spot_img
Homeఆంధ్రప్రదేశ్‌Super El Nino: వచ్చే రోజుల్లో సూపర్ ఎల్ నినో.. తెలుగు రాష్ట్రాల్లో ప్రభావం ఎలా...

Super El Nino: వచ్చే రోజుల్లో సూపర్ ఎల్ నినో.. తెలుగు రాష్ట్రాల్లో ప్రభావం ఎలా ఉంటుందంటే..

Super El Nino: సాంకేతిక పరిజ్ఞానం పెరిగింది. గతంతో పోల్చి చూస్తే వాతావరణం మీద శాస్త్రవేత్తలకు అవగాహన మరింత పెరిగింది. అందువల్లే వర్షాలు.. ఎండలు.. కరువు కాటకాల గురించి అత్యంత స్పష్టంగా చెబుతున్నారు. ఇటీవల కాలంలో ఎల్ నినో గురించి శాస్త్రవేత్తలు విస్తృతంగా చెబుతున్నారు. దీని గురించి అత్యంత లోతుగా అధ్యయనం చేస్తున్నారు. అంతేకాదు జరగబోయే పరిణామాలు కూడా వివరిస్తూనే ఉన్నారు.

వాతావరణం లో విపరీతమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. పసిఫిక్ మహాసముద్రంలో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ ప్రభావం వాతావరణం మీద తీవ్రంగా కనిపిస్తోంది. వాస్తవానికి ఎల్ నినో అనేది ప్రకృతి చక్రంలో జరుగుతూనే ఉంటుంది.. కానీ మానవ చర్యల వల్ల సముద్రంలో వేడి పెరిగిపోతుంది. వాతావరణం లో ఉన్న 90% వేడిని సముద్రం గ్రహిస్తూ ఉంటుంది. అభివృద్ధి వల్ల.. ఇంకా రకరకాల మానవ చర్యల వల్ల గత ఏడాది నమోదైన ఉష్ణోగ్రతలను ఒకసారి గనుక పరిశీలిస్తే.. ప్రతి సెకండ్ కాలానికి 12 హీరో షిమా న్యూక్లియర్ బాంబులను పేల్చితే ఎంత వేడి ఉంటుందో.. అంత వేడిని సముద్రం గ్రహిస్తుంది. అందువల్లే వాతావరణంలో ఇలాంటి మార్పులు కనిపిస్తున్నాయి. దీనిని సూపర్ ఎల్ నినో అంటున్నారు.వచ్చే రోజుల్లో దీని ప్రభావం అధికంగా ఉంటుందని శాస్త్రవేత్తలు అంటున్నారు.

ఎల్ నినో ప్రభావం వల్ల తెలుగు రాష్ట్రాలు తీవ్రంగా ఒత్తిడి ఎదుర్కొనే అవకాశం ఉండొచ్చు. అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. రాత్రిపూట కూడా వేడి ఎక్కువగా ఉంటుంది. వర్షాలు కురిసే అవకాశం ఉండదు. బలహీనమైన మేఘాలు ఏర్పడతాయి. నీటి నిల్వల మీద విపరీతమైన ఒత్తిడి ఉంటుంది. అయితే ఈ సమస్యను ఎదుర్కోవడానికి తాత్కాలిక ప్రణాళికలు లాభాన్ని కలిగించవు. ముఖ్యంగా తక్కువ కాలపరిమితి ఉన్న పంటలను రైతులు పెంచుకోవాలి. రిజర్వాయర్ల నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉండకూడదు. కొన్ని సందర్భాలలో భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంటుంది.. విద్యుత్ డిమాండ్ ను దృష్టిలో పెట్టుకొని సరఫరా చేయాల్సి ఉంటుంది.

సెప్టెంబర్ వరకు కూడా రుతుపవనాలు బలహీనంగానే ఉంటాయి. అలాంటప్పుడు వర్షాలు కురిసే అవకాశం తక్కువగా ఉంటుంది. రిజర్వాయర్లలో నీటి నిల్వలు తగ్గిపోతాయి. అనేక రకాలుగా ఒత్తిడి వాతావరణం ఉంటుంది. ఇది ఇలా కొనసాగుతుండగానే వేసవికాలం ప్రవేశిస్తుంది. పెరిగిన ఉష్ణోగ్రతలతో అప్పుడు మరింత ఆందోళన ఏర్పడుతుంది.. ఉష్ణోగ్రతలు మరింత పెరిగితే 2027లో వేడి ఎక్కువగా నమోదవుతుంది. ఎల్ నినో వల్ల ఇబ్బంది ఉంటే..ఇలాంటి పరిస్థితులకు కారణమైన సూపర్ ఎల్ నినో మరింత ఇబ్బందిపెడుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Most Popular

Chiranjeevi: చిరంజీవి కెరియర్ లో చేసిన మూడు తప్పులు ఇవే…

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి హీరోగా చేసిన సినిమాలు అతన్ని టాప్ లెవెల్లో నిల్చోబెట్టాయి. ఒక సామాన్య మానవుడు సైతం సినిమా ఇండస్ట్రీకి వచ్చి ఇక్కడ హీరోగా మారవచ్చు అని ప్రూవ్ చేసిన...

Vijay Deverakonda: విజయ్ దేవరకొండ మూవీ రిలీజ్ పోస్ట్ పోన్ వెనక ఇన్ని కారణాలున్నాయి…

Vijay Deverakonda: 'అర్జున్ రెడ్డి' సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోగా మారిపోయిన నటుడు విజయ్ దేవరకొండ... ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాల విషయంలో చాలా కేర్ ఫుల్ గా...

Ramayana Trailer Postponed: ‘రామాయన్ ‘ ట్రైలర్ విడుదల వాయిదా.. సంచలనం రేపుతున్న పోస్ట్..

Ramayana Trailer Postponed: బాలీవుడ్ లో నితీష్ తివారీ దర్శకత్వం లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన 'రామాయన్' మూవీ కి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ని నేడు గ్రాండ్ గా విడుదల చెయ్యాలని...

AP Rain Alert: ఏపీలో మారిన వాతావరణం.. ఆ జిల్లాలకు హెచ్చరిక!

AP Rain Alert: దేశవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఆశించిన స్థాయిలో వర్షాలు పడటం లేదు. వర్షపాతం లోటు కనిపిస్తోంది. ఎల్ నినో ప్రభావం స్పష్టంగా ఉంది. ఇటువంటి తరుణంలో మళ్లీ వాతావరణం...
Oktelugu Epaper
Exit mobile version