Site icon OkTelugu

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ఓపెనింగ్ రికార్డు ని బ్రేక్ చేయకుండానే రిటైర్ అయిపోయిన సీఎం విజయ్..

Jana Nayagan Advance Bookings

Jana Nayagan Advance Bookings

Pawan Kalyan : ఈమధ్య కాలం లో సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ , విజయ్ ల మధ్య పోలికలు పెడుతూ , అభిమానుల మధ్య జరుగుతున్న ఫ్యాన్ వార్స్ ని మన కళ్లారా చూస్తూనే ఉన్నాం. తమిళనాడు రాష్ట్రానికి విజయ్ ముఖ్యమంత్రి కాగా, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయ్యారు. అయితే విజయ్ పార్టీ పెట్టిన రెండేళ్లకే ముఖ్యమంత్రి అయితే , పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టిన 10 ఏళ్లకు ఉప ముఖ్యమంత్రి అయ్యారు, పవన్ కళ్యాణ్ కంటే విజయ్ గొప్ప అని కొందరు కామెంట్స్ చేయడం , అందుకు పవన్ ఫ్యాన్స్ కూడా చాలా ధీటుగా సమాధానం చెప్పడం , ఇలా ఇద్దరి హీరోల అభిమానుల మధ్య కొట్లాటలు జరుగుతూనే ఉన్నాయి. ఇకపోతే నేడు సీఎం విజయ్ నటించిన చివరి చిత్రం ‘జన నాయగన్ ‘ ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో అన్నీ ప్రాంతీయ భాషల్లో విడుదలైంది.

ఈ చిత్రానికి మొదటి ఆట నుండే ఫ్లాప్ టాక్ వచ్చినప్పటికీ , విజయ్ చివరి చిత్రం కావడం తో ఓపెనింగ్ వసూళ్లు అదిరిపోయాయి. అయితే విడుదలకు ముందు ఈ సినిమా ఓపెనింగ్స్ పై ఉన్నటువంటి అంచనాలు వేరు. సీఎం అయ్యాక విజయ్ నుండి వస్తున్న మొదటి చిత్రం , చివరి చిత్రం రెండు ఇదే కావడం తో , కచ్చితంగా ఈ సినిమాకు 140 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వస్తాయని విజయ్ ఫ్యాన్స్ సవాళ్లు చేశారు , ట్రేడ్ విశ్లేషకులు కూడా అదే రేంజ్ అంచనాలతో ఉండేవారు. కానీ చివరికి 80 నుండి 85 కోట్ల గ్రాస్ వసూళ్లు మాత్రమే ఈ చిత్రానికి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. మంచి ఓపెనింగ్ వసూళ్లే , కానీ పవన్ కళ్యాణ్ కెరీర్ హైయెస్ట్ ఓపెనింగ్ వసూళ్లను అందుకోకుండానే విజయ్ సినిమాల నుండి రిటైర్ అయ్యారని పవన్ ఫ్యాన్స్ ఇప్పుడు కామెంట్స్ చేస్తున్నారు.

పవన్ కళ్యాణ్ నటించిన ‘ఓజీ’ చిత్రానికి వరల్డ్ వైడ్ గా మొదటి రోజు 154 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. అదే విధంగా విజయ్ , లోకేష్ కనకరాజ్ దర్శకత్వం లో తెరకెక్కిన ‘లియో’ చిత్రానికి 135 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు మాత్రమే మొదటి రోజున వచ్చాయి. ఈ రికార్డు ని విజయ్ భవిష్యత్తులో బద్దలు కొడుతారని అంతా అనుకున్నారు. అది ‘జన నాయగన్’ తో అవుతుందని సవాలు చేశారు. కట్ చేస్తే అది కూడా విఫలం అయ్యింది. ఇక విజయ్ కి ఇదే చివరి చిత్రం కావడంతో, తమిళనాడు ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మొదటి రోజు వసూళ్లను దాటకుండానే రిటైర్ అయిపోయారు అంటూ సోషల్ మీడియా లో పవన్ ఫ్యాన్స్ ట్రోల్స్ చేస్తున్నారు.

Exit mobile version