఆ తర్వాత ప్రొడ్యూసర్ గా మారారు.

కాబట్టి ఆయన అంచెలంచెలుగా తఎదుగుతూ వచ్చాడు. తన లాంటి ప్రొడ్యూసర్ సినిమా ఇండస్ట్రీలో ఉండడం ఇండస్ట్రీ కి చాలా అవసరం అంటూ మాట్లాడాడు. అలాగే రీసెంట్ గా తెలంగాణ ప్రభుత్వం అతన్ని తెలుగు ఫిలిం డెవలప్మెంట్ ఛైర్మెన్ (టీ ఎఫ్ డి సి) గా నియమించిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ అతనికి కృతజ్ఞతలు తెలియజేస్తూనే తెలంగాణలో మాత్రమే కాదు. ఆంధ్రలో కూడా సినిమా ఇండస్ట్రి ని డెవలప్ చేసే పరిస్థితులను ఏర్పాటు చేయండి ఇటూ సైడ్ కూడా చాలా మంచి లోకేషన్స్ ఉన్నాయి.

ఇక్కడికి వచ్చి షూటింగ్స్ చేసుకోండి దానికి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మీకు పూర్తిగా సహకారం అందిస్తుంది. అలాగే వీలైతే ఇక్కడ స్టూడియోలను నిర్మించండి. సినిమాలకు సంభందించిన క్లాస్ లను ఏర్పాటుచేసి శిక్షణ పెట్టించండి. రాజమౌళి, త్రివిక్రమ్ లాంటి గొప్ప గొప్ప వాళ్ళ చేత డైరెక్షన్ ఎలా చేయాలి అనే దాని మీద ఇక్కడ వర్క్ షాప్స్ ని కండక్ట్ చేయించండి అంటూ పవన్ కళ్యాణ్ దిల్ రాజుకు చెబుతూ వచ్చాడు. ఇక తెలంగాణలో మాత్రమే కాదు ఆంధ్ర మీద కూడా కొంచెం ఫోకస్ చేయండి అంటూ పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి…

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Most Popular

America Politics: అమెరికాకు యువ అధ్యక్షురాలు.. పోల్స్ తో ఈ 36 ఏళ్ల మహిళకే ఓటు

America Politics: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరిగి ఏడాదిన్నర అయింది. నాలుగేళ్లకోసారి ఎన్నికలు జరుగుతాయి. ఏడాదిన్నర క్రితం జరిగిన ఎన్నికల్లో డొనాల్డ్‌ ట్రంప్‌ రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. అంతకుముందు జోబైడెన్‌ అధ్యక్షుడిగా...

Chiranjeevi: చిరంజీవి కెరియర్ లో చేసిన మూడు తప్పులు ఇవే…

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి హీరోగా చేసిన సినిమాలు అతన్ని టాప్ లెవెల్లో నిల్చోబెట్టాయి. ఒక సామాన్య మానవుడు సైతం సినిమా ఇండస్ట్రీకి వచ్చి ఇక్కడ హీరోగా మారవచ్చు అని ప్రూవ్ చేసిన...

Vijay Deverakonda: విజయ్ దేవరకొండ మూవీ రిలీజ్ పోస్ట్ పోన్ వెనక ఇన్ని కారణాలున్నాయి…

Vijay Deverakonda: 'అర్జున్ రెడ్డి' సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోగా మారిపోయిన నటుడు విజయ్ దేవరకొండ... ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాల విషయంలో చాలా కేర్ ఫుల్ గా...

Ramayana Trailer Postponed: ‘రామాయన్ ‘ ట్రైలర్ విడుదల వాయిదా.. సంచలనం రేపుతున్న పోస్ట్..

Ramayana Trailer Postponed: బాలీవుడ్ లో నితీష్ తివారీ దర్శకత్వం లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన 'రామాయన్' మూవీ కి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ని నేడు గ్రాండ్ గా విడుదల చెయ్యాలని...

Super El Nino: వచ్చే రోజుల్లో సూపర్ ఎల్ నినో.. తెలుగు రాష్ట్రాల్లో ప్రభావం ఎలా ఉంటుందంటే..

Super El Nino: సాంకేతిక పరిజ్ఞానం పెరిగింది. గతంతో పోల్చి చూస్తే వాతావరణం మీద శాస్త్రవేత్తలకు అవగాహన మరింత పెరిగింది. అందువల్లే వర్షాలు.. ఎండలు.. కరువు కాటకాల గురించి అత్యంత స్పష్టంగా...
Oktelugu Epaper
Exit mobile version