https://oktelugu.com/

Ram Charan : నా కూతురు నన్ను నాన్న అని పిలిచేంత వరకు ఆ పని చేయను’ అంటూ ‘అన్ స్టాపబుల్ 4’ ఎపిసోడ్ లో రామ్ చరణ్ ఎమోషనల్ కామెంట్స్!

ఆడపిల్ల పుడితే అమ్మవారు పుట్టినట్టే' అని బాలయ్య అంటాడు. ఆ తర్వాత రామ్ చరణ్ క్లిన్ కారా గురించి మాట్లాడుతూ చాలా ఎమోషనల్ అవుతాడు. అభిమానులకు పాప ముఖాన్ని ఎప్పుడు చూపిస్తావు అని బాలయ్య అడగగా, నన్ను ఆమె నాన్న అని పిలిచిన రోజు అందరికి ఆమె ముఖాన్ని చూపిస్తాను అంటూ చెప్పుకొచ్చాడు రామ్ చరణ్.

Written By:
  • Vicky
  • , Updated On : January 5, 2025 / 12:02 PM IST

    Ram Charan

    Follow us on

    Ram Charan :  గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూతురు క్లిన్ కారా ని ఆయన అభిమానులు ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు రామ్ చరణ్ తన కూతురితో కలిసి ఉన్న ఫోటోలను చాలానే సోషల్ మీడియా లో అప్లోడ్ చేసాడు కానీ, ఒక్క దాంట్లో కూడా ఆమె ముఖాన్ని అభిమానులకు చూపించలేదు. కాసేపటి క్రితమే విడుదల చేసిన ‘అన్ స్టాపబుల్ 4’ ప్రోమో లో బాలయ్య క్లిన్ కారా గురించి పలు ప్రశ్నలు అడుగుతాడు. ‘2023 వ సంవత్సరంలో మీ నాన్నకి నువ్వు ఇచ్చిన అద్భుతమైన కానుక క్లిన్ కారా..ఆడపిల్ల పుడితే అమ్మవారు పుట్టినట్టే’ అని బాలయ్య అంటాడు. ఆ తర్వాత రామ్ చరణ్ క్లిన్ కారా గురించి మాట్లాడుతూ చాలా ఎమోషనల్ అవుతాడు. అభిమానులకు పాప ముఖాన్ని ఎప్పుడు చూపిస్తావు అని బాలయ్య అడగగా, నన్ను ఆమె నాన్న అని పిలిచిన రోజు అందరికి ఆమె ముఖాన్ని చూపిస్తాను అంటూ చెప్పుకొచ్చాడు రామ్ చరణ్.

    ఉపాసన గురించి ఒక ప్రశ్న అడుగుతూ ‘మీ మధ్య ఏదైనా గొడవ జరిగినప్పుడు ప్యాచప్ చేయడానికి ఏమి చేస్తావు’ అని బాలయ్య అడగగా, దానికి రామ్ చరణ్ సమాధానం చెప్తూ ‘రైమ్ అని నా కుక్క పిల్ల ఉంది. దానిని ఆమె వద్దకు పంపిస్తాను’ అని అంటాడు. ఆ తర్వాత రైమ్ కూడా స్టేజి మీదకు వస్తుంది. ఆ కుక్కపిల్లతో రామ్ చరణ్ తనకి ఉన్న అనుబంధం గురించి కూడా చెప్పుకొస్తాడు. ‘బెస్ట్ ఫ్రెండ్ గా నువ్వు ఎలాంటి వాడివో తెలుసుకోవడానికి నీ స్నేహితులను కొంతమందిని సెట్ చేశా’ అని చెప్పి శర్వానంద్, వికాస్ లను స్టేజి మీదకు తీసుకొస్తాడు బాలయ్య. వీళ్ళతో కాసేపు బాలయ్య సరదాగా మాట్లాడిన మాటలు ప్రోమో లో హైలైట్ గా నిలిచాయి. ‘మెసేజ్ లో నేను దొరకను సార్’ అని శర్వానంద్ అంటాడు.

    ‘దొరికితే ఆడే దొరుకుతాడు సార్..అమాయకుడు’ అని వికాస్ వైపు చూపిస్తాడు రామ్ చరణ్. బాలయ్య ఏ ప్రశ్న అడిగితే ఈ సమాధానం వాళ్ళ నుండి వచ్చింది అనేది మాత్రం సస్పెన్స్. శర్వానంద్ ఫోన్ ఒకసారి తీసుకొని రండి అయ్యా అని బాలయ్య అంటాడు, అప్పుడు శర్వానంద్ నేను అసలు ఫోన్ తీసుకొని రాలేదు సార్ అంటాడు, పోయినసారి కూడా అలాగే నా దగ్గర ఫోన్ తీసుకొని రష్మిక కి ఫోన్ చేసారు, తను నాకు ఫ్రెండ్ సార్ అని శర్వానంద్ అనగా, నీకు ఫ్రెండ్ అయ్యా, నాకు గర్ల్ ఫ్రెండ్ అని అంటాడు బాలయ్య. అలా వీళ్ళ మధ్య జరిగిన సంభాషణ చాలా ఫన్నీ గా అనిపించింది. ఇక ప్రోమో చివర్లో రామ్ చరణ్ ప్రభాస్ కి ఫోన్ చేయగా, ప్రభాస్ చివర్లో ‘చరణ్ ని ఇరికించాలని అనుకుంటే నన్ను బుక్ చేసేలా ఉన్నాడు సార్’ అని అంటాడు ప్రభాస్. సోషల్ మీడియా లో వైరల్ గా మారిన ఈ ప్రోమో ని మీరు కూడా చూసేయండి.