https://oktelugu.com/

Heroines: 50 సంవత్సరాల వయసు వచ్చిన పెళ్లి చేసుకోకుండా ఒంటరిగానే ఉన్న హీరోయిన్లు వీళ్లే…

తెలుగులో నాగార్జున హీరోగా వచ్చిన నిన్నే పెళ్ళాడుతా సినిమాతో హీరోయిన్ గా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న టబు ఆ తర్వాత చాలా సినిమాల్లో హీరోయిన్ గా నటించింది.

Written By:
  • Gopi
  • , Updated On : December 28, 2023 / 11:30 AM IST

    Heroines

    Follow us on

    Heroines: సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోయిన్లు వాళ్లు సినిమాల్లో హీరోయిన్స్ గా సక్సెస్ అయినంత కాలం తమ హవాని కొనసాగిస్తూ వరుసగా అవకాశాలు అందుకుంటూ సక్సెస్ రేట్ ని పెంచుకుంటూ పోతుంటారు. ఇక ఈ క్రమంలోనే కొంతమంది హీరోయిన్లు హీరోయిన్ గా సక్సెస్ అయిన తర్వాత వాళ్ల కెరియర్ ని చాలా బాగా మలుచుకుంటారు. అలాగే ఇక హీరోయిన్ గా ఫెయిడ్ అవుట్ అవుతున్న క్రమంలో పెళ్లి గురించి ఆలోచించి ఎవరో ఒకరిని పెళ్లి చేసుకుంటారు. కానీ కొంతమంది హీరోయిన్లు మాత్రం 50 సంవత్సరాల వయసుకు చేరువలో ఉన్నప్పటికీ ఇంకా కూడా పెళ్లి చేసుకోకుండా ఒంటరిగానే జీవితాన్ని గడుపుతున్నారు. వాళ్లేవరో ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

    టబు
    తెలుగులో నాగార్జున హీరోగా వచ్చిన నిన్నే పెళ్ళాడుతా సినిమాతో హీరోయిన్ గా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న టబు ఆ తర్వాత చాలా సినిమాల్లో హీరోయిన్ గా నటించింది.స్టార్ హీరోలందరితో నటించి తనకంటూ ప్రత్యేకతను చాటుకుంది.ఇక ఇప్పుడు 50 సంవత్సరాల వయస్సు వచ్చిన కూడా ఆమె పెళ్లి చేసుకోకుండా ఒంటరిగానే తన జీవితాన్ని గడుపుతుంది. అయితే ఈమె ఒక హీరోతో ప్రేమలో పడి ఇలా పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉండిపోయిందని చాలామంది చెప్తూ ఉంటారు…

    నగ్మా
    నగ్మా ఒకప్పుడు స్టార్ హీరోలు అందరితో మంచి సినిమాలను చేసి తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకున్న నగ్మా ప్రస్తుతం 50 సంవత్సరాల వయసులో ఉండి కూడా పెళ్లి అనే ప్రస్తావన తీసుకురాకుండా ఒంటరిగానే తన కెరియర్ ని సాగిస్తుంది అయితే ఈమె స్టార్ హీరోయిన్ గా ఉన్నప్పుడు ఇండియన్ టీం కెప్టెన్ అయిన సౌరవ్ గంగూలీతో ప్రేమాయణం నడిపించడమే దానికి కారణం అంటూ కొంతమంది కామెంట్లు చేస్తూ ఉంటారు.

    శోభన
    తెలుగులో చిరంజీవి, బాలకృష్ణ,వెంకటేష్, నాగార్జున లాంటి స్టార్ హీరోలతో సినిమాలు చేసి పెళ్లి చేసుకోకుండా ఒంటరిగానే కాలాన్ని గడుపుతుంది. శోభన పెళ్లి చేసుకోబోతుంది అంటూ అప్పట్లో వార్తలు వచ్చిన కూడా అందులో ఎంత మాత్రం నిజం లేదు అంటూ ఆమె ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చింది. ఇక ఈమె కూడా 50 సంవత్సరాల వయసులో ఉన్నప్పటికీ ఇంకా పెళ్లి చేసుకోకపోవడం పట్ల చాలా మంది చాలా రకాల కామెంట్లు అయితే చేస్తున్నారు…

    అమీషా పటేల్
    ఈమె పేరుకి బాలీవుడ్ హీరోయిన్ అయిన కూడా తెలుగులో చాలా సినిమాల్లో నటించింది. పవన్ కళ్యాణ్ తో బద్రి,మహేష్ బాబుతో నాని, ఎన్టీఆర్ తో నరసింహుడు లాంటి సినిమాల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. ఇక ఈమె కూడా 50 సంవత్సరాల వయసుకు దగ్గరలో ఉన్నప్పటికీ ఆమె ఇంకా పెళ్లి చేసుకోకుండా ఒంటరిగానే తన జీవితాన్ని గడుపుతుంది…