‘Chiranjeevi : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘గేమ్ చేంజర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న రాజమండ్రి లో ఎంత అట్టహాసంగా జరిగిందో మనమంతా చూసాము. ఈ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మెగా అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేని అద్భుతమైన జ్ఞాపకాలను అందించాడు. రామ్ చరణ్ మీద ఆయన ప్రేమ కురిపిస్తూ మాట్లాడిన మాటలు ‘రంగస్థలం’ సక్సెస్ మీట్ ని తలపించింది. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి పడిన కష్టం గురించి, ఆయన కారణంగానే మేమంతా ఈ స్థానం లో ఉన్నాము అంటూ ఆయన చెప్పిన విధానం అభిమానులను భావోద్వేగంతో కంటతడి పెట్టేలా చేసింది. ‘ఎక్కడో మారుమూల గ్రామం నుండి ఎలాంటి అండాదండా లేకుండా ఇంత దూరం వచ్చి, ఆయన సక్సెస్ అవ్వడమే కాకుండా మా అందరికీ జీవితాలను ప్రసాదించి, కోట్లాది మంది అభిమానులకు ఆదర్శప్రాయుడు అయ్యాడు’ అంటూ ఆయన చెప్పిన మాటలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.
‘ఎంత ఎత్తుకి ఎదిగినా మూలాలు మర్చిపోకూడదు..నేను ఈరోజు ఈ స్థాయిలో నిలబడి ఇంత మందికి సేవ చేస్తూ, మారుమూలో గ్రామాల్లోకి వెళ్లి కూడా రోడ్లు వెయ్యిస్తున్నాను, వాళ్ళ కష్టాలు తీరుస్తున్నాను అంటే అందుకు కారణం మెగాస్టార్ చిరంజీవి గారే’ అంటూ పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు అభిమానులు ఎంతో ఉత్సాహంతో సోషల్ మీడియా లో షేర్ చేస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ తన అన్నయ్య మీద చూపించిన ప్రేమకి, కొద్దినెలల క్రితం చిరంజీవి తన తమ్ముడి మీద ప్రేమ చూపిస్తూ మాట్లాడిన మాటలను జత చేసి ఒక వీడియో ని చేసారు అభిమానులు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ ఆ మారింది. పవన్ కళ్యాణ్ ఎన్నో సందర్భాల్లో తనకు చిరంజీవి గారు అన్నయ్య కాదు, తండ్రి అంటూ చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే.
అదే విధంగా చిరంజీవి కూడా ఎన్నో సందర్భాలలో పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ ‘నాకు రామ్ చరణ్ లాగానే పవన్ కళ్యాణ్ కూడా మరో కొడుకు లాంటోడు. వాడి విజయాన్ని నా విజయం గా భావిస్తాను’ అంటూ చెప్తాడు. ఈ రెండు వీడియోలను ఎడిట్ చేసి ఒక వీడియో గా సోషల్ మీడియా లో అభిమానులు షేర్ చేయగా, అది ఇప్పుడు తెగ వైరల్ గా మారింది. రామ లక్ష్మణులు ఎలా ఉంటారు అనేది మేము సినిమాల్లో చూసాము, పుస్తకాల్లో చదివాము, కానీ నిజ జీవితం లో రామ లక్ష్మణులు అంటే చిరంజీవి, పవన్ కళ్యాణ్ లను ఉదాహరణగా తీసుకోవచ్చు, ఈ కాలం లో అన్నదమ్ముల మధ్య ఇంత సాన్నిహిత్యం ఎక్కడ ఉంది అంటూ సోషల్ మీడియా లో అభిమానులు ఎమోషనల్ గా కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నిన్న ఇచ్చిన ప్రసంగం యూట్యూబ్ లో టాప్ రేంజ్ లో ట్రెండ్ అవుతుంది.