
Salman Khan Heroines : సినీ ఇండస్ట్రీలో ఉన్నవాళ్లపై ఎఫైర్ వార్తలు రోజుకొకటి వినిపిస్తుంది. ఇవి ఎంతవరకు నిజమో తెలియదు గానీ కొన్ని జంటలు మాత్రం ప్రేమలో పడినట్లు కనిపిస్తాయి. ఆ తరువాత దూరమవుతాయి. ఇలాంటివి బీ టౌన్ లో మరీ ఎక్కువ. బాలీవుడ్ హీరో, కండలవీరుడిగా పేరున్న సల్మాన్ ఖాన్ ఇండస్ట్రీకి వచ్చి దశాబ్దాలు గడుస్తోంది. కానీ ఆయన ఇంతవరకు పెళ్లి చేసుకోలేదు. గతంలో సల్మాన్, ఐశ్యర్యరాయ్ ల మధ్య ప్రేమాయణం నడుస్తోందని, వీరిద్దరు కలిసి పెళ్లి చేసుకుంటారని వార్తలు వచ్చాయి. కానీ అది జరగలేదు. ఆ తరువాత కత్రినా కైఫ్ తో సన్నిహితంగా ఉంటున్నారని అన్నారు. కానీ ఆ విషయంపై ఎవరూ స్పందించలేదు. అయితే ఇండస్ట్రీ నుంచి కొందరు తెలుపుతున్న సమాచారం ప్రకారం సల్మాన్ ఖాన్ మొత్తం 13 మంది హీరోయిన్లతో ప్రేమాయణం నడిపాడట. మరి ఆ భామలెవరో చూద్దాం..
ఐశ్వర్యరాయ్:
సల్మాన్ ఖాన్, ఐశ్వర్యరాయ్ లు కలిసి కొన్నిసినిమాల్లో కనిపించారు. దీంతో వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగి ప్రేమలో పడ్డారట.అలా కొన్ని రోజుల పాటు డేటింగ్ కూడా చేశారట. అయితే ఓ విషయంలో సల్మాన్ ఖాన్, ఐశ్వర్యపై దాడి చేశారట. దీంతో వీరిద్దరు బ్రేకప్ చేసుకుంటున్నట్లు ఐశ్వర్య ఓ ఇంటర్వ్యూలో చెప్పేసింది.
కత్రినా కైఫ్:
సల్మాన్ ఖాన్ తో కత్రినా కైఫ్ పెళ్లి దాదాపు దగ్గరి వరకు వచ్చిందని అన్నారు. 4 ఏళ్లపాటు ప్రేమించుకున్న వీరు ఆ తరువాత బ్రేకప్ చెప్పుకున్నారు. ఆ తరువాత కత్రినా రణబీర్ కపూర్ ను ఇష్టపడింది. ఫైనల్ గా విక్కీ కౌశల్ ను పెళ్లి చేసుకుంది.
సంగీత బిజ్లానీ:
సంగీత బిజ్లానీ, సల్మాన్ మధ్య కొన్నిరోజుల పాటు ప్రేమ వ్యవహారం నడిచింది. 1994 మే 27న పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కానీ పలు కారణాల వల్ల రద్దయింది.

సోమి అలీ:
పాకిస్తానీ నటి అయిన సోమి అలితో సల్మాన్ ప్రేమ వ్యవహారం నడిపారు. కానీ ఆమెకు సల్లు భాయ్ బ్రేకప్ చెప్పేశాడు.
షహీన్ జాఫ్రీ:
చదువుకునే రోజుల్లోనే సల్మాన్ షహీన్ తో ప్రేమలో పడ్డారు. కానీ సినిమాల్లోకి వచ్చాక ఆమెను వదిలేశారని అంటుంటారు. షహీన్ జాఫ్రీ స్టార్ నటుడు అశోక్ కుమార్ మనువరాలు.
స్నేహ ఉల్లాల్:
ఐశ్వర్యరాయ్ పోలికలు ఉండడం వల్ల స్నేహ ఉల్లాల్ తో సల్మాన్ ప్రేమలో పడ్డాడు. కానీ కొంత కాలం తరువాత ఆమెకు గుడ్ బై చెప్పాడు.
క్లాడియా:
జర్మన్ నటి క్లాడియాతో ప్రేమాయణం నడిపిన సల్లూభాయ్ ఆ తరువాత మనస్పర్థల కారణంగా విడిపోయారు.
లులియా:
రోమానియాకు చెందిన ఈమెతో కూడా సల్మాన్ లవ్ ఎఫైర్ కొనసాగించాడు.
డైసీ షా:
కన్నడ, హిందీ చిత్రాల్లో నటించి ఫేమస్ అయిన డైసీ షా తో సల్మాన్ కొంతకాలం లవ్ లో పడ్డాడు. కానీ కొన్ని కారణాల వల్ల దూరమయ్యారు.
సోనాక్షి సిన్హా:
‘దబాంగ్’ సినిమాతో ఒక్కటైన ఈ జంట ఆ తరువాత లవ్ చేసుకున్నారు. వీళ్లు పెళ్లి చేసుకుంటారని కూడా ప్రచారం చేశారు. కానీ కొన్ని కారణాల వల్ల దూరమయ్యారు.
మెహెక్ చాహల్:
యూరోపియన్ నటి మెహెక్ చాహల్ తో ప్రేమాయణం సాగించిన సల్మాన్ ఖాన్ ఆమెకూ బ్రేకప్ చెప్పాడు. బిగ్ బాస్ షో ద్వారా వీరిద్దరు కలిశారు.
హేజెల్:
బ్రిటన్ కు చెందిన ఈ బ్యూటీతో సల్మాన్ ఖాన్ తో ప్రేమలో పడడమే కాదు సహజీవనం కూడా చేసింది. ఆ తరువాత ఆమె యువరాజ్ సింగ్ ను పెళ్లి చేసుకోవడంతో సల్మాన్ ఒంటరివాడయ్యాడు.
పూజా హెగ్డే:
లేటేస్టుగా సల్మాన్ ఖాన్ పూజా హెగ్డేతో ఎఫైర్ సాగిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. వీరిద్దరు కలిసి ‘కిసి క బాయ్ కిసి క జాన్’ అనే సినిమాలో కనిపిస్తున్నారు. ఈ చిత్రం త్వరలో విడుదల కాబోతుంది. మరి వీరి రిలేషన్ షిప్ ఎంతకాలం కొనసాగుతుందో చూడాలి.