
Sampangi Heroine : లవ్ ఎమోషనల్ తో పాటు మ్యూజికల్ హిట్టు కొట్టిన ‘సంపంగి’ సినిమాను ఆనాటి సినీ లవర్స్ ఎవరూ మర్చిపోరు. ప్రేమకథా చిత్రాలు అప్పుడప్పుడే వస్తున్న తరుణంలో భిన్నమతాల మధ్య లవ్ స్టోరీతో వచ్చిన ఈ మూవీ అంచనాలు లేకుండా విజయం అందుకుంది. రెండు ఫ్యామిలీల మధ్య జరిగే సంభాషణన ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఒక ముస్లిం అమ్మాయి ప్రేమలో తెలుగు అబ్బాయి పడితే ఎలా ఉంటుంది? అనే కాన్సెప్టుతో వచ్చిన ఈ సినిమాను అంతా ఆదరించారు.
ఈ చిత్రంలోని పాటలు ఇప్పటికీ అలరిస్తూ ఉంటాయి. ఇందులో ‘అందమైన కుందనాల బొమ్మరా’ అనే సాంగ్ యూత్ ఫేవరేట్ గా నిలిచింది. సానా యాదిరెడ్డి డైరెక్షన్లో 2001లో థియేటర్లోకి వచ్చిన ఇందులో కొత్త వాళ్లను పరిచయం చేశారు. హీరోగా దీపక్ నటించగా హీరోయిన్ గా కంచి కౌల్ నటించారు. మొదటి సినిమాతో అందం, అభినయంతో ఆకట్టుకున్న ఈ భామను ఇప్పుడు చూస్తే అస్సలు గుర్తు పట్టరు.
కంచి కౌశల్ ‘సంపంగి’ సినిమాతోనే ఫిల్మ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత ‘ఫ్యామిలీ సర్కస్’, ‘ఇది మా ఆశోక్ గాడి లవ్ స్టోరీ’, ‘శివరామరాజు’ సినిమాల్లో నటించింది. అయితే ఆమె సినీ కెరీర్లో ‘సంపంగి’ ఇచ్చిన హిట్టు మరే మూవీ ఇవ్వలేదని పలు సందర్బాల్లో పేర్కొన్నారు. ఆ తరువాత అమెకు సినిమాల్లో అవకాశాలు తగ్గడంతో టీవీల్లో కనిపించారు. 2005లో ఏక్ లడ్కి అంజనీ సి అనే టీవీ షోలో కనిపించి ఆకట్టుకున్నారు. కానీ ఇక్కడా ఆశించినంత సక్సెస్ రాకపోవడంతో ఇక ఫ్యామిలీ లైఫ్ లో సెటిల్ కావాలని అనుకున్నారు.

2011లో నటుడు షబ్బీర్ అహ్లువాలియాను వివాహం చేసుకుంది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. వివాహం చేసుకున్న తరువాత ఇక సినిమాలకు గుడ్ బై చెప్పింది. అప్పటి నుంచి కొన్నాళ్ల పాటు ఆమె జాడ తెలియలేదు. కానీ ఇటీవల సోషల్ మీడియాలో ఆమె పిక్స్ ఆకట్టుకుంటున్నాయి. అప్పటికీ ఇప్పటికీ ఏమాత్రం అందం తరగని కౌశల్ ను చూసి అంతా షాక్ అవుతున్నారు. సాధారణంగా కొందరు హీరోయిన్లు పెళ్లియిన తరువాత పూర్తిగా మారిపోతారు. కానీ కౌశల్ స్లిమ్ గా కనిపించడం విశేషం.