spot_img
Homeఎంటర్టైన్మెంట్Vijay Deverakonda: విజయ్ దేవరకొండ మూవీ రిలీజ్ పోస్ట్ పోన్ వెనక ఇన్ని కారణాలున్నాయి...

Vijay Deverakonda: విజయ్ దేవరకొండ మూవీ రిలీజ్ పోస్ట్ పోన్ వెనక ఇన్ని కారణాలున్నాయి…

Vijay Deverakonda: ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోగా మారిపోయిన నటుడు విజయ్ దేవరకొండ… ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాల విషయంలో చాలా కేర్ ఫుల్ గా వ్యవహరిస్తున్నాడు. ఈ మధ్యకాలంలో ఆయనకు వరుసగా ఫ్లాప్ లు రావడంతో ఆయన ఎలాగైనా సరే స్టార్ హీరోగా మారాలనే ప్రయత్నంలో ఉన్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన నుంచి వస్తున్న సినిమాలన్నీ ప్రేక్షకులను విశేషంగా అలరిస్తున్న నేపథ్యంలో గత కొద్ది రోజుల నుంచి అతనికి సరైన సక్సెసులైతే లేవు. కాబట్టి ఇప్పుడు చేస్తున్న ‘రణబాలి’ సినిమాతో యావత్ తెలుగు సినిమా ప్రేక్షకులందరిని మెప్పించాలనే ప్రయత్నంలో ఉన్నాడు. అయితే ఈ సినిమా సెప్టెంబర్ 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తుందంటూ అనౌన్స్ చేసినప్పటికి ప్రస్తుతం సినిమా షూటింగ్ అనుకున్న మేరకు కంప్లీట్ కాలేకపోయింది. దానివల్ల సినిమాని పోస్ట్ పోన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇంక దాంతో పాటుగా ఇప్పటివరకు చేసిన సినిమా షూటింగ్ అద్భుతంగా వచ్చిందట.

కాబట్టి తొందర తొందరగా సినిమాను చుట్టేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం కంటే దానిని ఎఫెక్టివ్ గా మలిచి ప్రేక్షకులను అలరించే విధంగా సినిమాను తీర్చి దిద్దితే బాగుంటుందనే ధోరణిలో ఆయన ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. తను అనుకున్నట్టుగానే ఈ సినిమా ఏ రేంజ్ సక్సెస్ ని సాధిస్తుంది.

ప్రేక్షకులను మెప్పించగలుగుతుందా? లేదా అనేది తెలియాల్సి ఉంది. దర్శకుడు సైతం ఈ సినిమాతో విజయ్ దేవరకొండ ను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తానని అతనికి మాటిచ్చారట. ఇంతకుముందు వీళ్ళ కాంబినేషన్ లో ‘టాక్సీవాలా’ అనే సినిమా వచ్చింది. ఆ సినిమా కూడా ప్రేక్షకులను విశేషంగా అలరించడంతో ప్రేక్షకుల్లో మంచి అంచనాలైతే ఉన్నాయి.

ఇక దానికి తగ్గట్టుగానే వీళ్ళు రానిస్తారా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో ఆయన భారీ విజయాన్ని సాధిస్తాడా లేదా అనేది తెలియాల్సి ఉంది… ఇప్పటికే విజయ్ దేవరకొండ డిఫరెంట్ సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నాడు. ఇక ఈ మూవీ తో పాటుగా రౌడీ జనార్ధన్ అనే సినిమాను కూడా చేస్తున్నాడు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Most Popular

Chiranjeevi: చిరంజీవి కెరియర్ లో చేసిన మూడు తప్పులు ఇవే…

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి హీరోగా చేసిన సినిమాలు అతన్ని టాప్ లెవెల్లో నిల్చోబెట్టాయి. ఒక సామాన్య మానవుడు సైతం సినిమా ఇండస్ట్రీకి వచ్చి ఇక్కడ హీరోగా మారవచ్చు అని ప్రూవ్ చేసిన...

Ramayana Trailer Postponed: ‘రామాయన్ ‘ ట్రైలర్ విడుదల వాయిదా.. సంచలనం రేపుతున్న పోస్ట్..

Ramayana Trailer Postponed: బాలీవుడ్ లో నితీష్ తివారీ దర్శకత్వం లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన 'రామాయన్' మూవీ కి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ని నేడు గ్రాండ్ గా విడుదల చెయ్యాలని...

Super El Nino: వచ్చే రోజుల్లో సూపర్ ఎల్ నినో.. తెలుగు రాష్ట్రాల్లో ప్రభావం ఎలా ఉంటుందంటే..

Super El Nino: సాంకేతిక పరిజ్ఞానం పెరిగింది. గతంతో పోల్చి చూస్తే వాతావరణం మీద శాస్త్రవేత్తలకు అవగాహన మరింత పెరిగింది. అందువల్లే వర్షాలు.. ఎండలు.. కరువు కాటకాల గురించి అత్యంత స్పష్టంగా...

AP Rain Alert: ఏపీలో మారిన వాతావరణం.. ఆ జిల్లాలకు హెచ్చరిక!

AP Rain Alert: దేశవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఆశించిన స్థాయిలో వర్షాలు పడటం లేదు. వర్షపాతం లోటు కనిపిస్తోంది. ఎల్ నినో ప్రభావం స్పష్టంగా ఉంది. ఇటువంటి తరుణంలో మళ్లీ వాతావరణం...
Oktelugu Epaper
Exit mobile version